Thursday, June 3, 2010

తెలుగు వ్యాకరణం - అలంకారాలు

ఈ మధ్యన బొత్తిగా నేను తెలుగు వ్యాకరణం మరిచిపోతున్నాను అనిపించింది. అసలే వచ్చింది చిటికెడు. ఆ కాస్తా కూడా మరిచిపోతే ఇంకేముంది? అందుకే ఒకసారి వ్యాకరణం మళ్ళీ గుర్తుచేసుకుందాము అని "తెలుగు వ్యాకరణము" పుస్తకం చదువుతున్నాను. "బానే ఉంది. అది బ్లాగులో వ్రాయడం దేనికయ్యా?" అంటున్నారా? ఏమీ లేదండి, ఈ మధ్యన బ్లాగులు చూస్తుంటే కవిత్వం వ్రాయాలన్న తపన, ప్రఙ్ఞ, కనబడుతున్నంతగా భాష మీద పట్టు కనబడట్లేదు. సరే ఈ వ్యాకరణాంశాలన్నీ ఒక చోట వ్రాస్తే ఔత్సాహికకవులకు కూడా ఉపయోగపడతాయి కదా అని. నాకు తెలుగు ఆట్టే రాదు. సంస్కృతమైతే మరీ తక్కువ. అందుచేత తప్పులు ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. ఎక్కడైనా నేను తప్పు వ్రాస్తే సవరించగలరు.

కవిత్వానికి సంబంధించి, ఛందస్సు గురించి ఇదివరకే సంకా రామకృష్ణ గారు మంచి వ్యాసాన్ని వ్రాశారు. అది చూస్తూనే నేను నెమ్మదిగా కందాలు, ఆ పైన గీతాలు, సీసాలు వ్రాశాను. ఈ రోజుకీ నాకు ఏమైనా సందేహం ఉంటే ఆ వ్యాసాన్నే చూస్తాను. కవిత్వానికి సంబంధించిన మరో చక్కని అంశం అలంకారాలు. అలంకారాల గురించి internetలో ఎక్కడా సమగ్రమైన వ్యాసాలు కనబడలేదు. అందుకే వాటి గురించి చర్చించాలని ఈ శీర్షిక మొదలుపెడుతున్నాను. వ్యాకరణం అనగానే అదేదో "మనకు పనికిరాదులే" అనుకునే వాళ్ళకు తెలియనిదేమిటంటే వారికి తెలియకుండానే రోజూ ఏవో అలంకారాలు వాడుతూ ఉంటారు. ఉదాహరణకి క్రికెట్ ఆటగాడు బంతిని కొట్టిన తీరుని వర్ణిస్తూ, "ఆ బంతి ఇంక రాదు" అనుకుంటాము. నిజానికి ఆ బంతి వెనక్కొస్తుంది. కాకపోతే అతడు అంత బలంగా కొట్టాడు అన్నది వ్యక్తపరచడానికి మనం ఆ మాట అన్నాము. దీన్నే అతిశయోక్తి అలంకారం అంటారు. అలాగే మిగిలిన అలంకారాలు కూడా రోజూ మనం ఎక్కడో వింటుంటాము అన్నది తెలియడానికి నేను వీటికి ఉదాహరణలుగా తెలుగు (సినిమా) పాటలను చెప్తాను. చక్కని పద్యం దొరికితే మాత్రం చెప్పక మాననండోయ్. ఎంతైనా సినిమా పాట T20, పద్యం టెస్ట్ మ్యాచ్.

"అలంకారము" అంటే మీకు తెలియనిది కాదు. అయినప్పటికీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే "కవిత్వానికి అందం తెచ్చేదాన్ని అలంకారం అంటాము" (కావ్యశోభాకరాన్ ధర్మానలంకారాన్ ప్రచక్షతే). అలంకారాలు రెండు విధాలు - శబ్దాలంకారాలు (శబ్దం ప్రధానంగా ఉండేవి), అర్థాలంకారాలు (అర్థం ప్రధానంగా ఉండేవి). వీటిని వీలైనప్పుడు ఒక్కటొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. మీ విమర్శలు, సలహాలు, సూచనలు, వ్యంగ్యాలు, వెటకారాలు ఏమైనా ఉంటే నిస్సందేహంగా వ్యాఖ్యానించండి.

12 comments:

Sai Praveen said...

సందీప్ గారు,
కొన్నాళ్ళ క్రితం నేను అలంకారాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో వెతికి దొరక్క నిరాశపడి ఆ విషయాన్ని అక్కడే వదిలేసాను. నా కోసమే ఇది మొదలు పెట్టినట్టుంది మీ టపా చూస్తే :)
మీ తరువాతి టపాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

Me Inc said...

manchi pani cheppattav...all the best :)

Anonymous said...

chala bagundandi.. chinnappudu chadivina alankaaralu malli ela gurtu techukovala ani aalochinstunna naku idi varam laaga dorikindi...

taruvaata yati gurinchi kooda raaste baguntundandi...

Sandeep said...

@ఊరోడు గారు

యతుల గురించి మా గురుతుల్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారు ఇదివరకే ఒక వ్యాసం వ్రాసియున్నారు. దయచేసి అది చూడండి. వాటిపై వివరణలు కావలంటే ఆయన మిక్కిలి ఉత్సాహంతో ఆయన వ్యాసాన్ని పొడిగిస్తారు అని నా విశ్వాసం.

ఇదిగో ఆ వ్యాసం

Lalitha devi said...

vupamanalankaram can be changed as rupaka alamkaram
ame mukhamu chandrabimbamu vale andamuga vunnadi
ame chandramukhi

Lalitha devi said...

ardhantaranyasa alankaram
samanya mu ni veseshamu to
samrdhinchadanni (to certify)
viseshanni samanyamu to kani (to certify)
example :0 hanumantudu samudranni datenu
mahatmulaki asadhyamu emundi
lord hanuman crossed the sea
Nothing is impossible for great people

Lalitha devi said...

ardhantaranyasa alankaram
samanya mu ni veseshamu to
samrdhinchadanni (to certify)
viseshanni samanyamu to kani (to certify)
example :0 hanumantudu samudranni datenu
mahatmulaki asadhyamu emundi
lord hanuman crossed the sea
Nothing is impossible for great people

అన్వేషి said...

నల్లకలువ జంట వాడి తూపుల కట - కొల్లగా నంపె చూడు మనుచు
ఉపమ జెప్పి ఇటుల ఉపమాన మూహింప - రూపకం బటంచు ౠఢి యగును.
~ ఈ విధంగా అలంకారాలన్నీ పద్యరూపంలో వివరించే వారు మాతెలుగు లెక్చరర్ (Sri NVR) ఆంధ్ర జాతీయకళాశాల, మచిలీపట్టణంలో. దాదాపు నాలుగుదశాబ్దాలు గడచినా, ఆ పద్యాలు చెవుల లో వినిపిస్తూ, ఆ రూపం కనుల ముందు మెరుస్తూ ఉంటుంది. (పద్యంలో మొదటి రెండు పాదాల లో ఉదాహరణ, తరువాతి రెండుపాదాల లో లక్షణం వివరించబడుతుంది).
అలాగే చందస్సుకూడ పద్యరుపం లో :-
సూర్యుడొక్కడు, సురరాజు లిరువురు దినకర ద్వయంబు తేటగీతి - అని వివరించేవారు.
మీప్రయత్నం బావుంది - అనేకమందికి ఉపకరించగలదు.

Sandeep said...

@లలిత
మీరు చెప్పిన అలంకారాలను గురించి కూడా వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను అండి.
@అన్వేషి
మీ మంచి మాటలకు ధన్యవాదాలండి.

బొల్లోజు బాబా said...

చాలా అద్బుతంగా ఉన్నాయి మీ వ్యాసాలు
చాన్నాళ్ళ క్రితం ఆధునిక కవులు ఉపయోగించే (శ్రీశ్రీ తిలక్ ల తరువాత) అలంకారాల గురించి ఒక వ్యాసం వ్రాయాలని యత్నించి విఫలమయ్యాను. (టాపిక్ విస్త్రుతికి, నా అజ్నానం నాకు తెలిసివచ్చి) మీ ప్రయత్నం మెచ్చుకోదగినది. మీ పరిశోధన పటిమ అబ్బురపరచింది. అభినందనలు


భవదీయుడు
బొల్లోజు బాబా

Rekha Jithendra said...

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ ....idi ye alankaram ??

Sandeep P said...

రేఖ గారు,

అది ఛేకానుప్రాస.

http://manonetram.blogspot.com/2010/06/blog-post_05.html