ఒక వ్యక్తి తనను ప్రేమించిన అమ్మాయిని బాధపెట్టి పశ్చాత్తాపం పడుతూ ఉంటాడు. అది చూసి తన మిత్రుడు, "హనుమంతుడి భక్తుదవయ్యి ఈ బేలతనం ఏలనయ్య?" మంచి నాలుగు మాటలు చెప్తాడు. దానికి ఈ ప్రేమికుడు ఇచ్చే సమాధానం:
హనుమంతుడె యా సీతను
గని నాకై చూపినాడు కైపున నేనే
వనితామణి యామేనని
కనుగొన లేకుంటినకట కఠినాత్ముడనై
రామాయని నామమునే
నామాతాపితరులెంచి నాకుంచితిరే
నే మాత్రము మూఢుడినై
నా మానిని మనసు విరిచినానే నేస్తం
నా పాపము పండు దినము
నాపాలనుకోను నేను నాస్తికరీతిన్
ఈ పామరుడా భామిని
కోపానికి నోచుకోక కుంగుట జరిగెన్
తరిగెను మనసున భారము
తిరముగ నీ లేఖ జదువ తెరిపియు గలిగెన్
వరముగ భావింతునెపుడు
పరులను పట్టించుకొనెడి వారల స్నేహం
PS: ఈ కథలో పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలే. ఎవరికైనా సంబంధం ఉన్నట్టు అనిపిస్తే అది కేవలం యాదృచ్చికం. (The characters and situations in this story are totally imaginary :) )
No comments:
Post a Comment