నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పెద్ద ఫ్యాన్ ని. అతను dialogue సీరియస్ గా వ్రాసిన సరదాగా వ్రాసినా అద్భుతం. ఉదాహరణకి:
ప్రేమ రెండు మనసులకు సంబంధించిన విషయం. పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం" (సంతోషం)
"యోగా కావలిస్తే నా దగ్గరకు రండి. బాగా కావలిస్తే వాడి దగ్గరకు వెళ్ళండి" (జల్సా)
ప.క: "urgent ఆ, important ఆ?"
అలీ: "serious". (జల్సా)
వయసైపోయిన సినిమా హీరోలు అందరూ రాజకీయనాయకులు అయిపోయినట్లు, ఫెయిల్ అయినపోయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు. (చిరునవ్వుతో)
తాజ్మహల్, చార్మినార్, నా లాంటి కుర్రాళ్ళు - చూడటానికే, కొనడానికి మీరు సరిపోరు. (నువ్వే నువ్వే)
జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్లు - వినిపించి వినిపించనట్లు, కనిపించి కనిపించనట్లు మాట్లాడుకుంటున్నారు ఎందుకు రా? (అతడు)
నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దణ్ణం పెట్టుకుంటున్నాను. (నువ్వు నాకు నచ్చావ్)
వెంకి: అప్పు ఇచ్చి వడ్డీ ఆసించచ్చు. హెల్ప్ చేసి థాంక్స్ ఆశించకూడదు.
బ్రాహ్మి: ఇన్నాళ్ళ బట్టి పాలస్ లో ఉంటున్నాను సర్. రాజును ఇప్పుడు మొదటిసారి చూస్తున్నాను సర్. (మల్లీశ్వరి)
ఏదో తెలియని అదృశ్యశక్తి మనలని భూమిలోకి తోసేస్తోంది అని నీకు అనిపించిందా? (జల్సా) (పైన ఉన్నా లైన్స్ అన్నీ ఒక ఎత్తు ఐతే - ఈ లైన్ మరొక ఎత్తు. ఇది నిజంగా నా మనసుని తాకిన లైన్. చిన్నప్పటినుండి ఏదో మంచి జరుగుతుంది, ఏదో ఆనందం కలుగుతుంది అనుకునే కొంతమందికి అది చాలా రోజులు దక్కదు. ఎంతో కష్టపడతారు. ఏదో సాధించాలనుకుంటారు. కానీ చివరకు - అది ఏదో అయిపోతుంది. ఎందుకు ఇలాగ జరుగుతోంది? మనకే ఎందుకు ఇలాగ జరుగుతోంది. చుట్టూ అందరూ బాగున్నారు కదా? అనే ప్రశ్న వేధిస్తుంది. ఆ ఫీలింగ్ అంతటినీ - ఒక్క లైన్ లో చెప్పాడు).
ఇలాగ చెప్పుకుంటూ పొతే ఒక పుస్తకం వ్రాయచ్చు. డైలాగ్ ఎంత పెద్దది అన్నది పాయింట్ కాదు. కానీ, అది ఎంత పంచ్ ఇచ్చింది అన్నది ఇమ్పోర్తంట్!
ఇదే పిచ్చి నాకూ పట్టుకుంది :) అంటే, నన్నుinspire చేసింది. అందుకే ఈ మధ్యన క్రిస్ప్ పంచ్ లైన్స్ ఇస్తున్నాను :)
కాబ్ లో వెళ్తున్నాము. ఒక తమిళ్ కొలీగ్, ఒక హిందీ కొలీగ్ కూర్చున్నారు. ఎందుకో "ముర్గా" అనే పదం వచ్చింది. అది విని నేను కొంచం వెరైటీ గా ఫీల్ అయ్యాను. అప్పుడు అన్నాను.
Me: "I suspect there is some miscommunication here. There are two murgaa's - one Thamizh Muruga, another is Hindi murgaa."
North Indian: "What is the difference?"
Me: "Thamizh murugaa is whom people pray. Hindi murgaa is what becomes prey".
తమిలులందరూ ఒక్క సారి నవ్వేసారు. హిందీ వాడికి అర్థం కాలేదు నా పంచ్ డైలాగ్.
అలాగే ఈ మధ్యన కొంచం ప్రాస కూడా పెంచాను. పంచ్ కోసం.
"వాడి సుడి సుమీత్ మిక్సీ లాగా తిరుగుతోంది రా"
"ఇల్లనే equation లో waste కంటే variable గానూ, constant కంటే coefficient గానూ ఉండటం మంచిది" (ఈ dialogue విన్న audience లో ఒకరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి :P)
"సామాన్యుడి సరదా చమ్మకాయ అంత ఉంటే దుర్మార్గుడి దూల దోసకాయ అంత ఉంటుంది"
"రాముడు, కృష్ణుడు, రామకృష్ణుడు, వివేకానందుడు - వీళ్ళు నాకు స్ఫూర్తి. నవల్లలో నాయకులూ, సినిమాలలో హీరోలు వినడానికి, చూడటానికి బాగుంటారు."
"చాలా మంది అమాయకులు రుచి ఆహారంలో ఉంటుంది అనుకుంటారు. అది ఆకలిలో ఉంటుంది అని తెలియక. అలాగే ఆనందం అనేది అనుభవించడంలో లేదు. ఆరాధించడంలో ఉంది."
"విజయవాడ స్టేషన్ లో ట్రైన్లు, విశాఖపట్నం సముద్రంలో అలలు, మనిషి జీవితంలో కష్టాలు - అలాగా వస్తూనే ఉంటాయి."
No comments:
Post a Comment