ఎక్కడివయ్యా నీకీ పదములు
చక్కగ అమరెను చక్రి పదములకు
ఏరి నా విభుని, ఏడు కొండలపై, కోరి కీర్తనలఁ కొలిచెడివారని
నారదుడే నీ నాలుకముంగిటఁ, బారఁగఁ జేసెనా మహతీఝరులను
ఎక్కడివయ్యా ||
ఎలకోకిలలా చిలుకగ పలుకులఁ, అలకల కులుకుల కలికి శ్రీరమణి
పలుకుతేనెలతల్లి పద్మావతియే, చిలికినదా నీ జిహ్వపై సిరుల?
ఎక్కడివయ్యా ||
అలమేల్మంగ అధరామృతమును, అలదుకొన్న శ్రీహరి పెదవులపై
పులకలు పొడమ పొంకపుమాటలఁ, తొలకాడిన స్వరధుని లోతులలో
ఎక్కడివయ్యా ||
నెలకొనె హరి నా నేలకు వచ్చి, కొలువుఁదీరెనే కొండలపైనని
తలచి పదములను దాచి పంపెనో, తెలుగుతల్లి నీ దివ్యహృదయమున
ఎక్కడివయ్యా ||
ఈ పాటలో అన్నమయ్య శైలిని సాధ్యమైనంతవరకు అనుసరించాను.ప్రాసాక్షరాలు కనబడుతూనే ఉన్నాయి. యతి అక్షరాలను ముద్దగా (bold) దిద్దాను.
4 comments:
చాలా హృద్యంగా వ్రాశారు. "పొలకలు పొడమ పొంకపు మాటల.." అంటూ అన్నమయ్య బాణి కూడా అందంగా అనుకరించారు. వీలు దొరికితే స్వరాలు కూర్చండి.
adbhutamgaa undi sOdaraa! yati, praasalu paaTinchi ghanamaina padapushpam samarpinchaavu. dhanyuDavi.
naa Buzz lO endukO idi raalEdu. ninna Mouli nuvvuu, Kiran kuuDaa annamayya pai raaSaarani cheptE search chEsi paTTukunnaa.
@రవి
నెనెర్లండి. పాట వ్రాసేటప్పుడు ఒక ట్యూన్ అనుకునే వ్రాశాను. సంగీతఙ్ఞానం లేనివాణ్ణి ఆ బాణీని ఇక్కడ ఎలాగ పెట్టాలో తెలియక ఊరుకున్నాను.
@ఫణీంద్ర
ధన్యోస్మి సోదరా. ఈ పాట నీకు నచ్చడం నాకు చాలా సంతోషం కలిగించింది.
అద్భుతం!!!!!!!!!!!!!
Post a Comment