Saturday, March 20, 2010

గురుచరణం శరణం - ఇళయరాజ

మలయాళంలో వచ్చిన "గురు" చిత్రం కథ వింటేనే నాకు చాలా ఆనందం కలిగింది. ఈ కథ గురించి నేను గతంలో ఒక ఆంగ్లటప వ్రాశాను. ఈ చిత్రం ఎవరైనా మలయాళస్నేహితుడితో కలిసి చూడాలన్నది నా కోరిక. ఇందులో ఇళయరాజ  స్వరపరచిన "గురుచరణం శరణం" అనే పాట, నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఈ పాటలో ప్రతీ స్వరం భక్తిని, దయని నింపుకుంది. ఈ పాటను ఎలాగైనా ఆంధ్రీకరించాలన్న నా తపన ఈ రోజు తీరింది.

నాకు వీలైనంతగా ఈ పాటలో భక్తిరసాన్ని, భగవత్తత్వాన్ని నింపాను. పల్లవిలో "గురుచరణం" అన్నది మార్చి "నీ చరణం",  అని వ్రాయడానికి కారణం బాణీలో ఉన్న భక్తితత్వానికి  తగ్గట్టుగా భావాలకు ఇంకా విశాలమైన ప్రాంగణాన్ని కల్పిద్దాము అని. గురువుని కంటే భగవంతుడిని పొగడటానికి అవధులు తక్కువ - అందుకని.

మొదటి చరణంలో పంచభూతాలు, ఆకాశం (గగనం), నీరు (వరుణం), నేల (భువనం), గాలి (పవనం), నిప్పు (సూర్యుడు) అన్నింటినీ భగవంతుడి సృష్టిగా వర్ణించాను. ఇందులో తిగ్మతేజం అనడంలో నా ఉద్దేశం "వేడి కలిగిన ప్రకాశం" అని. కొంచం సంస్కృతభూయిష్టంగా ఉన్నా సందర్భానికి తగినట్లు ఉందని వ్రాయాల్సివచ్చింది. రెండవ చరణంలో ప్రకృతిలో ఉన్న అన్ని విశేషాల వెనుకా ఉన్నది ఆ పరమాత్ముడే అనే భావాన్ని కలిగేలా ప్రయత్నించాను. చివరగా ఆ పరమాత్మకు నమస్కారాలను సమర్పించాను.

చిత్రం: గురు (1997- మలయాళం)
దర్శకుడు: రాజీవ్ ఆంచల్
సంగీతం: ఇళయరాజ
మలయాళంలో గీతకర్త: రమేశన్ నాయర్


నీ చరణం శరణం స్వామీ! భవభయహరణం
పరమాణువు మొదలు జగం, నీ వశమేగా సకలం
ఆధారమై గావరా!

గగనం, నీలిమేఘం, వరుణం, ఇంద్రచాపం,
భువనం, హరితచేలం, పవనం, పుష్పగంధం,
చలిని తొలచు తిగ్మతేజమై, కనులు వెతుకు కాంతిపుంజమై
వెలయు రవీ [ఓంకారరూప] నీ మహిమే! [ఓం శాంతి ఓం]

కులికే కోకిలైనా, ఉరికే జింకలైనా
కురిసే చినుకులైనా, మురిసే ఆకులైనా
వెనుకనున్న ఉనికి నీవుగా!
విశ్వమంత నీకు రూపుగా
వెలసితివే! [ఆనందరూప] ప్రణతులివే [ఓం శాంతి ఓం]

4 comments:

satvika said...

bavundi.. but pallavi koncham christian song laga undi, ante baledani kaadu.. but deva, karunaku nilayam remind me of those carol songs they sing... so flavor disturb ainatlu anipinchindi..the rest of the song is really good...

Sandeep P said...

నువ్వు చెప్పిన మాట వాస్తవమే అనిపిస్తోంది. చాలా చక్కని వ్యాఖ్యలను వ్రాస్తున్నావు. థేంకులు! నీ సలహా మెరకు ఈ పాట కొంచం మార్చాను.

నీ చరణం శరణం స్వామీ! భవభయహరణం
పరమాణువు మొదలు జగం, నీ వశమేగా సకలం
ఆధారమై గావరా!

GKK said...

పాట బాగుంది. నెనర్లు. though it doesn't have instant appeal, sort of grows on you. పావుకోళ్ళు వేసుకోని నడవటం కుంచెం కష్టమే అనిపిస్తుంది video చూస్తే

Phanindra said...

chakkani saahityam. bhaavaalu bhakti ninDi unnaay. kudiritE nii saahityam paaDi kuuDaa vinipinchu.