Sunday, March 14, 2010

పూంగదవే తాళ్కిరవాయ్

ఈ మధ్యన పరభాషల్లో నాకు నచ్చిన ఇళయరాజ పాటల్ని తెలుగులోకి నేనే freemake చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాస్త పాడుకోవడానికి వీలుగా ఉండేలాగా, సినిమా పాటల లాగా కాకుండా కాస్త fresh గా ఉండేలాగా ప్రయత్నిస్తున్నాను. original లో ఉన్న పదాలు/భావాలు అలాగే ఉంచాలని నేను అనుకోవట్లేదు. అయితే దుఃఖాన్ని హర్షాతిరేకంగానూ, ఆనందాన్ని అంతులేని శొకంగానూ మార్చను. genre అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తాను.

అక్కడక్కడా గురువు (లా) ఉండాల్సిన చోట రెండు లఘువులు (లల) వేస్తున్నాను, భావానికి న్యాయం చేయడం కోసం. అలాగే కొన్ని పదాలు గ్రాంధికంగా (యామిని=రాత్రి, కౌముది=వెన్నెల) వ్రాయడం పాట momentumకు అడ్డుపడచ్చును కానీ, అలాంటి చక్కని పదాలను కాస్త జనాలు గుర్తుచేసుకునేందుకు ఉపయోగపడతాయి అని వ్రాస్తున్నాను.

ప్రస్తుతానికి నేను తిరగవ్రాస్తున్న పాట: "పూంగదవే"!

ప:-
యామినిలో కౌముదిలా
రావా, ఓ పూవా!
నా కన్నుల నిండుగ

చ-1:-
నీ స్నేహం నా దీపం, ఆశలరాశులకది రూపం
నీ ఊహే ఆనందం, పెదవికి తెలియని మకరందం
మానసవేణువు నేర్చెనిలా, ఇదివరకెరుగని రాగం

చ-2:-
నీ చూపే కార్తీకం, తాకిన మనసుకు చలిస్నానం
నీ మాటే మధుగీతం, తేనెలు జారే జలపాతం
మారక ఆమని ఆగినదా? మనసులు కలసిన మనకోసం

5 comments:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

పల్లవిలో పదప్రయోగం చాలా బాగుంది.

మొదటి చరణంలో రెండవ లైన్ కొంచం craft లా అనిపిస్తుంది - ప్రత్నిస్తే ఇంకా వేరే ఏమైనా రాయచ్చు.

రెండవ చరణం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది... ఇంటినుంచి officeకి వచ్చేవరకు దారంతా ఈ చరణాన్ని పాడుకుంటూ వచ్చా.
"నీ చూపే కార్తీకం; తాకిన మనసుకు చలిస్నానం
నీ మాటే మధుగీతం; తేనెలు పొరలెడి జలపాతం"

Additional info : Vairamuthu was introduced as a lyricist in this movie(Song : ponmAlai pozhudhu")!
I always felt that this "pUngadavE..." tune should have been given to VM. But this was written by iLayarAja's brother "gangai amaran".

-Avineni N Bhaskar

Sandeep P said...

నీ మంచి మాటలకు ధన్యవాదాలు సోదరా! ఈ పాట ఏ సినిమాలోదా అని నేను తెగ వెతికాను. ఎక్కడా దొరకలేదు. నువ్వు చెప్పిన విషయాలన్నీ నాకు ఆసక్తి ఉన్నవే!

ఈ పాట వ్రాస్తున్నప్పుడు నాకు అర్థమైంది ట్యూన్ కి పాట వ్రాయడం ఎంత కష్టమో. నీ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఇంకా బాగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను:)

Murthy Ravi said...

నీ చూపే కార్తీకం, తాకిన మనసుకు చలిస్నానం
నీ మాటే మధుగీతం, తేనెలు పొరలెడి జలపాతం

chalaa bavundi bhaavam.... kaani "poraledi" ane word maatram dubbing song lo lane konchem odd gaa undi...

GKK said...

చాలా మంచి పాట. thanks.

Sandeep P said...

@మూర్తిగారు
మీరు చెప్పినదే నాకూ అనిపించింది. అందుకే ఆ పదాన్ని మార్చాను. మీ సలహాకు ధన్యవాదాలు.

@భాస్కర్
సోదరా, నువ్వు చెప్పడం చేత నేను కొంచం spelling mistake సరిచేశాను. "పూంకదవే" నుండి "పూంగదవే" కు మార్చాను. నెనర్లు!