Tuesday, May 5, 2009

చెంత లేకుంటివే...

ఎప్పుడో 2007-జూన్-6 న చినుకులు పడుతుంటే ఉన్నట్టుండి పుట్టుకొచ్చిన కవిత. మొన్న వర్షం పడుతుంటే గుర్తు వచ్చింది.

సరసలేకుంటివే సఖియ
సరసమాడగ నాకు సరియైన వేళ

చల్లగాలులు మత్తు చల్లుచూ తాకంగ
నుల్లమెల్లను నీవెయూహలయ్యెనె సఖియ
పిల్లతెమ్మెర నిన్ను పిలువమంటున్నదె
చెల్లించ నా పలుకు చెంత చేరవె చెలియ

విల్లు ఎత్తిన మిన్ను విరహాల రేపంగ
విసిరెనే బాణాలు వేసారె ప్రాణాలు
జల్లు కురిసెడివేళ జవరాల రావటే
జాగుసేయుదువేల జతగూడరాదటే?

5 comments:

Priyadarshini said...

Wah Wa Wah Wa
chala bagundi

viswanadh said...

excellent .........
Nee kavitha lo bhavam bagundi
inka simple ga vunte inka bagundedi.

viswanadh said...

"villu ettina minnu
virahalu repanga
visirenee banalu
vesare pranalu"

Too Much...........

Ram Kishore said...

mama gunde pindavu ra

PLZ TOUCH LO UNDU

లంకా రవీంద్ర said...

సరదాగా ఇదే శృతిలో ఇంకొక రెండు చరణాలు జోడిస్తే బాంగుంటుందనిపించి:

మేఘాల రాగాల వేగాలు రేగంగ
నీమీద నాబెంగ గంగలై పొంగెనే
చిలుకరించవె చెలియ నామీద చిరుదయ
కూసంత చలికాగు ఊసులాడెదమే.

కారువర్ణపుమొయిలు మెరుపుతీగె తొడిగేనే
దగదీర్చ దివికురికి సెగలు కడిగేనే
చక్కనీ చినదాన నీకేమి తక్కువే
నాదానవై నాదు చింతమాపవె జాణ.