చలనచిత్రాలు సామాన్యుడి మనోరంజనం కోసం, కళాకారుల సంతృప్తి/జీవనోపాధి కోసం అన్నది పాఠ్యపుస్తకాలలోని విషయం. ఆ పుస్తకాలని కాసేపు పక్కన పెట్టి, కళ్ళ ఎదురుగా జరుగుతున్న వింతలని చూస్తే అసలు విషయం చాలా భిన్నంగా ఉంటుంది. modern భాషలో చెప్పాలంటే cinema సామాన్యుడికి ఒక వ్యసనం, కళాకారులుగా చలామణి అవుతున్న వారి డబ్బు దాహం తీర్చే ఒక సాధనం. ఇది తెలుసుకోవడానికి పదో తరగతిలో ఉత్తీర్ణత కూడా అనవసరం.
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు గారు "చిత్రం చూస్తున్నప్పుడు ఒక్క సారైనా ప్రేక్షకుడి కంట్లో నీరు వస్తే ఆ చిత్రం విజయాన్ని సాధిస్తుంది" అని అన్నారని ఎక్కడో విన్నాను. అందులో కొంత వాస్తవం ఉంది అనే నా నమ్మకం. ఉదాహరణకి కీ.శే. జంధ్యాల చిత్రాలు చూస్తే ఆద్యంతం హాస్యరసం ప్రవహిస్తున్నా, మధ్యలో ఏదో ఒక్క చోట ప్రేక్షకుడికి కళ్ళు చమర్చేలాగా ఒక సన్నివేశాన్ని ఉంచేవారు. చంటబ్బాయ్ లో చిరంజీవి బాల్యాన్ని గురించి వర్ణించినా, ఆహా నా పెళ్ళంట లో రాజేంద్ర ప్రసాద్ పక్కింటి కుటుంబంతో తనకు తల్లి లేకపోవడాన్ని గురించి చెప్పి బాధపడినా, అదే చిత్రం చిట్టచిగురున నూతన్ ప్రసాద్ తన కొడుకుత "ప్రేమలో గెలవలేదని ఎటువంట అఘాయిత్యం చేసుకోవద్దు", అని చెప్పినా, వివాహ భోజనంబు చిత్రంలో హరీష్ తనలో ప్రేమ వలన కలిగిన మార్పులను తన అన్నయ్యతో చెప్పుకు బాధపడినా -- అవన్నీ ఆ చిత్రాలకు పట్టుకొమ్మలైన సన్నివేశాలు కాకపోవచ్చును కానీ, జరుగుతున్న హాస్యం నడుమ కూడా ఏదో ఒక ఆవేదన ఉంటుంది, అటువంటి వ్యక్తులను మనం అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశ్యం కనబడుతుంది. అలాగే, ఎంత బాధ ఉన్నా నవ్వుతూ ఉండాలనే సందేశం కూడా ఉంది.
అంత బాధ్యతగా చిత్రాలు తీసే రోజులు పోయాయి అని ఈ రోజు నేను దండోరా వెయ్యాల్సిన పని లేదు. ఈ దర్శకులు, నిర్మాతలూ ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి, వాళ్ళను వాళ్ళే సమర్థించుకుని మోసం చేసుకుంటున్నారు అనిపిస్తోంది. ఈ భావదౌర్భాగ్యానికి కారణం ప్రేక్షకుడా, కళావ్యాపారా లేక కళాకారులా అన్నది నాకూ తెలియదు కానీ, కళను ఆస్వాదించి సంతృప్తిని పొందే పరిస్థితి నుండి "మన వర్గం నటుడో, దర్శకుడో కళ కంటే గొప్పవాడు" అనే వ్యసనానికి ప్రేక్షకులు, మంచి చిత్రాలను తీసి కళను ప్రోత్సహించి, కాస్త డబ్బు కూడా సంపాదించుకుందాం అనే పరిస్థితి నుండి "కళ? అమ్మో ప్రేక్షకులు చూడరు. ఫలానా చిత్రంలా మాంచి mass చిత్రమైతే బాగుంటుంది." అనే దుస్థితికి నిర్మాతలూ, దర్శకులు వచ్చేసారు.
ఈ ఉపోద్ఘాతం ఇంతటితో ఆపి, అసలు విషయం దగ్గరకు వస్తే -- ఈ జరుగుతున్న circus మధ్యలో వినిపించే కొన్ని వ్యాఖ్యలు వింటూ ఉంటె "అసలు వీడు మాట్లాడేదానికి అర్థం ఉందా?" అనే ప్రశ్న నాకు కలుగుతోంది. అలాంటివి కొన్ని చెప్దామని నా ప్రయత్నం.
మొహం పగలగోట్టాలనిపిస్తుంది ఈ మాట అన్న దర్శకులని. శంకరాభరణం class ఏ అంటాను. పండితులని, పామరులని ఒక త్రాటిపై నిలుపగలిగింది అంటే దాని వెనుక ఒక సిద్ధాంతం ఉంది. వారిద్దరిలోనూ ఉన్న వివేకాన్ని మేల్కొలపడమే ఆ చిత్రవిజయానికి రహస్యం. రిక్షావాడు "శంకరా, నాదశరీరాపరా" అని పాడాడు అంటే వాడికి దాని అర్థం తెలిసి కాదు, ఆ సందర్భాన్ని అనుభవించగలిగాడు అని. కథలో ప్రతీ పాత్రనీ హృద్యంగా చెప్పడం అంటే అదే.
రెండు రుమ్మాళ్ళని పైనా కిందా తొడిగి ఆడపిల్లల చేత అర్థనగ్న ప్రదర్శనలను చేయించి, వాళ్ళు తీసే ఆణాకాణీ చిత్రాలకి శంకరాభరణం చిత్రంతో పోలిక చెప్పే సంకుచితమతులకి "పౌండ్రక విశ్వనాథ్" అనే బిరుదు ప్రకటించాల్సిందిగా మన నిద్రపోతున్న ప్రభుత్వానికి నా విజ్ఞప్తి.
నీకు అసత్య దోషం అంటదు కుమారీ! మాకు ఒక దొంగసాకు (కట్టుకథ) చెప్తున్నావు. ఆ కథను అడ్డుపెట్టుకుని (అనుసరించి) వస్త్రసన్యాసం చేస్తున్నావు. నిజమే.
అమ్మాయ్! నువ్వు ఏ మందులో మింగి కండ పట్టించుకుని (అదే, కండబలిసి) వచ్చింది ఎందుకో మా అందరికీ తెలుసునమ్మా. నువ్వు చేసే అభినయానికి అంగుళం అవకాశం లేని ముష్టి పాత్రలకి ఎంత అవసరమో, ఏమి అవసరమో మాకు తెలుసును. మొదట్లో కాస్త ఒళ్ళు దాచుకున్నా రెండు మూడు అవకాశాలు రాగానే, లేదా పోగానే నువ్వేం చేస్తావో మాకు తెలియదా? నాకు అన్నప్రాసన అయినప్పటి విజయశాంతి దగ్గరనుండి నేటి తమన్నా వరకు అందరూ చేసిందే నువ్వూ చేస్తున్నావు.
డబ్బు చాలా చెడ్డదిలే పాపా! చిన్నప్పుడు దేశాన్ని ఉద్ధరిద్దామనుకుని ఎన్నో ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అమెరిక వచ్చి చద్దికూడు తింటున్న నాలాంటి వాళ్లకి అది ఇంకా బాగా తెలుసును.
ఓసోస్! రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని ఆంధ్రులందరూ నమస్కారం చేసుకున్న కీ. శే. ఎం. టి. ఆర్. కూడా ఒప్పుకోవలసిన సత్యం ఏమిటంటే రామానంద్ సాగర్ రామాయణంలో రాముడు, బీ. ఆర్. చోప్రా మహాభారతంలో కృష్ణుడు ఏంటో అద్భుతంగా కుదిరారు అని. మరి నీ బచ్చాగాడు చేసిన దగుల్బాజీ పాత్రకు వేరే ఎవడూ దొరకడా? సముద్రాన్ని వదిలేసి, దొడ్లో నీటి గుంటలో చేపలు పడితే దొరికిన చెపే అద్భుతంగా అనిపిస్తుందిరా అల్పసంతోషి.
పాత్రకు తగ్గ నాయకుడిని వెతుక్కోవడం అంటే విశ్వనాథ్ ని చూడు. నలభై ఏళ్ళు పైబడిన సోమయాజులని తీసుకొచ్చి కథానాయకుడు అంటే అందరూ నివ్వెరపోయారు/నవ్వి పోయారు. ఆ పాత్రకు నీ యువ-నవ-హీరో సరిపోతాడ? ఒక గర్విష్టి, అహంభావి అయిన పాత్రను పోషించే కళాపిపాస లేని, image -చట్రం లో చిక్కుకుపోయిన మన నటులు సిగ్గుపడే లాగా మమ్ముట్టి వచ్చి స్వాతికిరణంలో నటించి, తన సంభాషణలను తనే చెప్పుకున్నది గమనించి అప్పుడు మాట్లాడు.
నిజమే. ఒక్క మగాడు, బిగ్ బాస్, మృగరాజు, శక్తి, పలనాటి బ్రహ్మనాయుడు, పులి -- అన్ని చిత్రాలు చరిత్రను తిరగ వ్రాసాయి. ఆఖరి పుటలో ఆఖరి (తిరగ) స్థానానికి ఇంత పోటీ ఉంటుంది అని చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీసిన కీ. శే. కే. వీ. రెడ్డి ఆనాడు అనుకుని ఉండరు.
అవునవును. ఖలేజ మహేష్ బాబుకు, పులి పవన్ కళ్యాణ్ కి, బద్రీనాథ్ అర్జున్ కి, శక్తి ఎం. టీ. ఆర్ కి. - బాగుందామ్మా! ఖర్చుపై ఉన్న శ్రద్ధ script పైన ఉండదుగా. అందుకే "the భ్రష్టు films" నిర్మిస్తున్నారు.
ఎక్కడ? ఎవరు విన్నారు అసలు? హిందీ/తమిళ్ చిత్రాలనుండి కొట్టుకొచ్చిన నాలుగు బాణీలకి, కవులకు స్వేఛ్ఛనివ్వకుండా బలవంతంగా పదాలు ఇరికించి విడుదల చేసిన నీ album ఎవరు బాబూ విన్నది? చిన్నప్పుడు పాఠశాలలో జనగణమన పాడినప్పుడు కూడా నీ సంగీతం విన్నంత రివాజుగా అనిపించలేదు. చీమల గుండె సవ్వడిని చూడటానికి వాడే stethoscope వాడినా వినపడని స్పందన నీకు మాత్రమె వినిపించిందంటే నువ్వు అసాధ్యుడవే.
ఇప్పుడు కొంచెం serious. నేను Utah కి వచ్చినప్పుడు మా professor నాకు ఒక project చెప్పారు. ప్రపంచంలో ఉన్న చలనచిత్రాలన్నీ తీసుకొచ్చి, వాటికున్న పీచు, తొక్క తీసేస్తే మిగిలే గుజ్జులు కేవలం 24 మాత్రమె ఉన్నాయి అని ఎవరో ఒక శాస్త్రవేత్త నిరూపించాడట. నిజమే, ఎన్ని కథలని సృష్టించేస్తాము? (నేను చెయ్యాల్సిన పని ఏమిటయ్యా అంటే చిత్రానికి వచ్చిన వ్యాఖ్యానం (review) ఇస్తే, దాన్ని బట్టి ఆ చిత్రం ఏ గుజ్జుని ఆధారంగా చేసినదో చెప్పే యంత్రాన్ని తయారుచెయ్యడం. project నచ్చింది కానీ, ఇందులో శాస్త్రాధ్యయనం ఏముందిలే అని వేరే project తీసుకున్నాను.)
మన కర్నాటక సంగీతంలో రాగాలు కేవలం వందలలోనే ఉన్నాయి. హిందుస్తానీ కలిపి వెయ్యి అనుకుందాం. మరి వీటిని అనుసరించి అన్నమాచార్యుడు, పురందర దాసు, త్యాగరాజు మొదలైన వారి స్వరపరిచిన కీర్తనలు ఎన్ని ఉన్నాయి? వేలకు వేలు. పాట పాటకు ఎంత వైవిధ్యం? ఒక్కో పాటకూ ఎంత పరిపూర్ణత, అస్తిత్వం? మన మహాభారతంలో ఎన్ని వేల కథలు ఉన్నాయి? అదంతా చదవాలంటే కనీసం ఒక ఏడాది పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే విషయం అదే అయినా, చెప్పే విధానంలో క్రొత్తదనం ఉంటె బాగుంటుంది అని.
గొప్ప విషయాలతో వచ్చిన సమస్య ఏమిటయ్యా అంటే వాటిని అడ్డు పెట్టుకుని చాలా సులువుగా వెధవ పనులు చేసేయ్యచ్చును. ఆది శంకరుడు "అహం బ్రహ్మాస్మి" అనడం వేరు, ఎవడో భూటకసన్యాసి "అహం బ్రహ్మాస్మి" అనడం వేరు. పదాలు అవే, మనసులో భావం, అంటున్న ఆత్మ స్థితి వేరు. ఆది శంకరుడికి ఒక త్రాగుబోతు ఎదురయితే "నాయినా, ఇది చెడ్డ అలవాటు, మానుకోరా!" అని చెప్పారట ఆయన. దానికి వాడు, "మీ శివుడు త్రాగితే లేనిది నేను త్రాగితే వచ్చిందా?" అని అడిగితె, ఆయన వెంటనే కొంచెం విషం ఇచ్చి, "శివుడు గరళం కూడా త్రాగాడు. ఇది నువ్వు త్రాగు!" అన్నారట. ఉన్న విషయంలో తనకు అనుకూలంగా ఉన్న భాగాన్ని మాత్రమె గ్రహించడం మనిషి నైజం. దీన్నే అవకాశవాదం అని కొంతమంది అంటూ ఉంటారు.
"మై నే ప్యార్ కియా" కి "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "జో జీతా వోహి సికందర్" కి "తమ్ముడు" కి మధ్యన ఉన్నది స్ఫూర్తి అంటే నేను ఒప్పుకోలేను. అవి మక్కీకి మక్కీ దింపేసిన చిత్రాలు. ఆ మధ్యన "గుడుంబా శంకర్" సినిమానే "ఆట"గా తీసారని ఒక నిర్మాత ఫిర్యాదు చేసారు. మరి గుడుంబా శంకర్ చిత్రానికి వెనుకన ఎన్నెన్ని సినిమాలు ఉన్నాయో ఆయనే చెప్పాలి. బిందాస్, జయీభవ, ఆర్య-2, don శీను మొదలైన చిత్రాలన్నీ నా కళ్ళకు ఒకటే కథ లాగా కనిపించాయి. ఇక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర - ఇలాగ చెప్పుకుంటూ పొతే కోకొల్లలు. ఈ మధ్యన విజయవంతమైన రవి తేజ చిత్రాలు చూస్తుంటే ప్రేక్షకుల అభిరుచి ఇంత దరిద్రంగా తయారైందా అనిపిస్తోంది. అన్నీ ఒకే కథ లాగా అనిపించాయి. సరే ఇంకా శక్తి, బద్రీనాథ్ ల సంగతి అందరూ చెప్పుకుంటూ ఉన్నదే. కోడి రామకృష్ణ శివ చిత్రం చూసి శత్రువు చిత్రం తీసారట. ఆ రెండు చిత్రాలూ నేను చూసాన. శత్రువు చిత్రం చూసినప్పుడు నాకు శివ చిత్రం గుర్తు రాలేదు. స్ఫూర్తి అంటే ఇలాగ ఉండాలి ఆయన చెప్పడం నేను విన్నాను, ఏకీభవిస్తాను.
అయ్యా దర్శకులూ! ఒక సారి మన దక్షిణాదిన కే. బాలచందర్ ని చూడండి. వంద చిత్రాలు తీసారు. కథకథకీ వైవిధ్యం ఉంది. మధ్యతరగతి ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసిన చిత్రాలు మనందరికీ గర్వకారణం. బలమైన కథని, సంభాషనలని, సంగీతసాహిత్యాలనీ నమ్ముకున్న ఆయనకు ఎప్పుడూ ఇలాగ ప్రచారం చేసుకోవలసిన/సమర్థించుకోవలసిన పనిపడలేదు. మన రాష్ట్రంలోనే నీలకంఠ, క్రిష్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు పురోగమనాన్ని సాధిస్తున్నారు. కాస్త మీ ముక్కిపోయిన గుజ్జుని బయట పారేసి బుర్రలో గుజ్జుకి పని చెప్పండి. మీ బుర్రలో గుజ్జు లేదు అని నేను అనుకోవట్లేదు. గుణ శేఖర్ తీసిన సొగసు చూడ తరమా, మనోహరం అద్భుతమైన చిత్రాలు. త్రివిక్రమ్ తీసిన నువ్వే నువ్వే చక్కని చిత్రం. వంశీ చిత్రాలలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. మరి ఆ తరువాత వాళ్ళ చిత్రాలు ఎందుకు బాగా రాలేదు. సమాధానం వారికే తెలుసును.
మంచి దర్శకుడు కావాలంటే మంచి పుస్తకాలు చదవాలి, జనజీవనం పైన ఒక అవగాహన ఉండాలి, చేసే పనిపైన శ్రద్ధ, అంకితభావం, గురవం ఉండాలి. ఇవన్నీ సాధించెంతవరకూ మీకు ఏదైనా మానసిక వైద్యశాలలో treatment అవసరం, మీ treatment మాకు అనవసరం.

శంకరాభరణం mass ఆ, class ఆ?

కథను అనుసరించి అవసరమైతే వస్త్రాలను విసర్జిస్తాను.
నీకు అసత్య దోషం అంటదు కుమారీ! మాకు ఒక దొంగసాకు (కట్టుకథ) చెప్తున్నావు. ఆ కథను అడ్డుపెట్టుకుని (అనుసరించి) వస్త్రసన్యాసం చేస్తున్నావు. నిజమే.
అమ్మాయ్! నువ్వు ఏ మందులో మింగి కండ పట్టించుకుని (అదే, కండబలిసి) వచ్చింది ఎందుకో మా అందరికీ తెలుసునమ్మా. నువ్వు చేసే అభినయానికి అంగుళం అవకాశం లేని ముష్టి పాత్రలకి ఎంత అవసరమో, ఏమి అవసరమో మాకు తెలుసును. మొదట్లో కాస్త ఒళ్ళు దాచుకున్నా రెండు మూడు అవకాశాలు రాగానే, లేదా పోగానే నువ్వేం చేస్తావో మాకు తెలియదా? నాకు అన్నప్రాసన అయినప్పటి విజయశాంతి దగ్గరనుండి నేటి తమన్నా వరకు అందరూ చేసిందే నువ్వూ చేస్తున్నావు.
డబ్బు చాలా చెడ్డదిలే పాపా! చిన్నప్పుడు దేశాన్ని ఉద్ధరిద్దామనుకుని ఎన్నో ప్రగల్భాలు పలికి, ఇప్పుడు అమెరిక వచ్చి చద్దికూడు తింటున్న నాలాంటి వాళ్లకి అది ఇంకా బాగా తెలుసును.
ఈ పాత్ర మా నాయకుడు తప్ప వేరేవాడు చెయ్యలేడు.
ఓసోస్! రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అని ఆంధ్రులందరూ నమస్కారం చేసుకున్న కీ. శే. ఎం. టి. ఆర్. కూడా ఒప్పుకోవలసిన సత్యం ఏమిటంటే రామానంద్ సాగర్ రామాయణంలో రాముడు, బీ. ఆర్. చోప్రా మహాభారతంలో కృష్ణుడు ఏంటో అద్భుతంగా కుదిరారు అని. మరి నీ బచ్చాగాడు చేసిన దగుల్బాజీ పాత్రకు వేరే ఎవడూ దొరకడా? సముద్రాన్ని వదిలేసి, దొడ్లో నీటి గుంటలో చేపలు పడితే దొరికిన చెపే అద్భుతంగా అనిపిస్తుందిరా అల్పసంతోషి.
పాత్రకు తగ్గ నాయకుడిని వెతుక్కోవడం అంటే విశ్వనాథ్ ని చూడు. నలభై ఏళ్ళు పైబడిన సోమయాజులని తీసుకొచ్చి కథానాయకుడు అంటే అందరూ నివ్వెరపోయారు/నవ్వి పోయారు. ఆ పాత్రకు నీ యువ-నవ-హీరో సరిపోతాడ? ఒక గర్విష్టి, అహంభావి అయిన పాత్రను పోషించే కళాపిపాస లేని, image -చట్రం లో చిక్కుకుపోయిన మన నటులు సిగ్గుపడే లాగా మమ్ముట్టి వచ్చి స్వాతికిరణంలో నటించి, తన సంభాషణలను తనే చెప్పుకున్నది గమనించి అప్పుడు మాట్లాడు.
ఈ చిత్రం చరిత్రని తిరగ వ్రాస్తుంది.
నిజమే. ఒక్క మగాడు, బిగ్ బాస్, మృగరాజు, శక్తి, పలనాటి బ్రహ్మనాయుడు, పులి -- అన్ని చిత్రాలు చరిత్రను తిరగ వ్రాసాయి. ఆఖరి పుటలో ఆఖరి (తిరగ) స్థానానికి ఇంత పోటీ ఉంటుంది అని చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీసిన కీ. శే. కే. వీ. రెడ్డి ఆనాడు అనుకుని ఉండరు.
ఫలానా బాబు career లోనే ఇది "the best film" అవుతుంది.
అవునవును. ఖలేజ మహేష్ బాబుకు, పులి పవన్ కళ్యాణ్ కి, బద్రీనాథ్ అర్జున్ కి, శక్తి ఎం. టీ. ఆర్ కి. - బాగుందామ్మా! ఖర్చుపై ఉన్న శ్రద్ధ script పైన ఉండదుగా. అందుకే "the భ్రష్టు films" నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన సంగీతానికి మంచి స్పందన లభించింది.
ఎక్కడ? ఎవరు విన్నారు అసలు? హిందీ/తమిళ్ చిత్రాలనుండి కొట్టుకొచ్చిన నాలుగు బాణీలకి, కవులకు స్వేఛ్ఛనివ్వకుండా బలవంతంగా పదాలు ఇరికించి విడుదల చేసిన నీ album ఎవరు బాబూ విన్నది? చిన్నప్పుడు పాఠశాలలో జనగణమన పాడినప్పుడు కూడా నీ సంగీతం విన్నంత రివాజుగా అనిపించలేదు. చీమల గుండె సవ్వడిని చూడటానికి వాడే stethoscope వాడినా వినపడని స్పందన నీకు మాత్రమె వినిపించిందంటే నువ్వు అసాధ్యుడవే.
కథ కొత్తది అని చెప్పను. కానీ, treatment కొత్తగా ఉంటుంది.
ఇప్పుడు కొంచెం serious. నేను Utah కి వచ్చినప్పుడు మా professor నాకు ఒక project చెప్పారు. ప్రపంచంలో ఉన్న చలనచిత్రాలన్నీ తీసుకొచ్చి, వాటికున్న పీచు, తొక్క తీసేస్తే మిగిలే గుజ్జులు కేవలం 24 మాత్రమె ఉన్నాయి అని ఎవరో ఒక శాస్త్రవేత్త నిరూపించాడట. నిజమే, ఎన్ని కథలని సృష్టించేస్తాము? (నేను చెయ్యాల్సిన పని ఏమిటయ్యా అంటే చిత్రానికి వచ్చిన వ్యాఖ్యానం (review) ఇస్తే, దాన్ని బట్టి ఆ చిత్రం ఏ గుజ్జుని ఆధారంగా చేసినదో చెప్పే యంత్రాన్ని తయారుచెయ్యడం. project నచ్చింది కానీ, ఇందులో శాస్త్రాధ్యయనం ఏముందిలే అని వేరే project తీసుకున్నాను.)
మన కర్నాటక సంగీతంలో రాగాలు కేవలం వందలలోనే ఉన్నాయి. హిందుస్తానీ కలిపి వెయ్యి అనుకుందాం. మరి వీటిని అనుసరించి అన్నమాచార్యుడు, పురందర దాసు, త్యాగరాజు మొదలైన వారి స్వరపరిచిన కీర్తనలు ఎన్ని ఉన్నాయి? వేలకు వేలు. పాట పాటకు ఎంత వైవిధ్యం? ఒక్కో పాటకూ ఎంత పరిపూర్ణత, అస్తిత్వం? మన మహాభారతంలో ఎన్ని వేల కథలు ఉన్నాయి? అదంతా చదవాలంటే కనీసం ఒక ఏడాది పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే విషయం అదే అయినా, చెప్పే విధానంలో క్రొత్తదనం ఉంటె బాగుంటుంది అని.
గొప్ప విషయాలతో వచ్చిన సమస్య ఏమిటయ్యా అంటే వాటిని అడ్డు పెట్టుకుని చాలా సులువుగా వెధవ పనులు చేసేయ్యచ్చును. ఆది శంకరుడు "అహం బ్రహ్మాస్మి" అనడం వేరు, ఎవడో భూటకసన్యాసి "అహం బ్రహ్మాస్మి" అనడం వేరు. పదాలు అవే, మనసులో భావం, అంటున్న ఆత్మ స్థితి వేరు. ఆది శంకరుడికి ఒక త్రాగుబోతు ఎదురయితే "నాయినా, ఇది చెడ్డ అలవాటు, మానుకోరా!" అని చెప్పారట ఆయన. దానికి వాడు, "మీ శివుడు త్రాగితే లేనిది నేను త్రాగితే వచ్చిందా?" అని అడిగితె, ఆయన వెంటనే కొంచెం విషం ఇచ్చి, "శివుడు గరళం కూడా త్రాగాడు. ఇది నువ్వు త్రాగు!" అన్నారట. ఉన్న విషయంలో తనకు అనుకూలంగా ఉన్న భాగాన్ని మాత్రమె గ్రహించడం మనిషి నైజం. దీన్నే అవకాశవాదం అని కొంతమంది అంటూ ఉంటారు.
"మై నే ప్యార్ కియా" కి "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "జో జీతా వోహి సికందర్" కి "తమ్ముడు" కి మధ్యన ఉన్నది స్ఫూర్తి అంటే నేను ఒప్పుకోలేను. అవి మక్కీకి మక్కీ దింపేసిన చిత్రాలు. ఆ మధ్యన "గుడుంబా శంకర్" సినిమానే "ఆట"గా తీసారని ఒక నిర్మాత ఫిర్యాదు చేసారు. మరి గుడుంబా శంకర్ చిత్రానికి వెనుకన ఎన్నెన్ని సినిమాలు ఉన్నాయో ఆయనే చెప్పాలి. బిందాస్, జయీభవ, ఆర్య-2, don శీను మొదలైన చిత్రాలన్నీ నా కళ్ళకు ఒకటే కథ లాగా కనిపించాయి. ఇక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర - ఇలాగ చెప్పుకుంటూ పొతే కోకొల్లలు. ఈ మధ్యన విజయవంతమైన రవి తేజ చిత్రాలు చూస్తుంటే ప్రేక్షకుల అభిరుచి ఇంత దరిద్రంగా తయారైందా అనిపిస్తోంది. అన్నీ ఒకే కథ లాగా అనిపించాయి. సరే ఇంకా శక్తి, బద్రీనాథ్ ల సంగతి అందరూ చెప్పుకుంటూ ఉన్నదే. కోడి రామకృష్ణ శివ చిత్రం చూసి శత్రువు చిత్రం తీసారట. ఆ రెండు చిత్రాలూ నేను చూసాన. శత్రువు చిత్రం చూసినప్పుడు నాకు శివ చిత్రం గుర్తు రాలేదు. స్ఫూర్తి అంటే ఇలాగ ఉండాలి ఆయన చెప్పడం నేను విన్నాను, ఏకీభవిస్తాను.
అయ్యా దర్శకులూ! ఒక సారి మన దక్షిణాదిన కే. బాలచందర్ ని చూడండి. వంద చిత్రాలు తీసారు. కథకథకీ వైవిధ్యం ఉంది. మధ్యతరగతి ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసిన చిత్రాలు మనందరికీ గర్వకారణం. బలమైన కథని, సంభాషనలని, సంగీతసాహిత్యాలనీ నమ్ముకున్న ఆయనకు ఎప్పుడూ ఇలాగ ప్రచారం చేసుకోవలసిన/సమర్థించుకోవలసిన పనిపడలేదు. మన రాష్ట్రంలోనే నీలకంఠ, క్రిష్, శేఖర్ కమ్ముల లాంటి దర్శకులు పురోగమనాన్ని సాధిస్తున్నారు. కాస్త మీ ముక్కిపోయిన గుజ్జుని బయట పారేసి బుర్రలో గుజ్జుకి పని చెప్పండి. మీ బుర్రలో గుజ్జు లేదు అని నేను అనుకోవట్లేదు. గుణ శేఖర్ తీసిన సొగసు చూడ తరమా, మనోహరం అద్భుతమైన చిత్రాలు. త్రివిక్రమ్ తీసిన నువ్వే నువ్వే చక్కని చిత్రం. వంశీ చిత్రాలలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. మరి ఆ తరువాత వాళ్ళ చిత్రాలు ఎందుకు బాగా రాలేదు. సమాధానం వారికే తెలుసును.
మంచి దర్శకుడు కావాలంటే మంచి పుస్తకాలు చదవాలి, జనజీవనం పైన ఒక అవగాహన ఉండాలి, చేసే పనిపైన శ్రద్ధ, అంకితభావం, గురవం ఉండాలి. ఇవన్నీ సాధించెంతవరకూ మీకు ఏదైనా మానసిక వైద్యశాలలో treatment అవసరం, మీ treatment మాకు అనవసరం.
13 comments:
true. ciruta movie release appuDu poori jaganaatt interview lo direct ga ceppaaDu ee movie kEvalam raam caraN kOsamE, indulO katha Emii lEdu. ninna nEnu "guppEDu manasu " coosaa. enta bagaa treat cEsaarO asalu cinna point ni
ఇప్పటి సినిమాలు అంటేనే..విసుగెత్తే ,ఏహ్య పడే.. దారుణమైన పరిస్థితులు. మంచి అభిరుచి గల దర్శకుల చిత్రాలు చూసిన ఒకప్పటి ప్రేక్షకుల మనసులో.. మాట ని.. ఓపికగా ఆవిష్కరించారు..సందీప్.. వెర్రి మొర్రి స్టేట్మెంట్ లు విని.. ఎవరు.. సమయాన్ని ,ధనాన్ని, అంతకు మించి.. సహనాన్ని.. ఖర్చు చేసుకొనడానికి..ఇష్టపడటం లేదనేది సినిమా..వ్యాపార జాతికి..ఎప్పుడు అర్ధమవుతుందో!..చాలా బాగా చెప్పారు. అభినందనలు
నిన్న డాన్ శీను టీవీలో వస్తే నా ఖర్మ కాలి హీరో హీరోయిన్ పరిచయం అయిన దృశ్యం చూడాల్సి వచ్చింది. ఇంత దారుణంగా ఈ స్థాయికి పడిపోయిందా మన (ప్రేక్షకుల, దర్శకుల ) అభిరుచి అని తెల్లబోయాను.
సినిమా రంగంలో తరచూ వినే పనికిరాని చెత్త స్టేట్మెంట్లను, perceptions నీ బాగా కడిగేశావు, తమ్ముడూ.
నీ వ్యాసం ఎంత మందికి అర్థం అవుతుందో? దీని చదివి స్వయవిశ్లేషణ ఎంతమంది చేసుకోగలరో? sensible people కి ఈ వ్యాసం అవసరమేలేదు. నాన్-sensible people కి ఇది అర్థంమేకాదు!
"ఉన్న విషయంలో తనకు అనుకూలంగా ఉన్న భాగాన్ని మాత్రమె గ్రహించడం మనిషి నైజం. దీన్నే అవకాశవాదం అని కొంతమంది అంటూ ఉంటారు." కళ కళకోసం అన్న భావనకలిగినవారు అతితక్కువే ఉన్నారు ఈ రోజుల్లో!
నవ్వించావు! చెప్తున్న విషయాన్ని నవ్విస్తూ చెప్పి పాఠకుణ్ణీ ఆలోచింపజేయడం అనే నీ చతురతకు జోహార్లు.
చేసే పనిపైన శ్రద్ధ, అంకితభావం, gouరవం ఉండాలి,, bagaa cheppAvu.. konni typos unnaTlunnAyi akkaDakkaDA oka saari chUsukO.. mottAniki manchi vyAsam vrASAvu :)
chaaalaa baauMdi Sandeep gaaru.kaakapOtE okE okkaTi baadha anipinchindi.anni paaTallOnU "bUtu padAlu" mAtramE unDaTlEdu..kaakapOtE avi ekkuva ayyaayi ani naa abhiprAyaM.eMdukamTE oka paaTa ki emta madhana paDatArO mana snEhitulanu chUstE artham ayymdi naaku.manchi paaTalu baiTaku raavaTlEdu.ninna badrinath cinema chUSAnu..bhayankaramgaa anipinchindi.asalu paaTalenduku peTTADO arthamE kaalEdu..ticket koni marI chUSaanu ikkaDa.mIru prastaavinchina migataa aMSaaku annI baaunnaayi.
నాదీ భాస్కర్ గారి మాటే! ఒక పక్క నవ్విస్తూనే చాలా చక్కగా చెప్పారు అసలు విషయాలని.. ఆ స్టేట్మెంట్లు వినీ వినీ మాకూ విరక్తి వచ్చింది కాబట్టి ఇప్పుడుమీ పోస్ట్ చూసాకా కాస్త కోపం చల్లబడి హాయిగా ఉంది.. :)
అసలు భాస్కర్ గారి మాటే వ్రాయలేదు,కన్వీనియ౦ట్ గా మిస్ కొట్టారు :)
@ శ్రీనివాస్
అన్నాయ్, ఈ వ్యాసానికి లేఖిని/పద్మ వాడకుండా గూగుల్ వాడి ట్రాన్స్లిటరేషణ్ వాడినందుకు ఆ తప్పులు దొర్లాయి. వీలు చూసుకుని సరి చేస్తాను.
@ శైలజ
మీరన్నది నిజమే. అందుకే ఆ వాక్యాన్ని సరిచేశాను. నా అనాలోచిత వాక్యాన్ని సవరించినందుకు నెనర్లు :)
@ మౌళి
మీరు భాస్కర్ అన్నది బొమ్మరిల్లు దర్శకుడినా? లేక అవినేని గారినా?
@అవినేని గారినా
ఆ పేరు తో సినిమా డైరెక్టర్ కాని, ఇ౦కెవ్వరు కాని నాకు తెలీదు స౦దీప్ గారు. మొదటిదే ఖాయ౦. మీ సమాధాన౦ చెప్పాలి మరి. మీరు భళా అన్న 'నువ్వే నువ్వే' కన్నా భాస్కర్ సినిమాలు ఇ౦కొ౦చె౦ విలువలతో ఉన్నాయని నా అభిప్రాయ౦ (త్రివిక్రమ్ ని తక్కువ చెయ్యడ౦ లేదు)
@ మౌళి
వసూళ్ళ పరంగా ఐతే ఆరెంజ్ చిత్రాన్ని కచ్చితంగా ఆ జాబితాలో చేర్చాల్సిందేనంటాను :) ఈ వ్యాసం ద్వారా చెత్త చిత్రాల జాబితా తయారు చెయ్యడం నా ఉద్దేశం కాబట్టి ఇటీవల బోల్తా పడిన ప్రతీ చిత్రాన్ని అక్కడ ప్రస్తావించలేదు :)
:) భాస్కర్ ఇ౦తవరకు చెత్త సినిమా తియ్యలేదు నిజమే, అ౦దుకే మీ వ్యాస౦లో ఆ పేరు లేదు. అర్ధ౦ అయ్యి౦ది.
మీ వ్యాస౦ బాగు౦ది కాకపోతే, ప్రేక్షకులు కూడా ఒక కారణ౦ చెత్త సినిమాలు రావడానికి.వారి గురి౦చి చెప్పకు౦డా వ్యాస౦ పూర్తికాదు అని నా అభిప్రాయ౦ అ౦తే.
చాలా సరదాగా రాశారు . అభినందనలు . విలేకర్లకి కాపీలు , టిపినీలు పెట్టి ' నాలుగు మంచి ముక్కలు రాయండర్రా ' అనే పబ్లిసిటీ గూర్చి సీరియస్ గా తీసుకునేవారు ఎవరూ ఉండరు . మరి ఈ రకమైన ఊకదంపుడు అవసరమా ? అంటే అవసరమే ! సినిమా మొదలెట్టటానికి కొబ్బరికాయ ఎందుకు ? అట్లాంటిదే ఇది కూడా !
Post a Comment