Sunday, September 12, 2010

అంతరాయానికి చింతిస్తున్నాము

నేను దాదాపు నెలరోజులపాటు ఒక్క టప కూడా వ్రాయలేదు. (అంటే, నా టపల కోసం ఎవరో కాచుకుని కూర్చున్నారు అని అనట్లేదు అనుకోండి.) దానికి కారణం నా స్వదేశగమనం. భారతదేశానికి వెళ్ళి అక్కడ కుటుంబాన్ని, బంధువులని, మిత్రులని కలిసి వెనక్కి వచ్చాను. నేను వెనక్కి రాగానే శనైశ్చరుడు హస్త (నాకు నైధన తార) మీదకు జరిగాడు. తస్సాదియ్యా, నాకు సరదా తీరిపోతోంది. 2011 సెప్టెంబర్ వరకు నాకు చక్కని కాలక్షేపం.

రెండు రోజులనుండి టప వ్రాద్దామని ప్రయత్నిస్తున్నాను కానీ, "ఇదేంటి, ఇదేదో కొత్త ప్రపంచంలాగా ఉందే. ఇవన్ని టపలు వ్రాసింది నేనేనా?" అనే భావం మెదులుతోంది మనసులో. స్వగృహదూరవేదన (home-sick ని తెనుగీకరిద్దామని ప్రయత్నించాను) మనసులోకి దూరదామన్నా ఖాళీ లేనంత పనిలో పడ్డాను. ఏదేమైనా నీళ్ళల్లోకి దూకాక ఈదక తప్పుతుందా.

అలంకారాల టపలు కొనసాగిస్తాను. వీలైనప్పుడు మళ్ళీ పద్యాలు వ్రాస్తాను. వేటూరి వారి సాహిత్యం గురించి కూడా టపలు వ్రాస్తాను. చిట్టి కథలు కూడా వ్రాస్తాను. చదువర్లు అక్షతలు వెయ్యాలనుకుంటే వ్యాఖ్యలను వాడుకోగలరు.

ఇంతే సంగతులు
చిత్తగించగలరు
భవదీయుడు
రామకృష్ణ సందీప్

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

భలేవారే!
నెలకే అన్నీ అంత కొత్తగా అనిపిస్తున్నాయా?
కాచుకొని లేమని మీకెవరు చెప్పారేంటి?

Sandeep P said...

ఁఅందాకిని గారు

మీ ప్రోత్సాహానికి నెనఱ్లు అండి :)