రాంబాబు ఏదో ఒకరోజు మారతాడు, కార్పొరేట్ సెంటు పూసుకుంటాడు అని చందుకి ఎక్కడో కొంచం ఆశ ఉండేది. కానీ, ప్రతీ రోజూ ఇంగ్లీషు idioms కి విపరీతార్థాలు తీస్తూ idiot అనిపించుకుంటూనే ఉన్నాడు. చందు, రాంబాబు అమాయకత్వాన్ని చూసి తన రూంలోనే ఉండమన్నాడు. వాళ్ళు ఇప్పుడు room-mates and team-mates. ఇలా కొన్నాళ్ళు జరిగిపోయాయి. తఱువాత చందు మిత్రుడి ద్వారా వెంకట్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. తనూ software engineer ఏ కావడం, వాళ్ళ office చందు ఇంటికి దగ్గరగా ఉండటం చేత చందు వాళ్ళ ఇంట్లోనే చేరతానంటే చందు ఒప్పుకుంటాడు. ఒక మధ్యాహ్నం పూట వెంకట్ సామాన్లతో చందు, రాంబాబుల ఇంట్లోకి దిగాడు. అప్పటినుండి వెంకట్కి చెవుల్లో జోరీగ duplex house కట్టుకుని కాపురం ఉంటున్న feeling మొదలైంది.
వెళ్తూనే రాంబాబుని చూసి, "Hello, I am Venkat, from Vijayawada!" అన్నాడు. దానికి రాంబాబు, "I am Rambabu from baapaTla." అన్నాడు. వెంటనే రాంబాబు చిరునవ్వుతో "Do you care for a చిలగడదుంప?" అన్నాడు. ఒక్క నిముషం వెంకట్ కి అర్థం కాలేదు. అది గమనించిన చందు, "ఏం లేదు వెంకట్, రాంబాబు 'చిలగడదుంప తింటావా?' అని అడుగుతున్నాడు", అన్నాడు. దానికి వెంకట్ రాంబాబుని చూసి, "నేను తెలుగువాడినేనండి", అన్నాడు. దానికి రాంబాబు, "I know. But, still I talk in English only", అన్నాడు. ఆ shock నుండి వెంకట్ తేరుకుని ఇల్లు సర్దుకునేసరికి రాత్రి అయ్యింది. ఆ time కి రాంబాబు వంట చేసాడు.
భోజనానికి paper పరుచుకుని ముగ్గురూ కూర్చుక్న్నారు. వెంకట్ కూర తిన్నవెంటనే మజ్జిగ packet పట్టుకోవడం చూసిన రాంబాబు, "Hey, Help yourself to some పులుసు!" అన్నాడు. dinnerతోపాటు ఖంగు తిన్న వెంకట్, "రాంబాబు, పులుసు అనేది తెలుగుపదం కదా? మరి దాన్ని ఇంగ్లీషు వాక్యంలో ఎలాగ వాడుతున్నావు?", అని ధర్మసందేహం అడిగాడు. దానికి రాంబాబు ఒక నవ్వు నవ్వి, "How much possible, that much I talk in English. I do my best and leave the rest!" అన్నాడు. అప్పుడు తెలిసింది వెంకట్కి తను భోజనం చేసి అక్కడనుండి వెళ్ళిపోవడం ఉత్తమం అని.
పొద్దున్నే లేచి సుప్రభాతం వినడం అలవాటు ఉన్న వెంకట్ laptopలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి సుప్రభాతం పెట్టాడు. ఆ సడికి మెలుకువొచ్చిన రాంబాబు లేచి, "Oh! Morning morning you listen సుప్రభాతం ఆ?", అన్నాడు. అది విన్న వెంకట్ వెంటనే సుప్రభాతం కట్టేసి, తన చెవులకి కాస్త శాంతిని కలిగిద్దామని bathroomలోకి దూరాడు. brush తీసి దానిపైన paste వేశాడో లేదో, ఇంతలో రాంబాబు తలుపుతట్టి, "Hey, I want to write oil to my hair. Please give me Parachute." అన్నాడు. నాలికబద్దతో రాంబాబు నాలిక కోసెయ్యాలి అనిపించినంత కోపం వచ్చినా సముదాయించుకుని ఆ నూనెసీసా బయటకు ఇచ్చి రక్తం వచ్చేంత speedగా పళ్ళు తోముకున్నాడు.
రాంబాబు NDTV పెట్టుకుని వార్తలు వింటున్న సమయంలో చందు లేచి వచ్చాడు. అప్పుడు వెంకట్, చందు ఏదో బాతాఖానీ కొట్టుకుంటూండగా, తనకు ఆఫీసులో ఒకమ్మాయి ఎంతగా కోపం తెప్పించిందో చందు చెప్తున్నాడు. "That is why I hate ladies", అని రాంబాబు, ఎక్కడనుండి వచ్చాడో తెలియకుండానే వచ్చి అన్నాడు. వెంకట్ 'ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావూ?' అన్నట్టు ఒక చూపు చూశాడు. అప్పుడు రాంబాబు ఇచ్చిన ఉపన్యాసానికి వెంకట్కి సన్యాసం తీసుకోవాలి అనిపించింది. "I hate ladies. Coolly they come at 10'o clock to office like Perantaas. I tell them the work like a parrot. They listen with one ear and leave it another ear.Everything is over-head-transmission. They don't finish their work before deadline. When I ask them why, they start dropping crocodile tears. They have no insight but want onsite. It is not words to tell the headache they create.", అన్న రాంబాబును చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు వెంకట్. రాంబాబు ఆ ఆవేశాన్ని చల్లార్చుకోవడానికి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
తను చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి నేర్చుకున్న ఇంగ్లీషుని రెండురోజుల్లో మరిచిపోయేలాగా చెయ్యగల రాంబాబుని చూసి వెంకట్కి దిమ్మదిరిగింది. చందుని పక్కకు పిలిచి, "అసలు వీడి problem ఏమిటి? ఎందుకు ఇలాగ ఇంగ్లీషుని ఖూని చేస్తున్నాడు?", అని అడిగాడు. అప్పుడు చందు చెప్పాక తెలిసింది అసలు విషయం.
రాంబాబుకి స్వతహాగా తెలుగంటే పిచ్చయిష్టం. కానీ తన జీవితంలో మరిచిపోలేని దినం - 22-మే-2009 - ఆ రోజు జరిగిన విషాదానికి అతని గుండె ముక్కలుముక్కలయ్యిపోయింది. ఆ రోజునుండి తన పద్ధతే మారిపోయింది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రెండింటికి దూరమయిపోయాడు - ఒకటి తెలుగు, రెండు దివ్య!
రాంబాబు చేరిన రెండు మూడు రోజులకే Luckwhereలో మహేష్, దివ్య అనే ఇద్దరు చేరారు. వాళ్ళని రాంబాబు టీంలోనే వేశారు. మహేష్ తమిళుడు. దివ్య తెలుగుది. దివ్యను చూసిన వెంటనే రాంబాబుకు కళ్ళు తిరిగి కిందపడిపోయాడు - "ఏం అందం, ఏం అందం! దివ్య నాకే!" అనుకున్నాడు మనసులో. ముగ్గురూ bank accounts open చెయ్యాలి కాబట్టి కలిసి దగ్గరలో ఉన్న bank కి వెళ్ళారు. మహేష్, దివ్య ఇంగ్లీషులోనే మాట్లాడుకోవడం చూసిన inferiorగా feel అయ్యాడు. ఎలాగైనా తన ఇంగ్లీషు ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు. ముగ్గురూ queue లో application forms fill చేసి, పట్టుకు, నుంచున్నారు. మొదట రాంబాబు వెళ్ళి ఆ form అక్కడ ఉన్న officer కి ఇచ్చాడు. "Fill challaan sir", అంది ఆమె. challaan అంటే ఏమిటో తెలియని రాంబాబు అది కన్నడం అనుకుని, "Speak in English, అన్నాడు. ఆమె, "I spoke in English sir", అంది. వెంటనే మహేష్, దివ్య నవ్వారు. ఆ గాయం తాకిన బరువైన గుండెతో రాంబాబు ఆఫీసుకి వచ్చేశాడు. ఆ బాధను మరిచిపోవడానికి అరగంట foosball ఆడాడు, అరడజనుసార్లు కాఫీ తాగాడు. కాస్త మనసు కుదుటపడ్డాక తన computer ముందుకు వచ్చి కూర్చున్నాక తన teamలో తెలుగువారందరూ cinema కి వెళ్దామని అనుకుంటున్నారని మనశ్శాంతికోసం తనూ వెళ్ళాలి అనుకున్నాడు. తెలుగు సినిమా కాబట్టి మహేష్ రాడనుకున్నాడు రాంబాబు. పాపం, తనకు తెలియదు అక్కడ తన గాయం మీద కారం పడుతుంది అని.
సినిమాలో రాంబాబు అనే పేరుని చాలా తక్కువగా చూపించి, మహేష్ అనే పేరుని గొప్పదిగా చిత్రీకరించారు. అది చూసి తన colleagues అందరూ (దివ్యతో సహా) తనకేసి చూసి నవ్వడం మొదలెట్టారు. అది సహించాడు. కానీ, బయటకు వచ్చాక దివ్య "నేనే హీరోయిన్ ని అయితే రాంబాబుని కాదు మహేష్నే పెళ్ళి చేసుకునేదాన్ని", అనడం ఆ 70mm screenని 7mm bladeగా చేసి తనగుండెను కోసినట్లుగా అనిపించింది. సహించాడు. కానీ ఆ తరువాత కొన్నాళ్ళకు తెలిసింది మహేష్, దివ్య ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అని. ఇది జరిగినప్పటినుండి రాంబాబుకు అమ్మాయిలంటే చిరాకు పట్టుకుంది. ఎప్పటికైనా మహేష్ కన్నా పాషుగా ఇంగ్లీషు మాట్లాడి దివ్యకంటే అందమైన అమ్మాయిని ప్రేమలోకి దింపాలన్నది వాడి ఆశయం. అది వాడి విషాదగాధ!
కథంతా ఓపిగ్గా విన్న వెంకట్ తన సానుభూతిని ఒక్కముక్కలో తేల్చేశాడు, "తూ, వీడొక గధా, వీడిదొక గాధ!", అన్నాడు. వెంటనే వెంకట్కి ఒక సందేహం వచ్చింది, "అవునూ, వీడికి అమ్మాయిలంటే ద్వేషమన్నావు? మరి ప్రేమలోకి దింపడం దేనికి?", అన్నాడు. దానికి చందు, "అదే కదా వాడి sadism. అమ్మాయి తనకు propose చేశాక, no చెప్పి స్త్రీజాతిమీద తనకున్న కచ్చి తీర్చుకోవాలన్నదే వాడి తపన!", అన్నాడు చందు. "software industryలో ఇంగ్లీషు-మన్మథుడన్నమాట. అఘోరించనీ", అన్నాడు వెంకట్.
చందు రాంబాబుని సముదాయించడానికి గదిలోకి వెళ్ళాడు. అక్కడ రాంబాబు ఉడికిపోతూ ఉన్నాడు. చందు, "రాంబాబూ, control yourself", అన్నాడు. రాంబాబు ఊపిరి బలంగా పీలుస్తూ మఱొక ప్రసంగం మొదలుపెట్టాడు.
రాంబాబు: ఈ ఆడవాళ్ళతో ఒక తంటా కాదురా బాబు. గొప్ప చిరాకు తెప్పిస్తారు. వీళ్ళను చూసి చూసి నాకు పెళ్ళి చేసుకోవాలనే కోరిక నానాటికీ చచ్చిపోతోంది. చందు (మనసులో): ఇప్పుడు నిన్ను పెళ్ళి గురించి ఎవరడిగారు? రాంబాబు: మనిషి తనకు అనుకూలంగా ఉన్నదాన్ని మాత్రమే ఒప్పుకుని, అనుకూలంగా లేనిదాన్ని వ్యతిరేకించడం సహజమే. కానీ, అలాగ చెయ్యడంలో కాస్త కన్సిస్టెన్సీ ఉండాలి కదా? అహా, అసలు మనలో మన మాట! చందు: అవునురా? ఇప్పుడేమైంది?
రాంబాబు: స్త్రీపురుషుల సమానత్వం అంటారు - ముప్పీమూడు శాతం reservation అంటారు! ఒరేయ్, అందరం కలిసి shopping కి వెళ్తే డబ్బు ఖర్చు చేసేది మనము, luggage మోసేది కూడా మనమేనా? ఇదేం న్యాయం రా?చందు: నిజమే! రాంబాబు: నిజాలు చెప్తే ఒప్పుకోరు, ఒప్పుకోలేరు, జీర్ణించుకోలేరు. డ్రెస్సులు కొంచెం ఆకర్షించేలాగ వేసుకోవాలనుకుంటారు. అదేమంటే - మాకు comfortable గా ఉండద్దా? అంటారు. జాకెట్టుకు బొక్క- ఏమన్నా అంటే మాధురీ దీక్షిత్ దీనికక్క! గుడ్డ్లప్పగించి చూసేవాళ్ళ గురించి లెక్చర్లు దంచుతారు. మగవాళ్ళు ఆడవాళ్ళను కాక వీధిలో కుక్కల్ని, విహాయసవీధిలో చుక్కల్ని చూస్తారా? చందు: అవును. (ఇంత ఆవేశంలో కూడా ప్రాస కోసం రాంబాబు పడే ప్రయాసను చూసి నవ్వుకున్నాడు). రాంబాబు: ఏ దేశంలోనైనా మగవాడలాగే ఉంటాడంటే ఒప్పుకోరు. ఏమైనా అంటే ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటారు. నేను కాలేజీలో జాయినైన కొత్తల్లో ఒకడు మా పక్కనుండి వెళ్తున్నమ్మాయిని చూసి movie styleలో కామెంటు చేశాడు. నేను, "తప్పురా, పరస్త్రీ మాతృసమానురాలు" అన్నాను. దానికి వాడు, "మన స్త్రీ ఎవరో తెలిస్తేనే కదా, పరస్త్రీ ఎవరో తెలియడానికి", అన్నాడు.చందు: హ హ హ, వాడన్నదాంట్లో కూడా కొంత విషయం ఉంది.రాంబాబు: అది సరే. కానీ, వాడు అమ్మాయి ముందు మాట్లాడేటప్పుడు మాత్రం, అభ్యుదయభావాలతో, సున్నితత్వంతో మాట్లాడేవాడు. అప్పుడు తెలుసుకున్నాను అందరూ ఒక లాగే ఆలోచించరు అని. ఆలోచించినదే మాట్లాడరని. ఈ విషయం అమ్మాయిలకు ఎప్పుడు అర్థమవుతుందో! ఏమైనా చెప్దామని ప్రయత్నిస్తే...judge చెయ్యద్దంటారు (ఇదొక విచిత్రం, judge చెయ్యని మనిషిని చూపించు జగజ్జడ్జీ! అని భగవంతుణ్ణి అడగాలనిపిస్తుంది.) - మరి మగవాళ్ళతో మాట్లాడినట్టే మీతో మాట్లాడితే (అంటే కొంచెం పదునైన మాటల్తో, కఠినమైన వాస్తవాలతో, అక్కడక్కడా level-1 తిట్లతో) ఎందుకు ఒప్పుకోలేరు?చందు: మామ, నీలో మంచి ఆవేశం ఉందిరా. బాగా చెప్పావు.
రాంబాబు: వీళ్ళనర్థం చేసుకోవడం: నా వల్లకాదు, నాదు వల్లకాదు, నా చేతన్, చేన్, తోడన్, తోన్ వల్లకాదు, నా వలనన్, కంటెన్, పట్టి వల్ల కాదు, నా కొఱకున్, కై వల్లకాదు, నా కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ వల్లకాదు, ఓయీ, ఓసీ, ఓరీ, ఏమే, ఏమేమే, ఓరోరీ నా వల్లకాదు! కాదంటే కాదు. చందు: విభక్తులనన్నిటినీ వాడి నీ విరక్తిని చెప్పావు కదరా మాఁవా!

1 comment:
హ్హ..హ్హ..హ్హ.. భలే నవ్వించారండీ!
Post a Comment