ఈ పాట "జెమిని" సినిమాలోది. ఒక వ్యక్తీ చనిపోతే ఎంత బాధ కలుగుతుందో, ఎవరెవరో ఎలాగ బాధపడతారో చెప్పే పాట. ఇందులో నేను వ్యాఖ్యానిన్చటానికి ఏమి లేదు. ఆ వాక్యాలు అన్నీ సామాన్యులకు అర్థమయ్యేలాగా ఉన్న మాటలే. ఐతే నా మనసుని తాకినా వాక్యాలు రెండు: "నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది".
చిత్రం: జెమిని
రచన: వేటూరి
సంగీతం: ఆర్ పీ పట్నాయక్
పాడింది: వందేమాతరం శ్రీనివాస్
చుక్కల్లోకేక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
తల్లిడిల్లిపోతుంది తల్లి అన్నది
బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది
పాడె ఎత్తడానికే స్నేహమన్నది
కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది
పోయినోడు ఇక రాడు,ఎవరికెవరు తొడు
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది
కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది
చావుబ్రతుకులన్నవి ఆడుకుంటవి
చావు లేని స్నేహమే తోడూ ఉంటది
7 comments:
నేను విన్నాగ ఈ పాట... కానీ మొన్న టీవీ లో చూస్తే గుర్తు రాలేదు....
ఈ పాటలో కొంచెం ఆత్రేయ వ్రాసిన "ఈ జీవన తరంగాలలో" అన్న పాట వాసనలు వెయ్యటం లేదూ?
"ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు" -- ఈ లైన్ "ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు" అనే ఆత్రేయ లైన్ గుర్తుకు తెస్తోంది. ఇది "పాడుతా తీయగా చల్లగా" అనే పాతలోనిది.
ఈ "నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది" అనే లైన్ "ముత్తు" చిత్రంలో "మట్టి మీద మనిషికి ఆస, మనిషి మీద మట్టికి ఆశ, చివరికి మన్నే గెలిచేది, అది మరణం తోనే తెలిసేది", అనే లైన్ ని తలపిస్తోంది.
Nice ra . U have good taste.by getting u as my friend i too proved myself as a tasty felow. bye ra
ఈ పాట పాడింది వందేమాతరం శ్రీనివాస్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాదు.
ఈ పాట ఎందుకు తేలియదండీ బాబూ.రెణ్ణెల్ల క్రితం వరకు తెలియకపోయినా రాజశేఖర రెడ్డి గారు పోయినపుడు అన్ని వార్తా చానళ్ళు ఇదే పాటని మూడు రోజులపాటు ఏకబిగిన వినిపించేశాయి. అప్పటి నుండయినా ఎ.పి జనాలకి ఈ పాట చిరపరచితం అయిపోయి వుండాలి.
చాలా మంచి పాట ని మళ్ళీ గుర్తు చేశారు. ధన్యవాదాలు.
@రవిచంద్ర
కరక్టేనండి. నాకు స్పష్టంగా వందేమాతరం శ్రీనివాస్ అని తెలుసును, ఏదో కంగారులో ఎస్ పీ బీ అనేసాను. చెప్పినందుకు నెనర్లు.
Post a Comment