Monday, November 2, 2009

కార్తీకపౌర్ణమి

ఈరోజు కార్తీకపౌర్ణమి, కార్తీక సోమవారం. శివకేశవులకు మిక్కిలి ప్రీతికరమైన రోజు. కార్తీకమాసం యొక్క విశిష్టత గురించి, ఈ మాసంలో చెయ్యాల్సిన విధుల గురించి కార్తీకపూరణం లో వివరించబడింది. ఎన్నో పాపాలు చేసినా కార్తీకమాసంలో శివుడికి కై, కేశవుడికి కాని ఒక్క దీపం పెడితే పోతుంది అని పెద్దల మాట. వశిష్టుడు జనకమహారాజుకి ఈ మాసం యొక్క ప్రాశస్త్యం గురించి కార్తీకపురాణం వివరించాడు. భక్తితో ఒక్క సారి శివ అనో, హరి అనో అన్నవాడికి పాపాలు తొలగి సద్బుద్ధి కలుగుతుంది.

ఈ మాసంలో ఉపవాసం ఉండటం కూడా శ్రేష్టమైన పని. ఉపవసలలో అనేక రకాలు ఉన్నాయి. నియమం ప్రకారం వెళ్తే, ఈ రోజు ఉపవాసం ఉందాము అనుకునేవాళ్లు నిన్న సూర్యాస్తమయం నుండి రేపు ఉదయం సూర్యుడు ఉదయించిన నలభైఎనిమిది నిముషాల వరకూ ఏమి తినకూడదు. కొందరు పచ్చిగంగా కూడా తాగారు, కొందరు నీళ్ళు మాత్రం తాగితే, కొందరు పాలు తాగుతారు. ఇది ఇలాగ ఉంటె, ఇంత సాహసం చెయ్యలేని వాళ్ళు (ముసలివాళ్ళు, నా లాంటి తిండిబోతులు మొ||) ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం తార (నక్షత్రం) దర్సనం అయ్యేవరకు ఏమి తినరు. దీనినే ఏకభుక్తం అంటారు అని నాకు గుర్తు. అలాగే కొందరు మధ్యాహ్నం భోజనం అయిన తరువాత ఇంకేమి తినకుండా రాత్రి పాలు తాగి పాడుకుంటారు. కొందరు పళ్ళు తింటారు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చెయ్యచ్చు. ఏదేమైనా, ఉల్లి-వెల్లుల్లి లాంటి తామస గుణము ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు.

శివకేశవులకు సంబంధించిన మంత్రాలు (ఉదా|| ఓం నమఃశివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ) ఉచ్చరించేవాళ్ళు అవి తప్పక చెయ్యగలరు. ఈ రోజు గొప్పదనం గురించి నేను ఇంతకంటే చెప్పనవసరం లేదు.

"నాకు భక్తీ అంతే తెలియదు కానీ, దేవుడికి దణ్ణం పెట్టుకోవడం తెలుసును", అనుకునేవాళ్లు ఇవన్నీ చెయ్యలేకపోయినా కనీసం మాంసాహారం మానేసి, వీలైనంతవరకు భక్తిరసప్రధానం ఐన పాటలు పెట్టుకుని వింటే మంచిది. పురాణాలు వినే ఓపిక ఉంటె వినచ్చును.

||హరి:ఓం||

3 comments:

శ్రీ said...

ఈరోజు శాఖాహారమే భుజిస్తాను

colors said...

hi sandeep,

ee blog lo konni spelling mistakes unnay..avi chusi correct chesko.. bahusha , transliteration valla ochay anukunta...

karteekapuranam ani okati undani naku teleedu.. good thing to know.. is it about karteekamasam or sri subramanyeshwara swami ?

Unknown said...

would like to add ... eppudu dhanurmasam Vishnu vu ki preethi kara maasam.e masam lo tiruppavai chadivithe chala punyam