Friday, October 2, 2009

భావాలతోట, పదాలతేట, వేటూరి పాట!

వేటూరికి రెండు అస్త్రాలు ఉన్నాయి. ఒకటి భాష, మరొకటి భావుకత. ఆ రెండూ ఉన్న కవిని పట్టుకోవడం అసాధ్యం. ఆది నుంచి ఉన్న తెలుగు సినీకవుల్లో ఎవరికీ లేనంత భాషాపరిజ్ఞానం ఒక్క వేటూరికే ఉంది అనటంలో యేమీ సందేహం లేదు. అదే కాకుండా, భారతీయ/తెలుగు సాంప్రదాయాలకు సంబంధించిన సాహిత్యాన్నీ చాలా వరకు చదువుకున్నాడు ఈయన. మరి ఆనాటి చదువులవి. ఇదంతా ఒక్క పెట్టు ఐతే, ఆకాశాన్ని తాకే ఆయన భావాలు నన్ను మైమరిపిస్తాయి. "ఆహా, భావాన్ని ఇంత అందంగా వర్ణంచచ్చా? ఇంకా అందంగా ఎవరైనా వర్ణించగాలరా?" అనిపించేలాగా ఆయన వ్రాస్తారు అని నా అభిప్రాయం.

ఐతే ప్రతీ ఒక్కరికీ వేటూరి మీద ఉండే కోపం ఏమిటి అంటే, అన్ని పాటలకూ అదే న్యాయం చేకూర్చరు అని. నేనూ ఒప్పుకుంటాను. ఆయన వ్రాసిన పాటల్లో చాలా ఎబ్బెట్టుగా ఉండే పాటలు కూడా ఉన్నాయి. "అసలు, పాట ఈయన వ్రాసి ఉండకపొతే బాగుండేది", అనుకున్న సందర్భాలు ఎన్నో. కానీ, ఎవరి వ్యాపారం వాళ్ళది. వేటూరిని విమర్శించే చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, "నేను వ్రాసే ప్రతీ లైన్ కీ న్యాయం చీస్తున్నానా?", అని వాళ్ళను వాళ్లు ప్రశ్నించుకోవాలి. అలాగే, వేటూరిని విమర్శించే ప్రతీ విధార్ధి, "నేను వ్రాసే ప్రతీ పరీక్షకీ నేను పరిపూర్ణంగా సంసిద్ధం అవుతున్నానా?", అని ప్రశ్నించుకోవాలి. ఐతే ఒకటి: అలాంటి రచయితలు లేరు నేను అనట్లేదు. కానీ, వాళ్లకు వేటూరి అంత లోతు, ఎత్తు, బరువు లేవు అని నా నమ్మకం. (శారీరకంగా కాదు అండోయ్, రచించడంలో). ఒక్క మాటలో చెప్పాలి అంతే వేటూరి ఎవరితోనూ పోల్చదగినవాడు కాదు. ఆయన స్థాయే వేరు.

నేను వేటూరికి వీరాభిమానిని. చెవులు, ముక్కు, నాలుక ఇత్యాది శరీరభాగాలని కోసుకుంటాను అని చెప్పను కానీ, మనసు ఐతే పారేసుకున్నాను ఆయన కవిత్వానికి. ఈయన రచనల్లో నాకు నచ్చిన లైన్స్ ఒక్కొక్కటిగా ఎక్కడైనా పేర్చాలి అనుకుంటున్నాను. ఆ భావంతోనే ఈ "వేటూరి నవరసాలు" అనే శీర్షిక మొదలుపెట్టాను.

3 comments:

మందాకిని said...

thanq!!

నిరంజన్ said...

ఆత్త్రేయ,ఆరుద్ర,శ్రీ శ్రీ లాంటి మహా రచయితల రచనా ప్రవాహాన్ని తట్టుకొని తనదైన ఒక నూతన ఒరవడిని స్ర్ర్షుష్టించిన వేటూరికి జన్మదిన శుభాకాంక్షలు.ఆయన వ్రాసిన పాటల్లో తెలుగుదనం ఉట్టిపదుతుంది.పల్లె పదాల అందాలు కళ్లకు కట్టినట్లుగ కనబదతాయి.జనపదాల సొయగాలు హొయలు పోతాయి.నీలి నీలి ఊసులు చెవుల్లో వినిపిస్తాయి.సాంప్రదాయ సంగీత కీర్తనలు,సంస్క్రత పదాలు సామాన్యులను అలరించలేవు అన్న వాదాన్ని "శంకరాభరణం" లో తన పాటల ద్వారా తప్పని నిరూపించారు."సిరి సిరి మువ్వలో" వారు వ్రాసిన"ఝుమ్మంది నాదం ,సై అంది పాదం,తనువూగింది ఈ వేళా, చెలరేగింది ఒక రాసలీల" అనే పల్లవి ఆయన వ్రాసిన ప్రతిపాట విన్నప్పుడు కలిగే అనుభూతి."ఆందంగా లెన ,అసలేం బాలెన,నీ ఈడు జోడు కానన,అలుసైపోయాన,అసలేమి కానన,వెషాలు చాలన" అని ప్రియుడి కోసం తపించే ప్రియురాలి తపన చెప్తూనే "మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశపడకే,అతనికి నువ్వునచ్చావో లేదొ, ఆ షుభ గడియ వచ్చేనొ రాదొ" అని హెచ్చరించినా వారికే చెల్లు.నవ్వింది మల్లె చండు ,"నచ్చింది గర్ల్ ఫ్రెండు ,దొరికనే మజగా చాన్సు ,జరుపుకో భలే రొమన్సు,యురెకా తకమిక,నీముద్దు తీరె దాక "అని ప్రియురాలి ప్రేమను పొందిన అనందాన్ని"స్నేహితుడా స్నేహితుడా,రహస్య స్నేహితుడా,చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా " అని ప్రియున్ని తలుచికునే ప్రియురాలి అలోచనలు మనకు అందిచింది ఆయనే."నవమి నాటి వెన్నల నెను,దశమి నాటి జాబిలి నెను,కలుసుకున్న ప్రతిరెయి,కార్తీక పున్నమి రెయు""మానసవీణ మదు గీతం,మన సంసారం సంగీతం' అని సంసారంలొని సరిగమల్ని పలికిచింది అయనే ."క్రుషి ఉంటే మనుషులు ఋషులౌతారు,మహాపురుషులౌతరు,తరతరాలకు వెలుగౌతారు,ఇలవెల్పులౌతరు" అని తట్టిలేపింది వారె."ఆకు చాటు పింద తడిసె,కొమ్మ చాటు పువ్వు తడిసె" అని కొంటె తనాన్ని నేర్పింది ఆయనే."ఏ కులము నీ దంటే ,గొకులము నవ్వింది,మాధవుడు,యాదవుడు మాకులము పొమ్మంది." అని కులాలు లేవు అని చెప్పందీ వారె."పుణ్యము పాపము ఎరుగని నేను,పూజలు సేవలు ఎరుగని నెను,ఏ పూలు తేవాలి నీపూజకు,ఏ లీల సేయలి నీ సెవలొ,శివ శివ శంకర భక్తవ శంకర ,శంభో హర హర నమో నమో" అని ఒక అమాయక కొయదొర భక్తిని "ఓంకర నాదాలు సందానమౌ రాగమే శంకరాభరణము " అని పండితుడి భక్తిని చెప్పింది ఆయేనె."ఛినుకులా రాలి నదులుగా సాగి,వరదలై పొంగి,హిమములై రాలి,సుమములై పూసె,నీప్రేమ నా ప్రేమ" అంటూ ప్రేమ ప్రవాహంలో ప్రయణింపచేసింది వారే."నిన్నటి దాక శిలనైనా ,నీ పదము సొకినే గౌతమి నైన" అని అన్నా,అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ ,అందరికీ అందనిదీ పూసిన కొమ్మ "అని ఒక సహజమైన పదాలతో అలరించిది వారె."ఆమని పాడవె హాయిగా,మూగవై పొకు ఈ వేళ," అని "అకాశానసూర్యుడుండడు సంధ్యవెళకే,చందమామకి రూపముండదు తెల్లవారితే,ఈ మజిలీ మూడునాళ్ళు ఈ జీవ యాత్రలో,ఒక ఒపూటలొనా రాలు పువ్వులెన్నో,నవ్వవే నవ మల్లిక ,ఆశలే అందలుగ " అంటూ ధైర్యాన్నిచ్చింది వారె."వెణువై వచ్చాను భువనానికి,గాలినై పోతాను గగనానికి ,మాటలన్నీ మౌనరాగం వాంచలన్నీ వాయులీనం " అని చెప్పిన అయనే "అకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమావిరహమో గానమో ,వినిపించు నా చెలికి మేఘసందేశం" అని అయనే అన్నారు .బహుశా వారు వ్రాసిన ప్రతి పాట మేఘసందేశమనే యేమో.

Ramesh said...

There is no second thought.. Veturi gave hundreds of wonderful songs. But when ever I compare veturi with sirivennela I feel later has the touch of realism in his lyrics, Where as I see a dreamy nature in Veturi's lyrics.