Sunday, September 27, 2009

అరకా పరకా

ఏంటో అమెరికాలో కామెడీనే లేదు. అయినా మల్లెపూలు, మావిడి పళ్ళూ లేని ఈ దేశం కూడా ఒక దేశమా అని అప్పుడప్పుడూ సందేహం కలుగుతుంది. ఆఖరికి ఎప్పటివో ఛలోక్తులు గుర్తు చేసుకుని నవ్వుకోవలసిన కర్మ పట్టింది. చద్ది అన్నం ఎలాగా అలవాటయ్యింది, ఇప్పుడు చద్ది జోకులు అన్నమాట. సరే, ఏవో గుర్తున్నవి.

% పృథ్వి అని నేను లాగూలు వేసుకునే రోజుల్లో, మా కాలనీ లో, చడ్డీలు వేసుకుని మాతో క్రికెట్ ఆడేవాడు. వాడు బాల్ పట్టుకోవడానికే ఆండీ రోడిక్ serve చేసినంత expression పెట్టేవాడు. కానీ, మహాఘటికుడు. ఒక సారి మా ఇంటి పక్కన తాతగారి ఇంట్లో లడ్డూలు చేశారు. ఆ వాసనకి వాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ చిన్న సంభాషణ:

పృ: తాతా, లడ్డూలు ఏవి తాత?
తా: లేవు మనవడా, ఐపోయాయి.
పృ: నిజం చెప్పు తాత. ఆ పైన డబ్బాలో పెడుతుంది మామ్మ.
తా: లేవురా నాయినా, నీకు అబద్ధం ఎందుకు చెప్తాను. నేను ఎలాగా తినలేను, షుగర్ ఉంది.
పృ: అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు తాత
తా: (అప్పటికే ఉన్న అల్లుడి బాధ తట్టుకోలేక) వద్దురా నాయనా! ఒక్క దానితోనే చచ్చే చావు వచ్చింది.
ప్రి: ఓహో, ఐతే ఇదివరకే ఒక అబద్ధం ఆడావన్నమాట!

వాడి ఆలోచనకు నాకు బాగా నవ్వు వచ్చింది.

% మా ఫ్రెండ్ ఒకడు గిన్నెలు తోమడం ఎప్పటికీ పొస్త్పొనె చేస్తూ ఉంటాడు. ఒక రోజు గాల్లో చేతులూపెస్తూ "వ్హత్ అ షొత్!", అని వాడిని వాడే పొగిడేసుకుంటున్నాడు. గిన్నెలు లేక వంట చెయ్యడానికి ఆలస్యం అయిన నాకు ఒళ్ళుమండి "హలో ధోనీ, బర్తన్ ధోనీ హై", అన్నాను. ఈ మల్టీ-లింగువల్ జోక్ తట్టుకోలేక వెంటనే తోమేసాడు.

% ఒక వీకెండ్ ఏమీ తోచక మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. వాడూ ఏమీ తోచక బుర్ర పీక్కుంటున్నాడు. నేను ఫోన్ చేసేసరికి, "తోడికోడళ్ళు" సినిమాలో "కారులో షికారుకెళ్ళే" అనే పాట వ్రాసే ముందు ఏ.యెన్.ఆర్ లాగా ఎక్ష్ప్రెస్సిఒన్ పెట్టి రోడ్ మీదకు చూస్తున్నటున్నాడు. అప్పుడు సంభాషణ:

నేను: ఏమిటిరా చిచ్చా, సంగతులు? చెప్పు
వాడు: ఏముంది మామ, అంత రొటీన్!
నేను: అంతేలే, మనకు గరళఫ్రెండ్స్ తప్పితే గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా! బోర్ గానే ఉంటుంది.
వాడు: అంతేలే, విరక్తి వచేస్తోంది.
నేను: ఇంకేంటి సంగతులు?
వాడు: నువ్వే చెప్పాలి.
నేను: ఎహే, ఏమి లేవురా. నువ్వే ఏమైనా చెప్పు.
వాడు: మామ, ఇక్కడ రోడ్ మీద రెండు కుక్కలు అచ్చికబుచ్చికలాడుకుంటున్నాయి మామ!
నేను: నీ యంకమ్మా, సంగతులు అంటే కుక్కలు అచ్చికబుచ్చికలాడుకోవడాలు, పిల్లులు ప్రేమగీతాలు పాడుకోవడాలు అంటారా?

% మా కాలనీ లో ఇంకో ముదురు కాండిడేట్ ఉన్నాడు. వాడు రెండేళ్లకే పొలికేకలు పెట్టించడం మొదలెట్టాడు. చివరికి వాడి బాధ తట్టుకోలేక వాడిని స్కూల్ లో జాయిన్ చేసారు. అక్కడ వాడి పక్క సీట్ లో "అపర్ణ", అనే అమ్మాయి కూర్చుంది. వీడికి ఏ, బీ, సి లు రావు కానే, వెంటనీ దాని భుజం మీద చెయ్యి వేసి, "నువ్వు యాడికేల్తే ఆదికోస్త అపర్ణ, నీ ఇంటిపేరు మారుస్తా అపర్ణ", అని పాడటం మొదలెట్టాడు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తాలూకు పిల్లాడు అని తెలిసి ఏమి చెయ్యాలో తెలియక టీచర్ బుర్ర బాదుకుంది.

% ఒక రోజు తెల్లవారుఝామున కాలేజీ నుండి ఇంటికి వచ్చిన అనుభవం గురించి నా స్నేహితురాలికి నాకు జరిగిన ఒక సరదా సంభాషణ.

నేను: ఈవేళ ఉదయం నాలుగున్నర గంటలకి ఒంటరిగా నడుచుకుంటూ వచ్చాను. మొత్తం కాలేజీలో పిట్టా,కాకీ లేదు. రోడ్ మీద ఎవడూ లేడు. ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. నాకు గుండె గుభేలుమంది.
ఆమె: ఎందుకు అంత భయం? దెయ్యలకా?
నేను: దెయ్యాలా, ఇంకేమైనానా? అమెరికా లో సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఎవడైనా దొంగవెధవ వెనకనుండి వచ్చి, "మగ బొమ్మాలి" అన్నాడు అంటే, నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తర అయిపోతుంది!

5 comments:

పవన్ said...

ha yes

కొత్త పాళీ said...

good beginning to the week :)

Sastry said...

Nice post!!!

Sri said...

అమెరికా లో కామెడీ లేకపోవటం కాదు..
హలో బ్రదర్ లో అన్నపూర్ణ "ఏంటో అమెరికా అల్లుడి జోకు అర్ధం అయితే కాని నవ్వలేం" అన్నాట్టు.
ఇది జోకు అని మనకి అర్థం అయి నవ్వేలోగా ఆ జోకు అయిపోతుంది.

మీ పోస్ట్ చాల బావుంది..

ముఖ్యం గా "అపర్ణ" ఎపిసోడ్ చాల బావుంది..
ఈమద్యకాలం లో పిల్లలకి ABCDల కంటే పాటలే తొందరగా వస్తున్నాయి..

మా బుడ్దోడికి ABCD చెప్తుంటే రావటం లేదు కాని
బంగారుకోడి పెట్ట అని అంటే వెంటనే పాపా పాపా అంటున్నాడు..

-శ్రీ

Deepa said...

Translation please...