Thursday, July 9, 2009

బాలాయణం - 3

బాలాయణం అంటే బాల్యంలో చేసిన సరదా పనులు, పలికిన మాటలు, చేష్టలు అని గతంలో ఒక టపలో నేను చెప్పాను. ఇప్పుడు దాన్నే అనుసరించి!

ఇందులో మొదటి ముఖ్యాంశం ఏమిటి అంటే పిల్లలకు డబ్బు విలువ ఎలాగ తెలుస్తుంది అని. చిన్నప్పుడు మనకు ఎంతో ఇష్టమైన ఒక వస్తువు వెల తెలుసుకుని అన్నిటినీ దానితో పోల్చుకుని విలువ తెలుసుకుంటాము. అలాంటి సరదా ఉదాహరణలు.

% మా ఫ్రెండ్ ఒకడు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాడు. అప్పట్లో మాబోటి మధ్యతరగతి వాళ్ళకి సైకిల్ నేర్చుకోవాలి అంటే సైకిల్ అద్దెకి (బాడిగకి) తీసుకోవాలి. అలాగ సైకిల్ తొక్కుకుంటూ ఉంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. రెండే రెండు చేక్రాల మీద handle ఒదులుగా  పట్టుకుని అలాగా పల్లంలో వెళ్తూ ఉంటే నాసామిరంగ! భలే ఉంటుంది. ఇంక, నా మిత్రుడు వాళ్ల ఇంట్లో ఏది కొన్నా "అమ్మో, ఐదు రూపాయలా - అంటే సైకిల్ పది గంటలు బాడుక్కి తోక్కుకోవచ్చ్చు", అంటూ ఉండేవాడు.

% ఇంకో మిత్రుడికి reynolds పెన్ పిచ్చి. ఇంట్లో "సినిమాకి వెళ్దాము రారా", అంటే, "వద్దు ఆ డబ్బులతో నాకు black ink reynolds pen కొనండి", అనేవాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యినట్టు వయసు ముదిరేకొద్దీ ఆ reynolds నెమ్మదిగా, pilot, prasad, fountain pen కూడా అయ్యింది.

ఇక పోతే చిన్నప్పుడు ఉండే అరకొర జ్ఞ్యానం చాలా విచిత్రమైన సందర్భాలకు దారితీస్తుంది. మనకు చిన్నప్పుడు తెలిసీతెలియని పదాలు వాడేస్తూ ఉండటం వలన జరిగే హాస్యం సరదాగా ఉంటుంది. అలాంటి ఉదాహరణలు:

% నా మిత్రుడు ఒకడికి english బాగా మాట్లాడాలి అని కోరిక. వాడికి మూడో తరగతిలో అలాద్దిన్ పాఠంలో father-in-law అనే పదం తెలిసింది. కరెక్ట్ గా వాళ్ల నాన్నగారి మిత్రులు అందరూ ఉన్నప్పుడు ఆయన్ని father-in-law అని పిలిచాడు. వాళ్ల నాన్న కాఫీ తాగుతున్నవాడు ఖంగు తిన్నాడు. "అదేమి కూతరా?", అని అడిగితే, "father అంటే చిన్నగా ఉంది నాన్న. father-in-law అంటే పెద్దగా వినడానికి బాగుంది నాన్న", అన్నాడు.

% నాకు తెలుగు బాగా వచ్చునని మా స్కూల్లో మంచి పేరు ఉండేది. మనకి తొంగుఎ చొంత్రొల్ లో ఉండదేమో, నాకు తెలియకుండానే చాలా హాస్యం పండించాను. నా రెండో తరగతిలో ఒక టీచర్ "ఏకసంతాగ్రాహి అంటే ఏమిటిరా?" అని అడిగారు. వెంటనే నేను, "ఒకళ్ళే సంతానం ఉంటే ఏకసంతాగ్రాహి అంటారు సర్", అన్నారు. సంతాగ్రాహికి సంతానానికి లంకె పెట్టగలిగిన నా తెలివికి ఆయనకీ మతిపోయింది.

% ఇంక ఆరులో అడుగు పెడుతూనే అరిపించేసాను. మా economics టీచర్ మాకు జీవితంలోనే మొదటిసారి economics పరిచయం చేస్తున్నాను అనే ఆనందంలో ఉన్నారే కాని ఆయనకీ భోజనం చేస్తే మనిషి కారు. కళ్లు ఎర్రగా అయ్యిపోయాయి. ఆయన ఆవులిస్తున్నారు. అది చూసి మిగతావాళ్లకు కూడా నిద్ర వచ్చింది. మొదటి వరుసలో కూర్చోవడం వలన నాకు కళ్లు తెరిచి నిద్రపోవడం అలవాటయ్యింది. ఉన్నట్టుండి క్లాసులో గోల ఎక్కువయ్యి ఆయనకు కోపం వచ్చి, అందరికీ economics ఔన్నత్యం గురించి ఒక పెద్ద క్లాసు పీకారు. బుద్ధిగా కనబడ్డ నన్ను ఉత్సాహపరచడానికి, "ఒరేఇ, అర్థశాస్త్రం అంటే ఏమిటిరా?", అన్నారు. వెంటనే నేను, "అర్థశాస్త్రం అంటే సగం వ్రాసి వదిలేసిన శాస్త్రం సర్", అన్నాను. ఆయనకు మత్తు అంతా వదిలేసింది.

1 comment:

flavors said...

eka santhaagrahi super :)