Friday, July 3, 2009

జీవితాలను ముడి వేసే ప్రేమ

ఏదో పరాకు గా ఉంటే, స్వచ్ఛమైన ప్రేమ యొక్క ఔన్నత్యం గురించి ఒక చిన్న తవిక వ్రాయాలి అనిపించింది. ప్రేమ అనే పదం మన తరంలో చాలా దుర్వినియోగానికి గురి అవుతోంది అని నా అభిప్రాయం. ప్రేమలో మోహం, అభిమానం, త్యాగం, బాధ్యత మొదలైనవన్నీ ఉండాలి. అయితే మన తరంలో మొహానికి, మోహానికి ఉన్నంత విలువ మిగతా వాటికి లేవు అనిపిస్తుంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే...

కలలు చూపే నేత్రమో, మేమెదురు చూసిన చైత్రమో
కదలకుండే కాలమో, మా కథను పలికే కావ్యమో
ఏమనుకోము ప్రేమ? నువ్వేవరనుకోము ప్రేమ?

కలువ కన్నులలోన వెన్నెల విరియజేసే చంద్రమా
చలువగాలులు మదిని నింపే పున్నమింటి సంద్రమా
మహిమ నీది, మరులు మావి
కలము నీది, కవిత మాది
ఇన్ని జంటల పంట పండగ వెంట నిలచిన దైవమా

మోడుగుండెల నాడి తెలిసి జోడు కలిపిన వేదమా
తోడునీడగ మెలగు ఎడదల మ్రోగుచుండే నాదమా
బలము నీది, కలలు మావి
తలపు నీది, గెలుపు మాది
కోటి పూవుల తోటి మా యెదతోట నింపు వసంతమా

4 comments:

శ్రీనివాసమౌళి said...

కవిత బాగుంది....
కలము నీది, కవిత మాది అనే లైన్ చాలా బాగుంది

Mauli said...

మన తరంలో మొహానికి, మోహానికి ఉన్నంత విలువ మిగతా వాటికి లేవు అనిపిస్తుంది.

bAgA cheppAru .......ippudu premalO kontha swachatha...kontha nirmAnAthmaka swardham (prescribed by Yandamoori) kalisi unnAyi....

KSR said...

baaga raasavu, Krishna. kalamu needi kavitha maadi sentence koncham confusing gaa vundi. kalamu means pen only right? Or any writing equipment. How is it that it belongs to love?

Lakshmi said...

ennallaki vachindhi vasantham

chesindhi lekhalenanni anubhuthulni na sontham

anukshanam edo theliyani anandam

nee blog lo ee topic chadivi inspire ayyi edo try chesanu..