% మా అన్నయ్య కొడుకుని జో కొట్టడానికి వల్ల ఇంట్లో "గుమ్మాడమ్మా గుమ్మాడి", అని పాడతారు. ఒక రోజు అందరూ భోజనానికి కూర్చున్నారు. నేను ఏకభుక్తం ఉన్నాను. అప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను వాడిని జో కొట్టాల్సోచ్చింది. వాడి అల్లారికి నాకు భలే కోపం వస్తుంది. ఎం చెయ్యాలో తెలియక, ఒల్లో పడుకోబెట్టుకుని, "కుమ్మండమ్మ కుమ్మండి", అని కొంచం బలంగా జోకోట్టడం మొదలెట్టాను. వాడికీ సరదా గా అనిపించి నవ్వుతూ "ఆ" అని రాగం తీయడం మొదలెట్టాడు. సరే కాసేపటికి నాకు నోరు నొప్పెట్టి కొంచం సింపుల్ గా ఉంటుంది అని, "కబడ్డీ కబడ్డీ", అని జోకోట్టడం మొదలెట్టాను. రెండు నిముషాల్లో పడుకున్నాడు. "శిశుర్వేత్తి, పశుర్వేత్తి", అని పెద్దలన్నట్టు ఉంది :)
% ఆఫీసు లో ఇంగ్లీష్ ప్రాస ఇంకా కొనసాగుతోంది. ఎప్పటిలాగా ఒకడు కొంచం దగ్గేదానికి బాగా ఓవర్ ఆక్షన్ చేస్తున్నాడు. అందరూ చేరి "he needs vicks", అన్నారు. అప్పుడు నేను, "he needs kicks", అన్నాను.
% ఎంత కష్టపడిన IntelliJ అనుకున్నట్టు పని చెయ్యట్లేదు. అప్పుడు నేను, "this is not IntelliJ. it is DumbJ", అన్నాను.
% ఏదో సందర్భంలో అందరు ఆడవాళ్ళూ చేరారు. వెంటనే వాళ్ళకు కోపం ఉన్నా ఒకావిడ జాతకం గురించి అడిగారు. అప్పుడు నేను అన్నాను, "ఆడవాళ్ళకి జాతకాలు అనవసరం. వాళ్ళు ఉన్న విషయాన్నీ తట్టుకోలేరు. దాచుకోలేరు. బెదిరిపోతారు", అన్నాను. వెంటనే ఒకావిడ లేచి, "నేను ఎవరితోనూ చెప్పను", అంది. వెంటనే నేను, "నేనూ ఎవరితోనూ చెప్పను", అన్నాను. "ఏయ్ నేనేమంటే అదే తిరిగి చెప్తావేంటి", అంది. "మనమందరం ఒకే మాట మీద నిలబడాలి", అన్నాను.
% ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే అంది, "ఏం చేస్తున్నావురా బెంగుళూరు లో. గాడిదల్ని కాస్తున్నవా?", అని. వెంటనే అన్నాను, "ఆ ఏముందిలే. నా గాడిదలన్నీ ఫ్లోరిడా, హైదరాబాద్, చెన్నై లాంటి ప్లేసెస్ లో సెటిల్ అయ్యాయి. సో, ఇప్పుడు గాడిదల్ని కాయడం మానేసాను", అన్నాను. (ఆమె ఉండేది చెన్నై).
% నిన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ, "మీరు ఇక్కడ భోజనం చేసెయ్యండి అత్తయ్యగారు", అంది మా వదిన. మా అమ్మ, "పొద్దున్న వండిన అన్నం ఉండిపోయిన్దమ్మ. waste అయ్యిపోతుంది", అంది. "పొద్దున్నే వండేసారా?" అంది. అప్పుడు నేను అందుకుని, "అవును. one-day-సరి వండేసారు", అన్నాను.
% మా కొలీగ్ మరొక కొలీగ్ ని అడిగింది, "you're committed. aren't you?", అని. వాడి కలాపాలు తెలిసిన మా టీం విస్తుపోయింది. నేను వెంటనే అందుకుని, "he's not committed. he's corrupted", అన్నాను.
% "నువ్వు చేసిన దోశలు నీచం గా ఉన్నాయే. కానీ, చట్నీ బాగుండటంతో తినెసాను", కామెంట్ విసిరాడు మా అన్నయ్య. వెంటనే నేను, "ఐతే నీచభంగం అయ్యిందన్నమాట", అన్నాను జ్యోతిష్యం భాషలో :) మీకు జ్యోతిష్యంతో పరిచయం ఉంటే ఆ జోక్ అర్థమవుతుంది.
No comments:
Post a Comment