ఈ కథలో అన్ని పాత్రలూ, సన్నివేశాలు కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కాదు. ఇది సమాజంలో ఏ ఒక్క సమూహాన్నీ కించపరచాలనే ప్రయత్నం కాదు. కేవలం, సహజమైన సంఘటనలలో నిత్యజీవితంలో జరిగే హాస్యాన్ని అందరికీ చెప్పాలనేది మాత్రమే నా ప్రయత్నం.
ఈ బ్లాగుపోష్టుకు వచ్చే ఆదరణలో చాలావరకు హాస్యం పట్ల నా అభిరుచికి కారణమైన హాస్యధ్రువతార జంధ్యాలగారికి, సాఫ్ట్వేర్ మాటతీరు పై మండిపడే నా మిత్రుడికి చెందాలి.
~~~~
రాంబాబు వెళ్తూనే వాళ్ళ college senior అయిన చందుని కలిశాడు. తన HR orientation అయ్యాక మళ్ళి కలుద్దామని అనుకున్నారు. రాంబాబు HR orientation పూర్తి చేసుకుని వచ్చాడు. చందు రాంబాబును చూస్తూనే "పద boss, ఒక coffee తాగుతూ మాట్లాడుకుందాము", అన్నాడు. ఇద్దరూ కలిసి cafeteriaకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ మధ్యన సంభాషణ:
రా: ఏంటి, ఇది మెస్సా?
చ: మెస్సు లాంటిదే, cafeteria అంటారు
రా: ఓహో, full meals ఎంత, plate meals ఎంత?
చ: (ఒక్క నిముషం ఖంగు తిని) ఒరేయ్ బాబు, ఇక్కడ meals freeరా, నువ్వెంతైనా తినొచ్చు.
రా: ఆహా, మరి parcel కూడా చేసుకోవచ్చా?
చ: లేదు. అది కుదరదు.
రా: ఓహో, కాఫీ order ఇచ్చావా?
చ: ఇక్కడ మనలాంటి వాళ్ళకు order చేసేవాళ్ళే కానీ, తీసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పద, coffee machine చూపిస్తాను.
(రాంబాబు, చందు ఇద్దరూ కాఫీ తెచ్చుకుంటారు)
రా: ప్చ్...ఏమైనా filter coffee రుచి లేదురా.
చ: అదీ దొరుకుతుంది. యాభై రూపాయలే.
రా: అబ్బే, నాకు filter coffee ఇష్టం ఉండదు. ఊరికెనే పోల్చి చెప్పాను అంతే.
చ: (వీడికి ఇంకా కుర్రదనం పోలేదు. collegeకి ఎక్కువ, corporate కి తక్కువ) ఓహో.
ఇంతలో HR అమ్మాయి ఒకామె వచ్చి రాంబాబుని, "How are you doing Rambabu? Do you know PCK already?" అంది. రాంబాబు ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఊరుకున్నాడు. చందు ఆమెతో, "Yes, he is from my alma mater.", అన్నాడు. దానికి ఆ అమ్మాయి, "Oh, that's fantastic. So, you are his buddy then. Do you mind taking him around the office until his manager is available to meet him?", అంది. దానికి చందు, "Oh - sure!", అన్నాడు. ఆమె నవ్వేసి, "See you around Rambabu. Have a great day!", అంది.
ఇది వింటూ పావలాకే పావుకిలో బంగారం దొరికినట్టు రాంబాబు ఒక తన్మయత్వం నిండిన expression పెట్టాడు. అది గమనించిన చందు, ఇలాగన్నాడు:
చ: హెల్లో బాసు. ఏమిటి సంగతి?
రా: అబ్బే,ఏమీ లేదు.
చ: ఏదో ఉండే ఉంటుంది, చెప్పులే!
రా: ఈ అమ్మాయి నాకు పడిపోయింది.
చ: (ఇది విని పొలమారగా తాగుతున్న coffeeని మళ్ళి cupలోకే ఒంపేసి) నీకా feeling ఎందుకు వచ్చింది బాబు?
రా: చందు, నీకు GK తక్కువ అనుకుంటాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూసు పదే పదే నవ్వుతూంటే, shake-hand ఇచ్చేస్తూ ఉంటే, "మళ్ళీ కలుద్దామని public గా" చెప్తూ ఉంటే దాని అర్థం ఏమిటి?
చ: ఆ అమ్మాయికి already పెళ్ళయ్యి ఉంటే, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉంటే, ఆమె అందరినీ అలాగే పలకరిస్తుంటే దానికర్థం ఏమిటి?
రా: ఆ?
చ: బాబు, ఇక్కడ అమ్మాయిలు దాదాపు అందరూ ఇలాగే ఉంటూ ఉంటారు. అలాగని వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తున్నారు అని అనుకోకు. దెబ్బైపోతావు.
రా: హా? హయ్యారే? ఏమి ఈ పరాభవము. దీని గొంతు పిసకాలి. అవును. ఇంతకీ, ఏదో పిసికే అంటోంది?
చ: పిసకడమా?
రా: అదే, "హలో పిసికే" అంది?
చ: ఓ, ఓహొ, ఓహోహో. పీ.సీ.కే, అవి నా initials, పి.చంద్రశేఖర కుమార్.
రా: అలాగా. అదేదో బడ్డీ అంది. అక్కడేమైనా మిరపకాయ బజ్జీలూ అవీ అమ్ముతారా?
చ: దేవుడా! బడ్డీ అంటే "స్నేహితుడు" అని అర్థం.
రా: బుడ్డీ అంటే స్నేహితురాలా?
చ: ఒరేయ్, నన్ను ఒదిలెయ్యరా బాబు. పద నీకు ఆఫీసు చూపిస్తాను.
రా: ప్లీస్ చెప్పరా! నువ్వు అదేదో "మటర్" అన్నావు. ఆలూ మటర్ లాగా అదేమైనా తినుబండారమా?
చ: వామ్మో, వాయ్యో. నీ vocabulary ని చింపెయ్య, నీ vocal chords ని తెంపెయ్య! "alma mater" అంటే "నేను చదివిన కాలేజీ", అని అర్థం.
రా: పదా! నిన్ను కాదు, ఆ వెంకటేశ్వర్రావుని తిట్టాలి.
చ: వాడెవడు?
రా: మా English lecturer. ఏంటొ మామూలుగా నేను చదివిన English లో ఇవన్నీ నేర్పలేదు.
ఇద్దరూ నడుచుకుంటూ ఒక గదిలోకి వెళ్ళారు.
చ: దీనినే recreation room అంటారు. ఇక్కడ carrom board, foosball లాంటి games ఆడుకోవచ్చు.
రా: బాగుంది. ఇంతకీ cricket ఆడరా?
చ: అప్పుడప్పుడు team అంతా కలిసి వెళ్ళి ఆడుకుంటాము. అది మా manager మూడ్ ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ grounds మన ఊళ్ళో లాగా free కాదు. ground book చెయ్యాలి కదా. దానికి బోళ్ళంత ఖర్చు అవుతుంది.
అలాగ నడుచుకుంటూ మళ్ళీ చందు desk దగ్గరకు వచ్చారు.
రా: ఏమిటి phone ఆ? ఇది ఇక్కడిక్కడే పని చేస్తుందా? లేకపోతే బయటకు కూడా చెయ్యచ్చా?
చ: ఎక్కడికైనా చెయ్యచ్చు. నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడల్లా దీనిలోనునుండే phone చెయ్యి. మనకెందుకు bill బొక్క?
రా: ఓకే.
చ: ఇది mini-cafe. ఇక్కడ బిస్కెట్లు, చాక్లెట్లు, cool drinks ఉంటాయి.
రా: ఇవి ఇక్కడే తినాలా? ఇంటికి కూడా పట్టికెళ్ళచ్చా?
చ: తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే ఇక్కడ కెమేరా ఉంటుంది. అది security వాళ్ళు చూస్తూ ఉంటారు. నిన్ను పట్టుకుని ఉద్యోగం, నీ పళ్ళు రెండూ ఊడపీకేస్తారు.
రా: ఓహో! ఇంకా నయం ముందే అడిగాను.
చ: అది నువ్వు అడగటమే అసలు అన్యాయం అనుకో. పద, ఈ meeting room లోనే మీ manager తో meeting. అయ్యాక కలుద్దాము.
Manager తో మీటింగు అయ్యాక మన రాంబాబు గుండెల్లో బాంబు పడినంత expression తో చందు దగ్గరకు వచ్చాడు. అది చూసిన చందు:
చ: ఏమిట్రో ఆ ఫేసు? మీ manager మొదటి రోజే disappoint చేశాడా?
రా: ఏమిటోరా, మా manager కి కొంచెం crack అనుకుంటాను.
చ: పిచ్చివాడా. అది manager అవ్వడానికి requirement రా! తెల్లకాకులు, vegetarian పులులు, నిజాయితీ ఉన్న రాజకీయనాయకులు, సరిగ్గా ఆలోచించే managerలు ఉండరు.
రా: ఏమోరా. ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగాడు. నాకు ఏదో tension గా ఉంది.
చ: ఈ tension తగ్గాలి అంటే ఒక coffee తాగుతూ మాట్లాడుకుందాము.
ఇద్దరూ వెళ్ళీ coffeeలు పుచ్చుకుని cafeteriaలో కూర్చున్నారు. అప్పుడు సంభాషణ:
చ: ఇప్పుడు చెప్పు. అసలు ఏమైంది?
రా: వస్తూనే, "Hi Rambabu. I am Ramesh Krishnan. I am your manager here.", అన్నాడు. shake-hand ఇచ్చాడు. ఇక్కడదాక బానే ఉంది.
చ: అప్పుడు
రా: "How is it going?", అన్నాడు. ఆ 'it' ఏమిటో అర్థం కాలేదు.
చ: (కంగారు పడుతూ) ఆహా? మరి నువ్వేం చెప్పావు?
రా: చాలాసేపు ఆలోచించి, నా తెలివి ఉపయోగించి, "It went down a few months ago. Slowly, it is coming up", అన్నాను.
చ: బాబు, ఒరేయ్, ఏమిటి నువ్వు చెప్పిన "it"?
రా: చూశావా? ఒక సంవత్సరం experience ఉన్న నీకే అర్థం కానిది మొదట్రోజే నన్ను అడిగాడు. "It" అంటే "Information Technology".
చ: (విని దిమ్మదిరిగి mind block అయిపోయింది). అమ్మబాబోయ్. అప్పుడు ఏమన్నాడు?
రా: బాగా నవ్వి, "You are funny", అన్నాడు. ఆ తరువాత, "Do you care for a coffee?", అన్నాడు.
చ: దానికి నువ్వేమన్నావు?
రా: నాకు అర్థం కాలేదు. "Caring for animals", "Caring for environment", "Caring for orphans", ఇవన్నీ విన్నాను కానీ, "Caring for coffee", అని నేనెప్పుడూ వినలేదు.
చ: ఆహా నా రాజా! అప్పుడు ఏమైంది?
రా: coffee ఎంత పోతే ఎవడికి కావాలిరా? అందుకే, "No" అనేశాను.
చ: హమ్మయ్య! అప్పుడేమైంది?
రా: ఆయన "I do. Let's go to cafeteria and talk", అన్నాడు. వెంటనే వెళ్ళి coffee పుచ్చుకున్నాడు. నేను ఏమైన తక్కువ తిన్నానా? నేను కూడా తీసుకున్నాను.
చ: ఓహో! అప్పుడాయనేమన్నాడు?
రా: "Oh - you felt like taking one?", అన్నాడు. ఎందుకు అన్నడొ అర్థం కాలేదు. నేను light తీసుకున్నాను. అప్పుడు, "What languages do you know?", అన్నాడు. నేను వెంటనే, "My mothertongue is Telugu. I speak Telangana type, kOstaa type and rayalseema type Telugu also. I know thodasa hindi and english. I learned some words like "vanakkam", "mudiyaadu", "paapom" in Tamil", అన్నాను.
చ: రామచంద్ర!
రా: ఆయనెవడు?
చ: ఎవరోలే. ఇంతకీ ఆయనేమన్నాడు?
రా: మళ్ళీ, "You are funny", అన్నాడు. ఈందులో జోకేమిటో నాకు అర్థం కాలేదు. అప్పుడు, "Do you know C?", అన్నాడు. నేను, "I know C. In fact, A to Z", అన్నాను.
చ: ఓహో, మనకు చమత్కారం కూడా ఉందే!
రా: మరేమనుకున్నావు. వెంటనే ఆయనకు కళ్ళూ తిరిగి అర్జునుడు భగవద్గీత వింటున్నప్పుడు కృష్ణుడిని పొగిడినట్లు పొగిడాడు నన్ను.
చ: ఏమనో?
రా: "Great", అన్నాడు.
చ: ఇంకా?
రా: అంతే! మ్యానేజర్ చేత మొదటిరోజే "Great" అనిపించుకున్నాను అంటే నాకు వచ్చే నెల promotion కూడా వచ్చేస్తుందేమో!
చ: వస్తుంది. నీ emotion చూస్తుంటే నాకు motions వస్తున్నాయి ముందు.
రా: చాల్లే వెటకారం. నీ juniorని అప్పుడే companyలో పేరు తెచ్చేసుకుంటున్నాను అని కోపమా?
చ: అదే అనుకో! ఆ తరువాత ఏమైంది?
రా: అప్పుడు, "Did you search for a place to stay?", అన్నాడు. నేను, "I started searching", అన్నాను. దానికి, "How is it coming along?", అన్నాడు. అదేదో, అతిమూత్రవ్యాధిగ్రస్తుణ్ణి doctor అడిగినట్లు, "అదెలా వస్తోంది?", అని అడగటమేమిటో నాకు అర్థం కాలేదు. సరే, బెంగుళూరు నాకు కొత్త కదా, నీళ్ళు పడ్డాయో లేదో అని అడిగాడేమో అని, "It's coming normally", అన్నాను.
చ: (వాంతి చేసుకున్నంత పని చేసి). దేవుడోయ్, నువ్వు too much రా! ఆ manager ఏమయ్యాడొ పాపం.
రా: అప్పుడు నేను, "Where should I search?", అన్నాను. దానికి ఆయన, నాకు పెళ్ళైందా? పిల్లలున్నారా? తల్లిదండ్రులు ఎక్కడున్నారు? లాంటి ప్రశ్నలన్నీ అడిగి "Given these conditions, I would search in domalur", అన్నాడు. ఆ దోమలూర్ ఏమిటో నాకు అర్థం కాలేదు. ఐనా, నేను అడక్కుండానే నాకు ఇల్లు వెతుకుతాననడం ఒక్కటీ నాకు నచ్చింది.
చ: ఎవరన్నారు?
రా: ఇంకెవరు? మా manager.
చ: ఎప్పుడూ?
రా: అదేరా, "Given this condition, I would search in domalur", అన్నారు కదా?
చ: మహప్రభో, ఆయన వెతుకుతాను అనలేదు. దోమలూర్లో నువ్వు వెతికితే బాగుంటుంది అన్నారు.
రా: అదేమిటి? ఆ వాక్యానికి Wren and Martin grammar book ఎలాగ తిరగేసినా దాని అర్థం, "నేను వెతుకుతాను" అనే!
చ: (వివరించే ప్రయత్నాన్ని విరమించుకుని). సరేలే బాబు. ఆయనకు మనకు నచ్చేవి నచ్చవు, మనమే వెతికేసుకుందాము. ఆయన వెతికేలోపల.
రా: అరే, మరి ఆయనకు తెలిస్తే feel అవుతాడేమో?
చ: నేను సర్దిచెప్పుకుంటాను మహానుభావా!
రా: సరే, మేము మాట్లాడుతుంటే మధ్యలో ఒక బుడంకాయ్ గాడూ plate లో బజ్జీలు వేసుకుని వచ్చాడు. వెంటనే మ్యానేజర్ వాడితో ఏదో మాట్లాడుతున్నాడు. నాకస్సలు అర్థం కాలేదు.
చ: ఏమని?
రా: మా మ్యానేజర్ ఏదో చెప్పి, "Could you do it in this month?", అన్నాడు. వెంటనే వాడు, "My plate is already full", అన్నాడు. కానీ వాడి plate లో ఇంకా బోళ్ళు ఖాళీ ఉంది. మా manager చూసుకోవట్లేదు. మొహమాటపడుతున్నాడేమో పెద్దాయన ముందు, అని నేను, "No. Still two more bajjis will fit into this", అన్నాను.
చ: అయ్యయ్యో పరమేశ్వరా! వాళ్ళేమన్నారు దానికి?
రా: ఏమిటో పడి పడి నవ్వారు. మళ్ళీ అదే డయలాగు: "You are funny", అని. అప్పుడు మా manager నాకేసి చూసి, "What platforms are you used to?", అన్నాడు. ఉన్నట్టుండి వీడికి ఈ platform గోలేంటో అర్థం కాలేదు. EAMCET లో లాగా ప్రశ్న అర్థం కాకపోతే ఏదో ఒకటి చెప్దామని, "Number 2" అన్నాను. దానికి ఆయన నవ్వి, "Come on man, I am serious. Are you comfortable with C?", అన్నాడు. సరే ఇదేదో ఆ consultant చెప్పిన C కోడింగ్ కి సంబంధించిన విషయం అని "yeah yeah", అన్నాను.
చ: ఓహో! అప్పుడు?
రా: మళ్ళీ ఏదో వింత ప్రశ్న వేశాడు. "Do you have bandwidth to do what I just said?", అన్నాడు. ఉన్నట్టుండి మళ్ళీ bandwidth మీదకు ఎందుకు పోయాడో! ఈవేళ అమావాస్యాయే. వీడికి అమావాస్యకి ఏమైనా పూనుతుందేమో! అనుకుంటూనే ఉన్నాను అమావాస్యపూటా చేరడం దేనికి అని. ఆ HR గుంట, "Hope to see you soon", అని పదే పదే అంటే, "చంద్రబింబం లాంటి అమ్మాయి పిలుస్తుంటే ఇంకా అమావాస్యేమిటి", అనుకుని వచ్చేశాను. ఛీ నా తప్పే.
చ: బాబూ! నీ ముహుర్తాల గోల ఆపు. ఇంతకీ ఏం చెప్పావు?
రా: ఏముంది, "I have big bandwidth. I download new new movies, songs and softwares", అన్నాను. దానికి ఆయన నవ్వి, "You can't live without joking. Can you? Anyway, we will catch up tomorrow", అనేసి వెళ్ళిపోయాడు.
చ: new new movies ఆ? దేవుడా!
రా: అదే కొత్త కొత్త సినిమాలు.
చ: ఒరేయ్ బాబు! నాకూ ఇంక ఓపిక లేదు. ఇంటికి పోతున్నాను.
రా: అవును. నేను కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలి. catchలు పట్టడం practice చెయ్యాలి.
చ: అది దేనికి?
రా: మా మేనజర్ "Let us catch up tomorrow" అన్నాడుగా.
ఈ మాట విని ఏమనాలో తెలియక ఒకసారి నిట్టూర్చి చందూ వెళ్ళిపోయాడు. ఏమిటో అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారు, ఇదంతా అమావాస్యప్రభావమే అని బాధపడుతూ రాంబాబు కూడా రెండు biscuit packetలు, రెండు coffeeలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఈ కథ అయిపోయింది అనుకోకండి. ఇంకా రెండో అంకం ఉంది :)
ఈ బ్లాగుపోష్టుకు వచ్చే ఆదరణలో చాలావరకు హాస్యం పట్ల నా అభిరుచికి కారణమైన హాస్యధ్రువతార జంధ్యాలగారికి, సాఫ్ట్వేర్ మాటతీరు పై మండిపడే నా మిత్రుడికి చెందాలి.
~~~~
రాంబాబు ఈ మధ్యనే ఒక కాలేజీ నుండి తన B.Tech (Mechanical Engineering లో అండోయ్!) పూర్తి చేసుకుని ఒక consultancy ద్వారా బెంగుళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అప్పటిదాకా ఏదో సాదాసీదాగా, మామూల మనిషిలాగా గడిపేసిన రాంబాబు ఈ సఫ్ట్వేర్ కంపెనీలో ఎలాటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అన్నదే ఈవేళ్టి నా కథాంశం.