Monday, June 1, 2009

ఏదో జానపదంలో

సెయ్యిజాచిన నాడు సెయ్యి దాచేసి, సిన్నబుచ్చావు గదే సిత్రాలకూన
ఎయ్యి మాటలదోటి గుండె యియ్య బోతే, కురిపించావు గదే వడగళ్ళవాన

నీరు పారిన నాడు నింగికై ఆశ, నేలనే వదిలేయ జూసినావె మొలాకా
ఏరు దాటీ నాక తెడ్డట్టుకొచ్చి, నావ నడపామంటె అర్థమేందే సిలకా

రాయికే తెలివోచ్చే రాములోరి నీడ, రేయికై వదిలావే రెమ్మ చాటు పూవా
కన్ను తెరిచి జూడా కనికట్టు యిడిసే, కన్నయన్నీ కలలే కానరాదే దోవా

సిందులేసిన నాడు సిత్రాల ఈడు, సింతసేట్టున పూసే సిగురంటిదమ్మ
అందరికి ఆధారం అమ్మోరి అవతారం, అందులోనీ తేనె అందుకోనవే కొమ్మా

1 comment:

Phanindra said...

bhalE manchigaa undiraa biDDaa! jaanapadamlOni jiivadhanam kaDu pasandugaa ruchi chuupinchaav.

"raayiki telivocchina raamulOri niiDa" - enta baagundO ii expression!!

Keep writing. inta chakkani nii blog ki asalu evaruu comments ye raayakapOvaDam anyaayam. jana hitam kOsam nii blog ni popular chEsukOvalasina dharmam niikundi.