అసలు ఈ మధ్యన బ్లాగులో రాయడం మానేశాను. ఎప్పుడో పండగకో పబ్బానికో రాస్తున్నాను. అలాంటిది ఉన్నట్టుండి ఒక పోస్టు రాయాలని అనిపించింది. సాధారణంగా అభిమానంతో రాసే నేను ఈ రోజు చిరాకు, విరక్తితో రాస్తున్నాను. ఎంతోమంది బాగుందని చెప్పారని ఈ రోజు Netflix కి signup చేసి మరీ "అల వైకుంఠపురములో" అనే ఒక సినిమా చూస్తే కలిగిన భావాలవి.
ఈ మధ్యన నేను తెలుగు సినిమాలు చూడటమే తగ్గింది. చూస్తే పాత సినిమాలు, లేకపోతే indie సినిమాలు చూస్తున్నాను. మంచి సినిమాలు వస్తున్నాయి. ఉదాహరణలు వెతికితే వెంటనే పెళ్ళి చూపులు, బ్రోచేవారెవరురా, మత్తు వదలరా గుర్తొస్తున్నాయి. ఇలాంటి సినిమాలు బాగానే ఆడుతున్నాయి కూడా. ఐనా కూడా కొంతమంది దర్శకులు నవ్యత లేని సినిమాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
ఇక సినిమా గురించి మాట్లాడుకుందాం. నాకు అన్నిటికంటే ముందు చిరాకు వచ్చిన విషయం - బావామరదళ్ళ ప్రణయం. దక్షిణభారతదేశంలో ఇది ఒకప్పుడు మామూలై ఉండవచ్చును. కానీ ఇప్పుడు మనం కూడా సైన్సు చదువుకుంటున్నాము కదా. First cousins పెళ్ళి చేసుకుంటే వారికి పుట్టే పిల్లలకు అనారోగ్యం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 1980 లోనే మా నాన్న గారిని ఎంతో మంది మరదలినో, మేనగోడలినో పెళ్ళి చేసుకోమంటే పిల్లలు బాగుండాలని వద్దు అన్నారు. ఇది 2020. మనకీ అంతో ఇంతో లోకజ్ఞానం వచ్చింది కదా. ఇకనైనా మనం first cousins పెళ్ళిళ్ళని ఆపమని సందేశం ఇవ్వచ్చునా? పోనీ, సినిమాల్లో సందేశాలెందుకు అంటారా, కనీసం అది glorify చెయ్యకుండా ఉండవచ్చునా? ఈ సినిమాలో రాజ్, తన మరదలైన నందినిని ఇష్టపడతాడు. వేరే దేశాల వరకు ఎందుకు? మన దేశంలోనే ఉత్తరాదిలో దీన్ని అసహ్యంగా భావిస్తారు. బావామరదళ్ళు కూడా అన్నాచెల్లెళ్ళ లాంటివారే అని వారి అభిప్రాయం. ఈ విషయంలో త్రివిక్రం repeat offender. ఇంతకు ముందు తీసిన "అత్తారింటికి దారేది" లో కూడా ఇదే చేసాడు.
రెండవ విషయం ఆడవాళ్ళ పట్ల రచయిత చులకన భావం. ఈ సినిమాలో పదే పదే హీరొయిన్ కాళ్ళను చూపించడం చిరాకు అనిపించింది. పాట మొదట రాసి తరువాత సినిమా తీసారో, సినిమా రాసిన తరువాత పాట రాసారో తెలియదు. కానీ, చివరికి అశ్లీలంగా అనిపించింది. ఎవరైనా అలాగ office లో ఎవరితోనైనా వ్యవహరిస్తే ఉద్యోగం పీకేస్తారు. ఇక్కడ మన "హీరో" ఏకంగా CEOని అలాగ చూసి వ్యాఖ్యానం చేసినా ఆవిడ ఏమీ అనుకోదు. ఇంతకు ముందు అతారింటికి దారేది సినిమాలో కూడా శమాంతా మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు "హీరో" ఆమెకు ఏదో కథ చెప్పి, మీద చేతులు వేసి హడావుడి చెయ్యడం కూడా నాకు లైంగిక వేధింపు నేరంలాగా అనిపించింది. నవ్వు రాలేదు.
మూడో విషయం అర్థం పర్థం లేని పాత్రలు. అసలు సునీల్ పాత్ర ఎందుకు ఉంది, ఏం చేస్తోంది? రాజేంద్ర ప్రసాద్ సినిమాలో ఎందుకు ఉన్నాడు? ఎంతో నైపుణ్యం ఉన్న నటులను పెద్ద పాత్రలలో పెట్టకుండా, ఈ చిల్లర పాత్రలలో ఎందుకు పెట్టినట్టు? ఎవరైనా HR లో పని చేసేవాళ్ళు పొద్దున్నే బైకుల మీద తిరుగుతూ అమ్మాయిల చున్నీలు లాగుతారా? అలాంటి వెధవని ఒక CEO ఐన అమ్మాయి HR లో ఉంచుతుందా? బ్రహ్మాజీ వెనకనుండే రౌడీలు తెల్లవాళ్ళెలాగ అయ్యారు? రష్యా నుంచి వచ్చి రౌడీలుగా హైదరాబాద్లో స్థిరబడ్డారా? బ్రోచేవారెవరురా చిత్రంలో నిండుగా బట్టలు కప్పుకుని, స్వతంత్రనిర్ణ్యయాలు తీసుకోగల ఒక మంచి పాత్ర చేసిన నటి (నివేద) ఈ సినిమాలో సగం సగం బట్టలు వేసుకుని ఎవరో వచ్చి "నువ్వు పెద్ద అందగత్తెవు కాదు కానీ sexy గా ఉన్నావు" అంటే ఎందుకు మురిసిపోయింది. పెద్ద కంపెనీ పెట్టి CEO అయినావిడ ముక్కూ మొహం తెలియని వాడితో పెళ్ళికి ఎలాగ ఒప్పుకుందీ? ఆ పెళ్ళి ఆపెయ్యకుండా వేరేవాడిని తల్లిదండ్రుల ఎదురుగుండా ఎందుకు కావలించుకుంటోంది? ఇది మోసం కాదా? ఇవా ఆడవాళ్ళ పాత్రలు రాసే విధానం. రాజ్ నందినిని ఇష్టపడితే board meeting సీన్ లో అమూల్యని చూసి ఎందుకు ఊగుతున్నాడు? వాడు కొంచం నెమ్మెదస్తుడు అని చెప్పారు కానీ, వాడికి ఎవరు ఇష్టమో కూడా తేల్చుకోలేని శుంఠా?
నాలుగో విషయం అర్థం పర్థం లేని కథనం. (1) ఒక పెద్ద ఆఫీసులో ఒకటే lift ఉందా? దాన్ని ఆపడం ఎలాగో పల్లెటూరులో ఉండే ఒక తాతగారికి తెలిసిందా? Freight elevator ఏమైంది? ఆ టైంలో రామచంద్రకికి అప్పలనాయుడుకి meeting ఉంది అని schedule లో ఉంటుంది, నాయుడు లోపలకు రావడం వెళ్ళడం పదిమందీ చూసి ఉంటారు. అయినా కేసు ఎందుకు పెట్టలేదు? (2) పాతికేళ్ళు కోమాలో ఉన్న ఆమె ఉన్నట్టుండి లేవడం, సరాసరి రామచంద్ర కొడుకుని కలవడం, వాల్మీకి చూసి గుర్తుపట్టడం, పూస గుచ్చినట్టు కథ చెప్పటం, అది వీళ్ళ తాత కూడా వినడం - ఇదంతా చిత్తు కాగితాల మీద రాసుకునే కథనం లాగా ఉంది. కోమా లోంచి వచ్చినావిడ "మా అమ్మ ఏది? నాన్న ఏడి? మొగుడేడి? పిల్లలేరీ?" - ఇవేమీ అడగలేదు? corridor లో ఉన్న ఆమె బంటుతో మాట్లాడుతుంటే curtain ఎక్కడ నుంచి వచ్చింది? (3) ఎంత సరదాగా ఉన్నా board meeting లో పాటలు పెట్టి dance చేసేవాడెవడైనా ఉంటాడా? అలాగ చేస్తే share value ఏమౌతుంది? అసలు ఆ సీనే నాకు అర్థం కాలేదు. (4) ఏ తల్లి ఐనా తన కొడుకు ఎదురుగుండా ఇంకోడితో "You are better than my son" అంటుందా? కన్నకొడుకుని బయటకు గెంటి వాడికి సగం ఆస్తి రాసి ఇస్తుందా? వాడు helicopter ఎక్కుతుంటే కుటుంబమంతా వచ్చి చప్పట్లు కొడుతుందా? (5) ఉన్నట్టుండి ఆ రాజ్ వెళ్ళి వాల్మీకి ఇంట్లో ఉండటం ఏమిటో, ఆ ఇంటి ఇల్లాలి ఎదురుగుండా "మందు కొడతాను" అనడం ఏమిటో, ఎవరో బేవార్స్ గాళ్ళను ఇంటికి పిలవడం ఏమిటో? పెళ్ళి కావలసిన కూతురున్న ఏ తల్లైనా ఇవన్నీ ఒప్పుకుంటుందా? ఏంటి ఈ పిచ్చి. (6) "హీరో" ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. ఎక్కడో వాడు వెళ్ళి వందమంది గూండాలను కొడుతూ ఉంటే, ఇక్కడ రామచంద్ర, యశోదా మేనగోడలి కోసం సంతకాలు పెడతారు అని, రాజ్ మొత్తానికి కోపం తెచ్చుకుంటాడు అని ఎలాగ ఊహించాడో మహానుభావుడు. ఇంటిల్లిపాది చూస్తుండగా రామచంద్ర ఎవరో ఒక అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకున్నాడు అని చెప్పడం ఏమి ఔచిత్యమో నాకు అర్థం కాలేదు.
ఐదో విషయం అర్థం పర్థం లేని ఫైట్లు. 2020 లో ఇంకా తెలుగు హీరోలు భౌతికశాస్త్రాన్ని వెక్కిరిస్తూ ఫైట్లు చేస్తున్నారు. కొన్ని కొన్ని సీన్లు చూస్తే ఇది కార్టూనా అనిపించింది. మనిషి భూమి మీద పడి స్ప్రింగులు ఉన్నట్టు ఎలాగ లేస్తాడు? దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 1980లలో ఫైట్లు మరీ రివాజుగా ఉన్నాయి అని సినిమాల్లో దర్శకులు ఏదో ఒక gimmick పెడుతూ ఉండేవారు. football నేల మీద పడకుండా రౌడీలని కొట్టడం, ఆయుధం వాడకుండా కొట్టడం (స్టేట్ రౌడీ) చూసను. 2020 లో చున్నీ తడిపారెయ్యడం ఒక ఫైటుగా చూస్తాను అని ఊహించలేదు.
నేనూ ఒక రచయితనే. నా శక్తి కొలది మంచివో, చెడ్డవోపద్యాలూ, పాటలూ, కథలూ రాస్తాను. వాటిని ఎవరైనా విమర్శిస్తే బాధ కలుగుతుంది. అందుకని వీలైనంతవరకు వ్యక్తులను కాక వారి పనులను మాత్రమే ప్రయోజనాత్మకంగా విమర్శించే ప్రయత్నం చేస్తాను. కానీ, ఒక్కో సారి మనసు గడి తప్పి ఇలాగ రాయాలనిపిస్తుంది. ఈ సినిమా రచయిత, దర్శకుడు ఐన త్రివిక్రం ని మాటలమాంత్రికుడని ఎందుకు అంటారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. పేరు, బలగం, ప్రజాభిమానం ఉన్న నటులు కూడా మంచి పాత్రలు చెయ్యగలరు అని ఎప్పటినుంచో ఋజువులు ఉన్నాయి. ఇలాంటి అత్తెసరు కథలు, కథనాలు ఎందుకు ఇష్టపడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రపంచమంతా ముందుముందుకీ పోతుంటే, మన తెలుగు సినిమా అగ్రవర్గం మాత్రం వెనక్కి వెళ్తోంది. వాళ్ళకే గురూజీ అనీ, intelligent directors అనీ, మాటల మాంత్రీకులని బిరుదులు ఇచ్చుకుంటున్నాము అంటే నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు.
ఈ సినిమా మొత్తానికి పాటలు; జయరాం, మురళీ శర్మల నటన నచ్చాయి. ఈ సినిమా తీసినవారికి, బాగుందని నాతో అన్నవారికి శతకోటి నమస్కారాలు.