మొదటి భాగం ఇక్కడ చూడవచ్చును.
చం: ఒక్కోసారి ఇదంతా చూస్తుంటే వెనకతరం మగవాళ్ళు చేసిన పాపాలు శాపాలై మనకు తగులుతున్నాయి అనిపిస్తూ ఉంటుందిరా. ఆడవాళ్ళని కట్నం అని, లాంఛనం అని వేధించారు.
రాం: బాబు, ఏ కథకైన రెండు వైపులూ ఉంటాయి. తెలివైన ఆడవాళ్ళు మగవాళ్ళనీ ఏడిపించారు. మా ఊళ్ళో కొంతమంది మగవాళ్ళైతే వాళ్ళ జీవితమంతా "నేనంటే మా ఆవిడకి దడ" అనే అమాయకత్వంలో ఉంటూనే వాళ్ళ పెళ్ళాళ్ళకు ఊడిగం చేసారు. ఆ కథలు మఱొక రోజు చెప్పుకుందాము.
వెం: రాంబాబూ, నీకు మీ school లో ఏ వచనం ఎప్పుడు వాడాలో చెప్పారన్నావు?
చం: సరే లేరా -- గొడవాపి ఇంకేమైన కొత్త కథలు చెప్పు.
వెం: matrimony profiles లో రకరకాలు ఉంటాయి. వాటిని ఉదాహరణలతో విశ్లేషించి చెప్తాను విను.
(రాంబాబు, చందు ఊఁ కొడుతున్నారు).
వెం: ఒక profile మా అన్నయ్యకి, పెద్దమ్మకి, పెదనాన్నకి తెగ నచ్చింది. వెంటనే జాతకాలు అవీ చూపించుకుంటే బాగా కలిసాయి అన్నారు. సరే అని phone చేస్తే అమ్మాయి తల్లి ఎత్తింది. అన్నివిధాలుగా photo నచ్చింది కదా అని మా పెదనాన్న ఏదో ఒక లాగా సంబంధం కలిపేద్దామనుకున్నాడు.
(టోఁ, టోఁ, టోఁ...flash back పె: పెదనాన్న, వ్య: phone ఎత్తిన వ్యక్తి.)
పె: నమస్తే, నా పేరు సత్యనారాయణ.
వ్య: నమస్తే అండి. ఎవరు కావాలి?
పె: మీ ఇంట్లో దుర్గ అనే అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు అని విన్నాను. దాని గురించి మాట్లాడదామని.
వ్య: ఆ...అది
పె: మా అబ్బాయి B.Tech చదువుకుని పెద్ద software company లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు.
వ్య: అది కాదం...
పె: జాతకాలు ముప్పయ్యారు కి ముప్పై మూడు pointలు కలిసాయి అని మా సిద్ధాంతి గారు చెప్పారు.
వ్య: అవుననుకోండీ...
పె: మాకు పది ఎకరాల మాగాణి ఉంది. నాకు మా ఆవిడకి ఈ ఊరు వదిలి వెళ్ళే ఉద్దేశం లేదు. కాబట్టి అమ్మాయి, అబ్బాయి చిలకగోరింకలలాగ foreign లో ఉండచ్చును. మేము అస్సలు వాళ్ళని ఇబ్బంది పెట్టము. మాకు ఆడపిల్లలు లేరు.
వ్య: బాగుంది...కానీ...
పె: మీరు ఊఁ అంటే అబ్బాయి photo, జాతకం మీకు 2-day courier లో పంపిస్తాము. దగ్గరలో ముహుర్తాలు లేవు...మొన్న మార్చి 29 న ఆఖరి ముహుర్తం. మళ్ళీ మూఢం మొదలైపోతోంది...
(అటుపక్కన నుండి ఏమి మాట రాకపోతే...)
పె: హలో, హలో...అమ్మా ఉన్నారా?
వ్య: మీ మనసులో భావాలన్నీ చెప్పేసారా అండి? ఇంకా చెప్పల్సింది ఏమైనా ఉందా?
పె: అంతేనమ్మా...మీరేమంటారు?
వ్య: మొన్న మార్చి 29 న తెల్లవార్ఝామున రెండు గంటల ఇరవై ఎనిమిది నిముషాలకు మా అమ్మాయి రమ్య పెళ్ళి ఐపోయింది అండి. పొఱబాటున profile తీయడం మరిచిపోయాము. ఇక్కడ current పోయింది. రాగానే తీసేస్తాము.
(టోఁటోఁటోఁ....flash front)
రాం: నీ గూడు చెదిరింది...నీ గుండె పగిలింది...ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు...?
వెం: matrimony profiles లో అతి ప్రమాదకరమైనవి ఇవే.
చం: వీటిని ఎలాగ గుర్తించాలో చెప్తావా?
రాం: పెళ్ళైపోయిన profiles ఎలాగుంటాయి? వాటిని ఎలాగ గుర్తించాలి? వాళ్ళు ఎలాగ మాట్లాడతారు? ఎలాగ నడుచుకుంటారో తెలుసుకోవాలనుంది.
వెం: శ్రద్ధగా విను. పెళ్ళైపోయిన profile కి last login date కనీసం ఒక నెల ముందు ఉంటుంది. వాళ్ళ chat now button మూగబోయి ఉంటుంది. మనం message పంపించినా ప్రత్యుత్తరం రాదు. అలాంటి profile తగిలితే వెంటనే విడిచిపెట్టెయ్యి.
చం: ఆపండిరా బాబు. సరే ఇంకో రకం చెప్పు.
వెం: later
చం: ఏం? ఇప్పుడు వర్జ్యమా? రాహుకాలమా? దుర్ముహూర్తమా? యమగండమా?
వెం: కాదు, later.
చం: చెప్పెహే
వెం: నేను చెప్తున్నది ఒక రకం profiles గురించి. వాటికి పేరు later అని ఉంటుంది.
రాం: ఆ మధ్యన గెడ్డం చక్రవర్తి తీసిన cinema లాగా ఈ అమ్మాయికి కూడా పేరు పెట్టలేదా? పెళ్ళయ్యాక మొగుడు పెట్టాలా ఏంటి?
వెం: కాదు. ఈ రకం profiles ఉన్న అమ్మాయికి లేక వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు matrimony లో ఉన్నట్టు తెలియడం ఇష్టం ఉండదు. పేరు బట్టి ఎవరైన వెతికి వాళ్ళను పట్టుకుంటారు అని భయం.
చం: చాలా మంచిదే కదరా? ఈ కాలంలో అమ్మాయి photo కనబడితే చాలు దాన్ని పట్టుకుని ఎన్ని వెధవ పనులు చేస్తున్నారు జనాలు?
వెం: హ హ హ
చం: ఆ నవ్వు ఎందుకు?
వెం: ఎంత పొఱబాటు. ఒక profile చూసి ఇలాగే అనుకుని మా అన్నయ్య shame to shame పొఱబాటు చేసాడు. పెదనాన్నకి చెప్తే ఆయన అమ్మాయి తండ్రికి phone చేసి అన్నయ్య వివరాలు ఇచ్చాడు. ఆ అమ్మాయి వివరాలు మా అన్నయ్యకు తెలిసిన తఱువాత facebook లో కొడితే ఆ అమ్మాయి photoలు తెగ పెట్టేసింది. birthday కి ముఖమంతా cake పూసుకున్న photo దగ్గరనుండి బిర్లామందిర్ ఎదురుగుండా భిక్షగాడికి బిళ్ళ వేస్తున్నప్పటి photo వరకు అన్నీ photoలు ఉన్నాయి. తన facebook profile ఏమో సార్వజనిక చిత్రశాల లా పెట్టుకుని, matrimony profile లో తన పేరు కూడా పెట్టకుండా ఉంది చూసావా? అది ఆ అమ్మాయికున్న తెలివితేటలు.
రాం: అమ్మాయి కొంచెం social అనుకుంటాను.
వెం: social కాదు, వేషాలు.
రాం: ఈ కథలు వింటుంటే నాకు ఒళ్ళు గగురుపొడుస్తోంది. నువ్వు ఇంకా చెప్పు.
వెం: ఒక్కోసారి ఈ later profiles వలన land mines పేలతాయి. ఉదాహరణకు ఒక సారి మా అన్నాయ్య ఒక profile చూసి interest ఉంది అని message పంపించాడు. మర్నాడు response చూస్తే అది పిసినారి మాష్టారు మొదటి కూతురు. అబ్బో...మా ఊళ్ళో చాలా కథలు నడిపిందిలే. Big boss cinema చూసిన తఱువాత మా అన్నయ్య మళ్ళీ అంత shock కి గురైంది ఈ విషయం తెలిసాకనే.
చం: చాలా కథే ఉందన్నమాట.
వెం: నీకు మఱొక విచిత్రమైన విషయం చెప్తాను విను. ప్రతీ వ్యక్తికి తను తీయించుకున్న photosలో ఒకటో రెండో నచ్చుతాయి. అమ్మాయిలకు ఇంకొన్ని నచ్చుతాయి. అంతవరకు OK. కాకపోతే అవన్నీ సుమారుగా ఒకే వ్యక్తిని చూపించాలా? కానీ కొన్ని profiles లో photos ఒక దానికి మఱొక దానికి పొంతన ఉండదు. వాటిలో ఏది ఇప్పటిదో, ఏది చిన్నప్పటిదో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు.
చం: అదెలాగ రా?
రాం: దశావతారం లాగా దశావతారిణా?
వెం: దీని వెనుక రహస్యం adobe వారి photoshop. ఏ ముహుర్తంలో కనిపెట్టారో కానీ మన దేశంలో అమ్మాయిలకు రూపురేఖలు మార్చేస్తోన్న మంత్రం ఇదే.
రాం: మరి ఐతే అసలు ఏదో నకిలీ ఏదో ఎలాగ తెలుసుకుంటాం?
వెం: చాలా సులువు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. పిల్లని పిల్లతోనే తెలుసుకోవాలి.
రాం: చిల్లును చిల్లుతోనే పూడ్చక్కరలేదా?
చం: నువ్వు ఆగరా...
వెం: కిటుకు ఏమిటంటే మన స్నేహితులలోనో, చుట్టాల్లోనో ఆడపిల్లలు ఉంటారు కదా. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళు కూడా photo లు తీయించుకుని వాటికి మరమ్మత్తులు, కసరత్తులు చేస్తారు కదా. అందుచేత వాళ్ళకు ఏది నకిలీనో, ఏది సరైనదో, photo లో ఏ భాగంలో ఎంత work జరిగిందో తెలుస్తుంది. Photoshop చేయబడిన చిత్రాలలోనుండి సునిశితమైన పరిశీలనతో మొటిమలు, ఎత్తు పళ్ళు, గెద్ద ముక్కు, వంకర మూతి నుండి తెల్ల జుట్టుపోగు సైతం గుర్తించగలిగే శక్తిని ఆ భగవతుడి ఈ సృష్టిలో అమ్మాయిలకే ఇచ్చాడు. అందుకే మా అన్నయ్యకు photo నచ్చగానే నేను తనిఖీ చేయించడానికి మా బంధువుల అమ్మాయికి forward చేస్తూ ఉండేవాడిని. మీరు నమ్మరు కానీ: ఎవరో మాట వరసకి "వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయచ్చు" అన్నది మన తరంలో కొంతమంది అమ్మాయిలు యథాతథంగా అన్వయించుకుని ఒక్క photo లోనే వెయ్యి అబద్ధాలను జొప్పించి మరీ పంపిస్తున్నారు.
రాం: ఇది కాదా నేరం? దీనికి లేదా శిక్ష? ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం.
వెం: కొన్ని photos అసలు ఈ అమ్మాయి పెళ్ళి చేసుకుందాం అనే ఉద్దేశంతోటే పెట్టిందా అన్నట్టుంటాయి. జబ్బలు తీసేసిన జాకట్ల నుండి ఇంక అలాగ చూసుకుంటూ పోతే...అన్నట్టు నీకు ఒక profile చూపిస్తాను ఆగు. (Computer లో కాసేపు వెతికి...) ఆ చూడు. అసలు ఈ అమ్మాయి సగం చీరని దాని పని అది చెయ్యకుండా ఆపేసేటట్టైతే ఇంక అది కట్టుకొవడం దేనికో.
రాం: ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, జోహారులే వీరి అమ్మకు...
చం: సరేలేరా..అది ఆ అమ్మాయికి నచ్చిన style. ఏదో సరదాగా పెట్టింది.
వెం: పిచ్చివాడా...అందుకే profile మొత్తం చూడకుండా secular కూతలు కుయ్యకూడదు. ఇక్కడ చూడు. Profile created by: Parents. అంటే వీళ్ళ నాన్న తనకున్న photoలలోకల్లా ఇదే బాగుంది అని వెతికి మరీ పెట్టాడన్నమాట. ఆహాహా, ఏం తండ్రి రా.

కొనసాగుతుంది...
4 comments:
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్...సూపర్... ఈ పెళ్ళి చూపుల తతంగమంటేనే పిచ్చ కామెడీ. :-)
హ హ రాస్బెర్రి, మీ మరదలు పుణ్యమా అని మీకా సమస్య రాలేదు కదా :)
హ హ మౌళి గారు, నాకెందుకు రాలేదండి. ఆ మరదళ్ళ వల్లనే నేనూ రిక్వైర్మెంట్ల గోలలో పడ్డా. లేకపోతే ఏ ఐదవతరగతి ఫెయిలైన అమ్మాయినో చేసుకునేవాణ్ణి. వాళ్ళకైతే ఈ కంప్యూటర్లూ, గోలా పెద్దగా అర్థం కావు కాబట్టి నేనేది చెప్పినా అర్థం కాక గతిలేక వింటారు. :-)
పురాణం మొదలెట్టినట్టున్నారే .. సూతుడు, శౌనకాది మునులకు .. బావుంది బావుంది.
Post a Comment