నన్నెఱిగిన చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే: నేను మంచివాణ్ణా, చెడ్డవాడినా అన్న సంగతి పక్కన పెడితే, పెద్దలంటే గౌరవం ఉంది అని. ఇదేదో ఆత్మస్తుతి అనుకునేరు. ఇది నేను యత్నపూర్వకంగా చేసేది కాదు. ఎందుకో చిన్నప్పటినుండి అలాగ అలవాటైపోయింది. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు దాదాపు ఇరవయ్యేళ్ళు పట్టింది.
మన దేశంలో ఉండగా ఎప్పుడూ నా స్నేహాలు ఉపాధ్యాయులతోనే (school, junior college, engineeringలో కూడా). నా ఎదురుగుండా ఉపాధ్యాయులను వెటకారం చెయ్యాలన్నా, మనస్పూర్తిగా తిట్టుకుందామన్నా నా స్నేహితులు జంకేవాళ్ళు. అలాంటి స్నేహాలు నాకు విచిత్రంగా తోచకపోయినా నా మిత్రులందరికీ విచిత్రంగా అనిపించేవి (అనిపిస్తున్నాయి). ఇక నిత్యజీవితంలో నాకు నచ్చేవారు కూడా తలలు పండిపోయినవారే. ఇంట్లో నేను మా తాతయ్య కంటే చాదస్తుణ్ణని వినికిడి. భారతంలో నాకు నచ్చిన పాత్రలు భీష్ముడు, వ్యాసుడు, విదురుడు -- అందరూ తలలు పండి నీతులు చెప్పే వాళ్ళే. ఆఖరికి మన భారతక్రికెట్లో T20 ఆటలో కూడా నాకు నచ్చుతున్నది ముసలివాళ్ళే (ద్రావిడ్, తెండుల్కర్, లక్ష్మణ్ :) ).
ఇప్పుడు ఈ చరిత్ర అంతా మాకెందుకు అంటారు. అక్కడికే వస్తున్నాను. ఈ తరం పెద్దలకి (అంటే సుమారుగా 50 ఏళ్ళు దాటినవాళ్ళకి) Internet రావడం వలన జీవితంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఒకప్పుడు trunk call చెయ్యాలంటే ముందురోజునుండి ఏమేమి మాట్లాడాలో ఆలోచించుకునేవాళ్ళు, ఈ రోజు ఏమీ తోచక ISD calls చేసేవాళ్ళ మధ్యలో ఇమడటానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుకు కూడా మా చిన్నత్తయ్య, నేను విశాఖపట్నం నుండి తుని వెళ్తుంటే "ఒరేయ్ నాన్న మూడు గంటల passenger పట్టుకుంటే పదిరూపాయలు తక్కువవుతుంది" అంటుంటే నాలో ఏదో తెలియని బాధ కలుగుతుంది, "అరే? నా ముందుతరం వాళ్ళు డబ్బుకు ఇంత వెనకాడేవారా? ఈ రోజు మనం జీవితంలో ఏమీ సాధించకుండానే పుట్టినరోజు పేరు చెప్పి మూడువేలు తగలేస్తున్నాము".
మార్పు సహజం. దాన్ని యువత ఆహ్వానించినట్టుగా పెద్దలు ఆస్వాదించలేరు. కానీ, మన ముందుతరం వాళ్ళు మన మీద ప్రేమతో ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నంలో భాగంగానే Internet లో మసలడానికి కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని చూసి మన తరమంతా మనఃపూర్వకంగా గర్వపడాల్సి ఉంది. వాళ్ళు కూడా ఒక్కసారి కొడుకుతోనో, మనవడితోనో వాళ్ళంతటవాళ్ళు chat చేసినా, video callలో మాట్లాడినా పొంగిపోతారు, గర్వపడతారు.
"ఇదంతా సరే, అసలు ఈ శీర్షవాక్యానికి (titleకి) నువ్వు మాట్లాడుతున్నదానికి సంబంధం ఏమైనా ఉందా?", అని ఇప్పటికే చదువర్లు చిఱాకు పడుతూ ఉండి ఉంటారు. అందుకే అసలు విషయంలోకి వస్తున్నాను. మన పెద్దలు చేస్తున్న ప్రయత్నంలో కొంచెం నవ్వు తెప్పించేవి కూడా ఉంటాయి. మన చిన్నప్పుడు మనం తెలిసీతెలియని మాటలు మాట్లాడుతుంటే పెద్దలకు కలిగిన నవ్వులాంటిదే ఇదీను. అందుకే ఈ నవ్వులో కూడా ఒక అభిమానం దాగుంటుంది. అలాగ నాకు ఎదురైన సందర్భాలను చెప్పడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
నా స్నేహితుడు ఒకడు MS చేసి US లో ఉన్నాడు. వాడు వాడి తల్లిదండ్రులకి ఏకైక సంతానం. వాడి మీదనే వాళ్ళ ఆశలన్నీ పెట్టుకుని పెంచారు. వాడు ఇక్కడకి వచ్చాక, వాళ్ళకు కాళ్ళూచేతులూ ఆడలేదు. వీడు ఒక Computer కొనిపించి అందులోంచి వాడితో ఎలాగ మాట్లాడాలో నేర్పించాడు. అప్పటినుండి తండ్రీకొడుకుల పాత్రలు తారుమారు అయ్యాయి. వాళ్ళ నాన్న గారు కనబడిన siteలోకల్ల వెళ్ళి login create చేసుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు అన్ని sitesలోనూ social aspect ని చేర్చారు కాబట్టి invite your friends అని ఉంటే అది click చెయ్యడం. దానితో వీడికీ, వీడి friends కి emails వెళ్ళడం. ఒకసారి ఏకంగా facebook account సృష్టించుకుని వీడికి friend request పంపించారు. అది చూసి మనవాడు ఖంగు తిన్నాడు. ఇంటికి phone చేసి, "నాన్న, మీరంటే నాకు ఇష్టం, గౌరవం ఉన్నాయి. కానీ, Internet లో మాత్రం నన్ను వదిలెయ్యండి. నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రాకండి. మీ నాన్న గారు కూడా ఇలాగ మీరు friends తో కలిసి cigarette కాలుస్తూ బాతాఖానీ కొడుతుంటే వచ్చి చూసేవారా? మీరు facebookలో ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నారో నేను అడగను. అమ్మతో కూడా చెప్పను. నేను ఏం చేస్తున్నానో మీరు అడగద్దు", అని బొమ్మరిల్లు style లో చెప్పాడు. అది విని నేను తెగనవ్వుకున్నాను.
మఱొక స్నేహితురాలు వాళ్ళ అమ్మగారికి facebookలో ఖాతా సృష్టించి, కొంతవరకు ఎలాగ వాడాలో నేర్పించి US వచ్చింది. ఒక రోజు వాళ్ళ అమ్మ గారి మీద అలిగి phone ఎత్తడం మానేసింది. వాళ్ళ అమ్మగారికి ఇంకా కోపం వచ్చింది. అది ఎలాగ చెప్పాలో తెలియలేదు. facebook లో login అయి ఈమె updates చూసింది. ఈమె ఒక స్నేహితురాలి photo లో ఒక వ్యాఖ్య వ్రాసింది. ఆ క్రింద Add comment అని కనబడింది. aunty కి ఏం తెలుస్తుంది అక్కడ వ్రాస్తే అందరూ చూస్తారు అని. ఆవేశంగా, "phone కూడా ఎత్తట్లేదు. చాలా ఎదిగిపోయావు. thanks!" అని వ్రాశారు. అంతే ఈ అమ్మాయి అన్నం తింటున్నది కాస్తా, బుఱ్ఱ గింగిరాలు తిరిగి వాళ్ళ అమ్మగారి ఖాతా లోనికి login అయ్యి ఆ వ్యాఖ్యని నిర్మూలించింది (deleted). ఆ అలక విషయం నాకు చెప్తూన్నంత సేపు బాధపడ్డవాడిని ఇది వినగానే నవ్వు ఆపుకోలేకపోయాను.
మఱొక స్నేహితుడి ఇంటికి వెళ్తే వాడు వంట వండటం మొదలెట్టాడు. నేను కూర్చుని చూస్తున్నాను. అప్పుడే వాళ్ళ ఇంటినుండి Yahoo! messenger audio call వచ్చింది. నేను వెళ్ళి నీకు call వస్తోందిరా అంటే, వాడు బెంబేలెత్తిపోయి reject కొట్టాడు. అదేమిరా అంటే, "మా అమ్మకు అవసరమైనప్పుడు మాట్లాడటానికి ఉంటుంది అని నేను ఇది నేర్పిస్తే రోజూ నాలుగు సార్లు చేసేస్తోంది. అసలు రోజంతా call ఉంచితే ఏం పోయింది? Internet bill అంతే వస్తుంది కదా అంటోంది.", అన్నాడు. "Internet bill అంతే వస్తుందని ఎలాగ తెలుసురా?" అంటే "మనమెంత మాట్లాడితే అంత ఖర్చవుతుంది అని అనుకుని ఎప్పుడూ 'బాగున్నావా? ఆరొగ్యం జాగ్రత్త. ఉంటాను నాన్న.' అని తప్ప వేరేది మాట్లాడేది కాదు. అప్పుడు చెప్పాను, 'మనది unlimited plan. ఎంత మాట్లాడినా అంతే ఖర్చవుతుంది అని.", అన్నాడు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు -- వాళ్ళ అమ్మగారు వాడిని ఎంత miss అవుతున్నారో చూసి బాధ, ఆవిడ idea కి నవ్వు.
నా స్నేహితుడి అన్నగారు కూడా facebook లో చేరారు. ఒక రోజు వెళ్ళి ఆయన profile చూస్తే ఆయన friends లో ఎవడొ russia వాడున్నాడు. వాడెవడొ spammer కుంక అయ్యి ఉంటాడు. మనవాళ్ళకి తెలియదు కదా. ఎవడో పరాయి దేశస్థుడు మనని రెండు చేతులూ చాచి స్నేహాన్ని కోఱుతుంటే కాదంటే తప్పుగా ఉంటుంది అని అనుకున్నాడొ ఏమో accept చేశాడు. అది చూసి మా వాడు, "ఒరేయ్, ఇది చూడరా మరీను", అని చెప్పి కంగారు పడ్డాడు.
ఇక "Click here and claim your laptop; Congratulations! You're the lucky winner; Win a trip to Maldives for free!: లాంటివి చూసి వీళ్ళు ఇంకేం చేస్తారో; ఎక్కడ click చేసి computerకి ఏ Virusలు తెచ్చుకుంటారో అని ఒక కంగారు. ఒక్కోసారి, రేపు పెద్దయ్యాక పిల్లల మీద అభిమానంతో మనం ఎలాంటి పనులు చేస్తామో అనిపిస్తుంది నాకు. అదీ చూద్దాము :)