చాలా రోజుల బట్టి ఆంగ్లసరస్వతిని అర్చిస్తూ అచ్చతెలుగుసరస్వతిని తలుచుకోవడం కుదరలేదు. అందుకే ఎంత బిజీగా ఉన్నా ఈ పూట మా బాబాయ్, నేను అమ్మ మీద కొన్ని పద్యాలు వ్రాయాలని నిర్ణయించుకున్నాము. ఆ ప్రయత్నఫలితంగా:
సీ|| నవమాసములు మోసి నన్నుగాచిన తల్లి, అవనిలో తారాడు ఆదిశక్తి
ఆకలనకమున్నె యన్నంబు తినిపించు, అమృతాంభునిధియామె అన్నపూర్ణ
అమరమై నిలిచెడి అక్షరమ్ములుమప్పి, సద్బుద్ధులొసగిన శారదాంబ
తన బిడ్డ సుఖముకై దైవాల ప్రార్థించు, విమలహృదయ పూర్ణ విజయలక్ష్మి!
ఆ|| పలుకుతేనెలమ్మ! పద్యాభిషేకంబు
జరప(గోరె మనసు, సాదరముగ
కరుణ(జూచు తల్లి, కామితార్థద! నీవు
అందుకొనుమ మాదు వందనాలు!
తొలుత నేను వ్రాసిన పద్యానికి మెరుగులు దిద్ది మరింత అందంగా మలచిన చింతా రామకృష్ణారావు గారికి నా ధన్యవాదాలు!
Thursday, November 12, 2009
Friday, November 6, 2009
జాబిలితో చెప్పనా?
వేటూరి తొక్కిన బూతుపుంతలకూ ఆయన సరససాహిత్యానికీ పొంతన ఉండదు అని నేను ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అది బహుశా రసికులకందరికీ తెలుసును. ఈ రోజు నేను చెప్పబోయే పాట "ఆకు చాటు పిందె తడిసే", "చూడర చూడర సులేమాన్మియా" వంటి "ఊపు" ఉన్న పాటల మధ్యలో కొట్టుకుపోయిన ఒక అద్భుతమైన పాట. అదేమిటో తెలియదు కానీ, "రాఘవేంద్రరావు" అనగానే వేటూరి కలానికి యవ్వనం వచ్చిపడుతుంది. ఈ పాట వేటగాడు చిత్రంలో, హీరో హీరోయిన్ ప్రేమలో పడిన కొత్తలో, మత్తులో పాడుకునే పాట.
ప్రేమలో పడ్డాక ప్రేయసి కంటే అందం ఇంకోటి కనబడకపోయినా, ఆమెకు దగ్గరగా వచ్చే పోటీదారుడు చంద్రుడు. అసలే విరహవేదనతో బాధపడుతుంటే దానిపైన తన కిరణాలతో అత్తరు చల్లే గుణం ఆయనది. ఈ భావాన్ని ఎంతో సున్నితంగా చెప్పాడు వేటూరి. ముఖ్యంగా నాకు నచ్చే వాక్యాలు:
తుమ్మెదలంటని తేనలకై తుంటరి పెదవికి దాహాలు
ప్రేయసి పెదవులలో మధువలను "తుమ్మెదలంటని తేనెలు", అని వర్ణించడం ఒక ఎత్తైతే "వాటికై తుంటరి పెదవులు అనే తుమ్మెదలకు కోరిక కలిగింది", అని చెప్పడంతో వేటూరి "వీడి ఇల్లు బంగారంగానూ", అనిపించాడు.
చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు
"చుక్కలు లేని చీకటి" అంటే చిమ్మచీకటి అనుకుంటున్నారా? నాకు ఎందుకో "నాయికానాయకులకు మధ్యలో ఉన్న బెరకు" లాగా అనిపిస్తోంది. లేకపోతే ఎంత చీకటైతే అంత స్పష్టంగా చుక్కలు కనబడతాయి, ఆ చీకటిని చూస్తాయి కదా? అందులో "దిక్కులు కలవని విరహాలు", అంటే "ఒక చోటకు చేరని విరహాలు". ఒక్క చోటకు చేరి దిక్కులు కలిస్తే విరహాలు ఎందుకౌతాయి? సరసాలు అవుతాయి :)
గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు
ప్రేయసిని/ప్రియుడిని చూడగానే హృదయంలో ఏదో తెలియని అలజడి, ఆ హృదయం గొంతులోనుండి బయటకు వచ్చేద్దామని ప్రయాణిస్తుందే కానీ, పెదాలు దాటదాయే! ఈ అనుభవం లేని ప్రేమికుడు/ప్రేయసి ఉన్నారు అంటే వాళ్ళను చూసి నేను జాలిపడతాను. ఆ భావాన్ని: "గొంతులు దాటిన గుండె" అని మూడు ముక్కల్లో వ్రాసేశాడు ఈ మహాపిసనారి కవి. కోయిల గొంతులో గమకాలు విని పరవశించిపోవడం రివాజు. అయితే ఈ గుండె గొంతు దాకా వచ్చాక అందులో పుట్టే గమకాలు ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటాయి. అది ఒక చెప్పలేని తీపిబాధ. ఆ కలల్లో, ఆ గళంలో పుట్టే రాగాలు ఇంకా మధురంగా ఉంటాయి. ఇంతటి పురాణాన్ని ఒక్క వాక్యంలో వ్రాసిపడేశాడు ఈ అసాధ్యుడు.
సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు
సూర్యుడు చూడని గంగలు అంటే ఏమిటా అని సంసారపక్షంగా చాలా ఆలొచించగా నాకు అర్థమైనది ఏమిటీ అంటే అవి ప్రేమికుడి కలలు అని. కాకపోయినా "ఆమె అందాలే అలలుగా పారిన గంగలను సూర్యుడు చూడలేదు", అనే భావం కూడా ఉండచ్చు. వేటూరి పాటలు నోస్త్రదాముని కాలజానం లాగా కొంచం వినేవాడి ఊహాశక్తికి వదిలేస్తాయి అనిపిస్తుంది. అలా ఉండటం ఒక అందం!
చివరిగా "కౌగిట కాముని పున్నిమలు", అనడంతో శ్రీకాకుళసాంప్రదాయాన్ని వేటూరి చిలిపిగా వాడుకుని తనకు చరిత్ర పట్ల ఉన్న అవగాహనకు ఒక ఆనవాలుగా వదిలేశాడు. ఈయన రచించిన "సిరికాకొలను చిన్నది", చదివితే ఈ "కాముని పున్నిమల", గురించి ఇంకా తెలుసుకోవచ్చు!
చిత్రం: వేటగాడు
సంగీతం: శ్రీ కే వీ మహాదేవన్
పాడింది: సుశీల, బాలు
రచన: వేటూరి
జాబిలితో చెప్పనా, జామురాతిరి నిదురలోన నువ్వు చేసిన అల్లరి చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా, జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా

చూపలలో చలి చురచురలు, ఆకలి తీరని విరవిరలు
అన్నీ ఆవిరి పెడుతుంటే, నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా?

కౌగిట కాముని పున్నములు, వెన్నెల వీణల సరిగమలు
పేరంటానికి రమ్మంటే, పెళ్ళికి పెద్దవి నీవేలెమ్మని

Monday, November 2, 2009
కార్తీకపౌర్ణమి
ఈరోజు కార్తీకపౌర్ణమి, కార్తీక సోమవారం. శివకేశవులకు మిక్కిలి ప్రీతికరమైన రోజు. కార్తీకమాసం యొక్క విశిష్టత గురించి, ఈ మాసంలో చెయ్యాల్సిన విధుల గురించి కార్తీకపూరణం లో వివరించబడింది. ఎన్నో పాపాలు చేసినా కార్తీకమాసంలో శివుడికి కై, కేశవుడికి కాని ఒక్క దీపం పెడితే పోతుంది అని పెద్దల మాట. వశిష్టుడు జనకమహారాజుకి ఈ మాసం యొక్క ప్రాశస్త్యం గురించి కార్తీకపురాణం వివరించాడు. భక్తితో ఒక్క సారి శివ అనో, హరి అనో అన్నవాడికి పాపాలు తొలగి సద్బుద్ధి కలుగుతుంది.
ఈ మాసంలో ఉపవాసం ఉండటం కూడా శ్రేష్టమైన పని. ఉపవసలలో అనేక రకాలు ఉన్నాయి. నియమం ప్రకారం వెళ్తే, ఈ రోజు ఉపవాసం ఉందాము అనుకునేవాళ్లు నిన్న సూర్యాస్తమయం నుండి రేపు ఉదయం సూర్యుడు ఉదయించిన నలభైఎనిమిది నిముషాల వరకూ ఏమి తినకూడదు. కొందరు పచ్చిగంగా కూడా తాగారు, కొందరు నీళ్ళు మాత్రం తాగితే, కొందరు పాలు తాగుతారు. ఇది ఇలాగ ఉంటె, ఇంత సాహసం చెయ్యలేని వాళ్ళు (ముసలివాళ్ళు, నా లాంటి తిండిబోతులు మొ||) ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం తార (నక్షత్రం) దర్సనం అయ్యేవరకు ఏమి తినరు. దీనినే ఏకభుక్తం అంటారు అని నాకు గుర్తు. అలాగే కొందరు మధ్యాహ్నం భోజనం అయిన తరువాత ఇంకేమి తినకుండా రాత్రి పాలు తాగి పాడుకుంటారు. కొందరు పళ్ళు తింటారు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చెయ్యచ్చు. ఏదేమైనా, ఉల్లి-వెల్లుల్లి లాంటి తామస గుణము ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు.
శివకేశవులకు సంబంధించిన మంత్రాలు (ఉదా|| ఓం నమఃశివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ) ఉచ్చరించేవాళ్ళు అవి తప్పక చెయ్యగలరు. ఈ రోజు గొప్పదనం గురించి నేను ఇంతకంటే చెప్పనవసరం లేదు.
"నాకు భక్తీ అంతే తెలియదు కానీ, దేవుడికి దణ్ణం పెట్టుకోవడం తెలుసును", అనుకునేవాళ్లు ఇవన్నీ చెయ్యలేకపోయినా కనీసం మాంసాహారం మానేసి, వీలైనంతవరకు భక్తిరసప్రధానం ఐన పాటలు పెట్టుకుని వింటే మంచిది. పురాణాలు వినే ఓపిక ఉంటె వినచ్చును.
||హరి:ఓం||

Friday, October 30, 2009
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది!
నేను ఇప్పుడు చెప్పబోయే పాట బహుశా చాలా మందికి తెలిసి ఉండదు. నేనే ఆ పాట వినటానికి ఇష్టపడను. ఎందుకంటే, అది ఒక ఏడుపు-పాట. కానీ, ఆ పాటలో నిజమైన ఆవేదనని ఒక "మామూలు మనిషి" మాటల్లో చెప్పాడు వేటూరి.
ఈ పాట "జెమిని" సినిమాలోది. ఒక వ్యక్తీ చనిపోతే ఎంత బాధ కలుగుతుందో, ఎవరెవరో ఎలాగ బాధపడతారో చెప్పే పాట. ఇందులో నేను వ్యాఖ్యానిన్చటానికి ఏమి లేదు. ఆ వాక్యాలు అన్నీ సామాన్యులకు అర్థమయ్యేలాగా ఉన్న మాటలే. ఐతే నా మనసుని తాకినా వాక్యాలు రెండు: "నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది".
చిత్రం: జెమిని
రచన: వేటూరి
సంగీతం: ఆర్ పీ పట్నాయక్
పాడింది: వందేమాతరం శ్రీనివాస్
చుక్కల్లోకేక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
తల్లిడిల్లిపోతుంది తల్లి అన్నది
బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది
పాడె ఎత్తడానికే స్నేహమన్నది
కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది
పోయినోడు ఇక రాడు,ఎవరికెవరు తొడు
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది
కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది
చావుబ్రతుకులన్నవి ఆడుకుంటవి
చావు లేని స్నేహమే తోడూ ఉంటది
Tuesday, October 27, 2009
పదాలకు వింత వ్యుత్పత్తుల ఉత్పత్తులు!
నా చిన్నతనం నుండి నాకు భాషల పట్ల ఇష్టం, ఒక రకమైన అభిరుచి ఉన్నాయి. అందులోనూ ఎంతో కొంత కవిని ఆయే! ఇంక కొత్త పదం తెలియడమేమిటి, దానికి వ్యుత్పత్తి ఏంటో నేనే ఊహించి చెప్పెయ్యడం మొదలెట్టేసాను. అలాంటివి:
సప్తపది: సప్త అంతే ఏడు కాబట్టి ఏడు పదులు డబ్భై అనుకునేవాడిని. సప్తపది సినిమా గురించి తొలుత విన్నప్పుడు నా వయసు వర్షసప్తకం!
దత్తపది: పది పదాలు ఇచ్చి మిగతావి వ్రాయమంటారు కాబట్టి దత్తపది. ఒక సారి మా ఫ్రెండ్ కి నాలుగు పదాలు ఇచ్చి, "ఇది దత్త-నాలుగు" అన్నాను కూడా :-)
అనవసరం: ఇంగ్లీష్ "అన్" + "అవసరం". అంటే, "అన్" + "నేసెస్సరీ" లాగా అన్నమాట. అలాగే, "అశేషం" అంటే "అ" + "శేషం". మన "అ" + "టిపికల్" లాగా అన్న మాట. ఇది నేను చిన్నప్పుడైతే తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ ని కాపీ కొట్టేసారు అనుకునేవాడిని :-O
బ్రదర్: సంస్కృత "భ్రాతా" నుండి కాపీ కొట్టేసారు అనుకునేవాడిని. అలాగే, "నైట్" అనేది "నక్తం" నుండి వచ్చిందని బలంగా నమ్మేవాడిని. ఇందులో కొంత నిజం ఉన్నా ఆశ్చర్యపోనులెండి.
నాకు ఒక్కోసారి జంధ్యాల సినిమాలో "సుత్తి వీరభద్రరావు" గుర్తొస్తూ ఉంటాడు. "అసలు న్యూటన్ అనేవాడి అసలు పేరు "నూతనుడు". వాడు బెంగాలీయుడు!" అని ఉద్ఘాటించినట్లు నేను కూడా చాలా అర్థాలు "డిసైడ్" చేసేసేవాడిని.
ఇవి ఇలాగ ఉంటే, నిజంగా కొన్ని మామూలు పదాలకు చాలా పెద్ద పెద్ద అర్థాలు ఏర్పరుస్తారు జనాలు. అది ఇంకా విచిత్రం. ఉదాహరణకి:
నాయాలు: "నా + ఆలు" అంటే "నా భార్య" అని అర్థం. ప్రియురాలు, జవరాలు, ఇల్లాలు అన్నీ కూడా తెలుగు సంధులే. ఈ నాయాలు అనే పదం తొలుత మా సోదరుడు "లవ-కుశ" చిత్రంలో "ఒల్లనోయి మామా, నీ పిల్లను" అనే పాటనుండి గ్రహించి నాకు అజ్ఞానం నుండి విమోచనం కలిగించాడు!
శ్రాద్ధం: "శ్రద్ధ" గా చేసేది కాబట్టి శ్రాద్ధం! అలాగే, "తద్దినం" అంటే "తత్ + దినం" అంటే "ఆ రోజు" అని అర్థము. ఈ రెండు పదాలు ఎప్పుడూ కొంచం అశుభసందర్భాలలోనే వాడతారు.
మరి కొందరు పదాల అర్థాలకు తోడ్పడేలాగా పదాలను పలుకుతారు. మచ్చుక్కి:
లెఖ్ఖ: అసలు పదం "లెక్క". కానీ, "లెక్క సరిగ్గా ఉండాలి" అనే భావంతో ఆ "సరిగ్గా" మీద కక్ష/కాంక్షా తీసుకొచ్చి ఈ "లెక్క" మీద రుద్ది "లెఖ్ఖ" చేస్తారు!
ఉచ్ఛారణ: అసలు పదం "ఉచ్చారణ". "ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి" అనే ఆవేశంతో స్పష్టాన్ని క్లిష్టం చేసి ఉచ్ఛారణ చేసారు. ఇది ఇంగ్లీష్ లోనూ ఉంది "pronunciation" ని "pronounciation" చేసేస్తారు. ఏమైనా, మనకు కావలసింది pronunciation ఏ కానీ, spelling కాదు కదా!
ఖర్మ: అసలు ఈ "ఖర్మ" ఎక్కడనుండి వచ్చిందా అని నేను తెగ ఆలోచించేవాడిని. బ్రహ్మానందం భాషలో ఇది "కర్మ" కు పట్టిన "కర్మాయ్" :) ఎంతో విసుగ్గా ఉండి, "ఇది నా కర్మఫలితము. ఎవర్నీ అనుకోవడానికి లేదు", అనే లోతైన వేదసూత్రాన్ని "నెత్తీ నోరు బాదుకుని" చెప్పిన ఫలితం దక్కాలని "ఖర్మ" గా మార్చారు.
తెలుగు పద్యాలు చదివేటప్పుడు కొందరు చేసే దోషాలు బాగా నవ్విస్తాయి. "రామునితో కపివరుండు ఇట్లనియె" ని "రాముని తోక పివరుండు ఇట్లనియె" అని "పండగ" సినిమా లో చూసి "ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తారా?", అనుకునే వాళ్లు అవాక్కయ్యేలాగా మా తమ్ముడి క్లాసు లో కొందరు, కృష్ణుడితో ద్రౌపది తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చెప్పిన పద్యంలో ఒక పదాన్ని "పంక-జనాభా" అని పలికారు. పాపం, "పంకజ-నాభుడికి" "కలియుగం మొదలయ్యింది, జనాభా అంతా పంకమయం అయ్యింది", అని ద్రౌపది చెప్తోంది అనుకున్నారో ఏమో!

Friday, October 2, 2009
లిపిలేని కంటి భాష తెలిపింది కొంటె ఆశ
ఈ రోజు వేటూరి చేసిన ప్రయోగాల్లోకల్లా కాస్త సులువుగా అర్థమయ్యి, ద్వంద్వార్థాలు లేని ఒక్క పాట చూద్దాము.
ఒక అమ్మాయి తన మనసులో ఉన్నా సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపించింది. అతడు అది చదివి ఆ అమ్మాయికి బొక్కబోర్లా పడిపోయాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ పారే ప్రణయరాసాన్ని వేటూరి ఎంతో సున్నితంగా మంచి భావుకతతో వ్రాసాడు. మొత్తం పాట గురించి నేను వ్యాఖ్యానించెంత టైం లేదు కానీ, నాకు నచ్చిన ప్రయోగాలు మాత్రమే చెప్తాను.
- మోహంలో ఉన్న అమ్మాయి కళ్లు మాట్లాడుతున్నాయి అనడానికి "లిపి లేని కంటి భాష, తెలిపింది చిలిపి ఆశ" అని ఎంతో చిలిపిగా చెప్పాడు.
- తెలుగు పదాలతో గారడీ చెయ్యవయ్యా అని దరఖాస్తు పెట్టుకోకుండానే అవలీలగా చేసేసి మురిపించేయ్యడం వేటూరికి కొత్త కాదుగా. "గడప దాటలేక నేనే గడియ వేసుకున్నాను", అని అమ్మాయి, "నువ్వు లేని జీవితం నాకు నచ్చలేదు", అని చెప్తే, "గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను", అని అదే భావాన్ని మాటలు ముందుకూ, వెనక్కీ మార్చి అబ్బాయి చెప్పడం నా చేత ఐతే, "సాహో వేటూరి, నీకు లేదు సాటి", అనిపించింది.
ఇక్కడ చెప్పుకోవలసింది ఒకటి ఉంది. వేటూరి కొందరు దర్శకులకు ఎప్పుడూ మంచి సాహిత్యాన్నీ అందిస్తూ ఉంటాడు. విశ్వనాథ్, జంధ్యాల, రాఘవేంద్రరావు, శేఖర్ కమ్ముల, దాసరి నారాయణ రావు వంటి వారికి గతంలో అద్భుతమైన పాటలు వ్రాసాడు.
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ

(డబ్భైమూడేళ్ళ మనిషిని పట్టుకుని, "డు-కారం", వాడుతున్నాడు అని కారాలూ మిరియాలూ నూరేయ్యకండి. అదివేటూరిని "మమ" (సంస్కృతంలో "నా") అనుకున్న "మమకారం".)
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ
సంగీతం: రమేష్ నాయుడు
గాయకులూ: బాలు, జానకి
దర్శకుడు: కీ. శే. జంధ్యాల
లిపి లేని కంటి భాష, తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుకలేఖలలో, నీ సొగసుల కవితారేఖలలో
ఇలా... ఇలా... చదవనీ నీ లేఖని ప్రణయలేఖని
ఇలా... ఇలా... చదవనీ నీ లేఖని ప్రణయలేఖని
బదులైన లేని లేఖ, బ్రతుకైనా ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో, నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా... ఇలా... వ్రాయనీ నా లేఖని ప్రనయరేఖనీ!
అమావాస్య నిశిలో కోటి తారలున్నా ఆకాశం
వెతుకుతూ ఉంది వేదన తానై విదియనాటి జాబిలి కోసం
వెలుగునీడలేన్నున్నా వెలగలేని ఆకాశం
ఎదుగుతుంది వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం
అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో నీ పెదాలు అద్దుకుని
నీ కంటికి పాపను నేనై, నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నేనే గడియ వేసుకున్నాను
గడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను.
భావాలతోట, పదాలతేట, వేటూరి పాట!
వేటూరికి రెండు అస్త్రాలు ఉన్నాయి. ఒకటి భాష, మరొకటి భావుకత. ఆ రెండూ ఉన్న కవిని పట్టుకోవడం అసాధ్యం. ఆది నుంచి ఉన్న తెలుగు సినీకవుల్లో ఎవరికీ లేనంత భాషాపరిజ్ఞానం ఒక్క వేటూరికే ఉంది అనటంలో యేమీ సందేహం లేదు. అదే కాకుండా, భారతీయ/తెలుగు సాంప్రదాయాలకు సంబంధించిన సాహిత్యాన్నీ చాలా వరకు చదువుకున్నాడు ఈయన. మరి ఆనాటి చదువులవి. ఇదంతా ఒక్క పెట్టు ఐతే, ఆకాశాన్ని తాకే ఆయన భావాలు నన్ను మైమరిపిస్తాయి. "ఆహా, ఈ భావాన్ని ఇంత అందంగా వర్ణంచచ్చా? ఇంకా అందంగా ఎవరైనా వర్ణించగాలరా?" అనిపించేలాగా ఆయన వ్రాస్తారు అని నా అభిప్రాయం.
ఐతే ప్రతీ ఒక్కరికీ వేటూరి మీద ఉండే కోపం ఏమిటి అంటే, అన్ని పాటలకూ అదే న్యాయం చేకూర్చరు అని. నేనూ ఒప్పుకుంటాను. ఆయన వ్రాసిన పాటల్లో చాలా ఎబ్బెట్టుగా ఉండే పాటలు కూడా ఉన్నాయి. "అసలు, ఈ పాట ఈయన వ్రాసి ఉండకపొతే బాగుండేది", అనుకున్న సందర్భాలు ఎన్నో. కానీ, ఎవరి వ్యాపారం వాళ్ళది. వేటూరిని విమర్శించే చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, "నేను వ్రాసే ప్రతీ లైన్ కీ న్యాయం చీస్తున్నానా?", అని వాళ్ళను వాళ్లు ప్రశ్నించుకోవాలి. అలాగే, వేటూరిని విమర్శించే ప్రతీ విధార్ధి, "నేను వ్రాసే ప్రతీ పరీక్షకీ నేను పరిపూర్ణంగా సంసిద్ధం అవుతున్నానా?", అని ప్రశ్నించుకోవాలి. ఐతే ఒకటి: అలాంటి రచయితలు లేరు నేను అనట్లేదు. కానీ, వాళ్లకు వేటూరి అంత లోతు, ఎత్తు, బరువు లేవు అని నా నమ్మకం. (శారీరకంగా కాదు అండోయ్, రచించడంలో). ఒక్క మాటలో చెప్పాలి అంతే వేటూరి ఎవరితోనూ పోల్చదగినవాడు కాదు. ఆయన స్థాయే వేరు.
నేను వేటూరికి వీరాభిమానిని. చెవులు, ముక్కు, నాలుక ఇత్యాది శరీరభాగాలని కోసుకుంటాను అని చెప్పను కానీ, మనసు ఐతే పారేసుకున్నాను ఆయన కవిత్వానికి. ఈయన రచనల్లో నాకు నచ్చిన లైన్స్ ఒక్కొక్కటిగా ఎక్కడైనా పేర్చాలి అనుకుంటున్నాను. ఆ భావంతోనే ఈ "వేటూరి నవరసాలు" అనే శీర్షిక మొదలుపెట్టాను.

Subscribe to:
Posts (Atom)