Thursday, September 4, 2008

ఫౌంటెన్హెడీయం

"ఫౌంటెన్హెడీయం" అంటే ఏమిటా అనుకుంటున్నారా? ఇది "ఆయన్ రాండ్" అనే ఆవిడ రచించిన "The Fountainhead" అనే పుస్తకం గురించి వ్రాస్తున్న బ్లాగ్ కాబట్టి అలాగా పిలుస్తున్నాను. (భాగవతంలో ధ్రువోపాఖ్యానం లాగా).

నా ఫ్రెండ్ ఒకళ్ళు ఈ పుస్తకం గురించి మొదట చెప్పినప్పుడు వెంట్రుకలు నిక్కపోడుచుకున్నాయి. అది విన నాకు ఇంద్ర సినిమా గుర్తుకు వచ్చింది. నాకు చాలా ఆనందం వేసింది - నా ఫ్రెండ్ అంత త్రిల్ అయినందుకు. అసలు అందులో విషయమేమిటా అని 2007 జనవరిలో మొదటిసారి రీసెర్చ్ చేశాను. ఆ పుస్తకం ప్రబోధించే ఫిలాసఫీ "objectivism/rational individualism" అని తెలిసింది. "సరేలే" అనుకున్నాను.

కొన్నాళ్ళకి మళ్ళీ ఆ డిస్కషన్ వచ్చింది. "సరే ఈ సారి చదువుదాము", అనుకుని ఇంటర్నెట్ లో reviews చూసాను.
దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటి అంటే "ఈ పుస్తకం అంటే చెవి, కాలు, చెయ్యి, నాలిక, ముక్కు, ఇత్యాది శరీరభాగాలు కోసేసుకునేవారు అనేకానేకులు ఉన్నారు", అని. సంతోషం!

అసలు ఈ పుస్తకంలో భావం ఏమిటి అంటే అది నా మాటల్లో కంటే ఆవిడ మాటల్లో వింటేనే బాగుంటుంది. ఆవిడ చెప్పదలుచుకున్నదంతా క్లైమాక్స్ లో హీరో చేత ఒక courtroom లో చెప్పించింది. మన శ్రీకృష్ణుడు చెప్పదలచుకున్నదంతా (భగవద్గీత) కురుక్షేత్రంలో చెప్పినట్లు అన్న మాట. పోలిక ఘాటుగా ఉన్నా, ఈ బ్లాగ్ naughty గా ఉంటుంది. ఆ పుస్తకం నాకు నచ్చిందా లేదా అనే విషయం ఈ బ్లాగ్ లో అనవసరం. కానీ, ఈ పుస్తకం కూడా నా జీవితంలో కొంచం కామెడీకి దారి తీసింది. ఇక్కడ దీని చుట్టూ జరిగిన కొన్ని సమ్భాషణలను ఉంచుతున్నాను. చూడండి.

దయచేసి: "నాకు బుక్ ని కానీ, రచయిత్రిని కానీ, నవలలో హీరో ని కానీ కించపరచాలనో, వెటకారం చెయ్యాలనో ఉద్దేశ్యం లేదు", అని గుర్తుంచుకోండి. పుస్తకం, రచయిత్రి, హీరో అందరి పట్లా నాకు ఉండవలసిన గౌరవం ఉంది!

ముందుగా ఆ హీరో మనోభావాల్ని ఈ వీడియో లో చూడండి:


ఇకపైన ఈ పోస్ట్ లో అన్నీ సన్నివేశాలే ఉంటాయి. దాదాపు అన్నీ ఆఫీసు లో సంఘటనలే.

[Roles in the plot are all colleagues: RP(me), VR, MT, SV, AD, RK, VG, AA, AK ]

~~~~~~~~~~~~~~~~~~~~~~~Scene-1~~~~~~~~~~~~~~~~~~~~~~
RP: Has anyone over here read The Fountainhead?
AD: Yes, I read it online and it is good.
VR: It is OK!
MT: What RP, you haven't read Fountainhead. You missed it. You should read it at the age of 18-20 when you haven't seen the real world and the world still appears to be ideal to you. It's all over, RP.
SV: Yes, I agree. Now, it wouldn't have as much effect as it had on anyone of us who read it around 20.
RP: [ఆ వయసులో నాకు నవలలు చదవటం కంటే ముఖ్యమైన పనులు ఉండేవిలే. కుదిరేది కాదు. ఏదో షిడ్నీ, హెరాల్డ్ లాంటి వాళ్ల నవలలు చదివి పెద్దగా త్రిల్ అవ్వలేదు. అయినా కూడా, మీరు మరీ హైప్ ఇస్తున్నారు. మీకు ఇలాగ కాదు - పుస్తకం చదివాక ఇస్తాను నా టచ్]

~~~~~~~~~~~~~~~~~~~~~~~Scene-2~~~~~~~~~~~~~~~~~~~~~~
RP: VR, Do you have the book "The Fountainhead"?
VR: Yes - I think I do. I'll get it.
RP: How about tomorrow?
VR: On a Saturday?
RP: Oops - sorry. On Monday, would be fine.
VR: Sure.
[RP emails, SMS's, IM's, calls her a to give reminders. She gets it and RP reads it.]

~~~~~~~~~~~~~~~~~~~~~~~Scene-3~~~~~~~~~~~~~~~~~~~~~~
RP: AD, Could you please review this code for me?
AD: Sure!
[ code review sent ]
AD: We don't use this class like this in our code base!
RP: So what?
AD: Please change it.
RP: When the first man discovered fire, he didn't try to please his brothers or colleagues. He did out of his own passion and interest. He wanted to satisfy himself. It might have given light to a lot of people - but it is his passion that caused the invention. Such is the nature of creativity.
AD: [shocked.] This is not the right way of writing for us.
RP: If this is not the right way or writing for you, then I am not the right engineer for your job. Please excuse me.
AD: [code approved.]

~~~~~~~~~~~~~~~~~~~~~~~Scene-4~~~~~~~~~~~~~~~~~~~~~~
VR: MT, Why don't you come to the movie? This is a team outing and you should hang out!
RK: Yes, MT. I can't imagine watching a movie without you.
SV: Dude, we work together. There is no work now either. Why don't you come?
MT: No man, I don't feel like.
Everyone: RP, why don't you tell MT too?
RP: MT, I know this is none of my business. But as an ardent follower of FH, I would like to remind you something. We follow the noblest of the philosophies - the individualism. When we first came to this world, all we had was just this mind. It is our mind that makes us what we are and we should let it be free. We respect others' freedom but at the same time we are not here to please anyone else. Our first and foremost love is self-love. We are going into an orgy of self-sacrifice. Let's not contribute to it. Whatever happens, we will follow our mind and its decisions.
Everyone: [perplexed.]
MT: RP, thanks for the reminder. I'm declaring hereby that I'm NOT going to come for the movie.

~~~~~~~~~~~~~~~~~~~~~~~Scene-5~~~~~~~~~~~~~~~~~~~~~~
RP: Hey VR, aren't you supposed to wear ethnic dress for the team dinner?
VR: Yes - I got the dress. But no one else is wearing an ethnic dress. How can I alone wear?
RP: Come on - I keep telling all my friends that there is a colleague of mine who wears cool new dresses. Don't let me down.
VR: But me alone?
RP: For ages, it has been a common struggle. The individual vs collectivism. Collectivism preaches that we should comply to the standards set by minds which don't necessarily think like us. We sacrifice our desires and decisions for the sake of others. Such is the nature of collectivism. A creator needs freedom from any other invention or institution. Such is the nature of creativity. I always thought that you are creative and you would not change your decisions for the sake of others. I'm nothing but disappointed now!
VR: Motivated. Goes to change room and dresses up in the ethnic dress.
[RP vindicated and thanked]

~~~~~~~~~~~~~~~~~~~~~~~Scene-6~~~~~~~~~~~~~~~~~~~~~~
(@ team dinner with colleagues and their kids in a colleague's house)
RP: Hey - this is cool stuff. This trampoline equipment rocks.
VG: Yes! My kids keep playing all the time on it. It's just like a spring. You jump and jump and jump.
RP: I like it. Do you think it tolerates my weight?
VG: Yes - it does. Occasionally, my kids insist that I get into it.
RP: I want to do it then.
VG: No problem.
Everyone else: RP, that is for kids. Not for us.
RP: I'm here to state my terms. I recognize no obligations towards anyone except to respect their freedom and be fair to them. If you feel that this is not for people of your age, you are welcome to sit out. And I take your suggestion as a bonus - but I'll not let it become an onus to my desire.
[ RP jumps and enjoys himself with the kids a lot jumping and dancing. Slowly, one after the other, the colleagues follow and play on the trampoline pad ]

~~~~~~~~~~~~~~~~~~~~~~~Scene-7~~~~~~~~~~~~~~~~~~~~~~
RP: AA, do you want to join me for pool?
AA: Sure! But you playing at office? I can't imagine it.
RP: Yes - I like it. But typically, all the players here are experts and can't make way for me.
AA: I'm not an expert - let's go and play it with AK.
[ AK, RP, AA reach pool table ]
AA: This game is called cut-throat.
RP: I don't want so many rules.
AA: What?
RP: I would like to cut down some of the rules.
AA: But why?
RP: Because I don't like them. I want to play the game like I want to. I don't care about rules put a few hundred years ago.
AA: But that's tradition.
RP: So what? This is my game and I am entitled to play it like I want. I respect your freedom and if you decide that you can't play with me; then please choose it to be so.
AA: OK - let's cut down some rules.
AK: [ not sure what was happening ]

~~~~~~~~~~~~~~~~~~~~~~~Scene-8~~~~~~~~~~~~~~~~~~~~~~
SV: MT, that dessert is so good - why don't you have it?
MT: but....
RP: MT, we are here to have lunch according to our wish. We welcome others suggestions but...
MT, SV, RK: RP, we agree that you read FH in and out and you are an ardent fan of it. But, please leave it aside. That's for people in an ideal world. Come back to this real world...
RP: <సాలె గా - మొదటే ఆ పుస్తకానికి అంత hype ఇవ్వకుండా మంచి బుక్ అని చెప్తే ఒదిలిపొయెది కదా. అక్కడికేదో చిన్నప్పుడు టీకాలు వేయించుకోకపోతే పెద్దయ్యాక డాక్టర్ జాలి పడినట్లు ఎదవ బిల్డ్ అప్ ఎందుకు?> No - I'm not here to oblige others. I'm here to live like what I am. Thanks for your suggestion. I'm leaving now.
MT: Wait until we finish.
RP: N0 - pleasing you is not a part of my agenda. I got to leave now. I have work to do.
Everyone else: [ feel deceived ]

and it goes on...

Later I told them that it was all for fun only for a couple of days to show how I can be and generate fun out of it.


ఇక్కడితో ఈ బ్లాగ్ లో "ఫౌంటెన్హెడీయం" అనే అంకం సమాప్తం.

Wednesday, September 3, 2008

నా గుండె గుడిలో...

విలన్ అనే సినిమా తెలుగులొ వచ్చింది అని మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ సినిమాలో ఒక పాట నాకు బాగా నచ్చింది. విద్యాసాగర్ (ఈయన అవ్వడానికి తెలుగు వాడైనా అవకాశాలు లేక తమిళ్, మళయాళం రంగాలలో ఉన్నత స్థాయిని చేరుకున్నాడు) చాలా అద్భుతమైన బాణీని అందించాడు. దానికి భువనచంద్ర తనదైన రీతిలో చక్కటి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట విన్న వెంటనే నేను అన్నాను - ఇది భువనచంద్ర వ్రాసి ఉండాలి అని!

పాట ప్రతి వాక్యంలోనూ ఒక విషయాన్ని చూపించి, దానికి అతిముఖ్యం ఐన మరొక రెండు విషయాలని చూపించి - "మొదటిది నేనైతే, ఈ రెండింటిలో నువ్వు ఏమిటి?" అని ప్రేయసీప్రియులు ఒకరినొకరు అడగటం ముచ్చటగా ఉంటుంది. నిజమైన భార్యాభర్తలు ఇలాగే ఉండాలేమో అనిపిస్తుంది!

నా గుండె గుడిలో నువు శిలవా? దేవతవా?

శిల లేకపోతే అది గుడే కాదు. అలాగని ఆ శిలలో అందరూ చూసేది దేవతని - అది ఆ శిలకి ఆత్మ. అందుకే ప్రతిష్ఠాపన/ఆవాహన అనే కార్యక్రమం చేసేది. మన హీరో ఏదీ తేల్చుకోలేక అమాయకంగా అడుగుతున్నాడు :)

నా వలపు బడిలో నువు గురువా శిష్యుడివా?

వలపు అనేది నిజంగా ఒక బడే! ఇద్దరు మాత్రమే ఉండే బడి. ఆడపిల్ల గురించి మగవాడికీ, మగవాడి గురించి ఆడపిల్లకీ ఎక్కువ తెలియకపోవచ్చు. పైగా ఇద్దరికీ కొత్తే :) ఇది సైన్సు, మాథ్సు కాదు ఇతరులు వచ్చి లెసన్స్ తీసుకోవడానికి. అందుకే ఇద్దరిలోనూ గురువూ/గుర్విణీ, శిష్యుడు/శిష్యురాలూ ఉంటారు.

నీ పెదవితడిలో నే ముద్దునా మధురిమనా?

ముద్దు గురించి చిన్నపిల్లాణ్ణి నేను చెప్తే ఏం బాగుంటుంది? పైగా అనుభవం నిల్ ఆయే! కానీ ఏదో "వేటూరి అభిమానికి ముద్దు గురించి కూడా తెలియదు అట", అంటే ఆయన మనసు కలత చెందుతుంది అని రెండు ముక్కలు చెప్తున్నాను :) ఒక చిన్న పాపను చూశాము. కళ్ళల్లో కల్మషం లేకుండా, పాలబుగ్గలతో, బోసి నవ్వులతో ఉంది. ఆ పాపను గట్టిగా ముద్దు పెట్టుకున్నాము అనుకోండి. ఆ ముద్దు వలన మన కడుపు నిండదు. కానీ మనసు నిండుతుంది. ఆ క్షణంలో మనసులో ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. అది వర్ణించలేము కానీ - అతిపవిత్రమైన, నిర్మలమైన నీటివాగులో నీళ్ళు దోసిట్లో నింపుకుని పొడిగొంతులో పోసుకుంటే ఆ భావం ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది అని నా అభిప్రాయం. రొమాంటిక్ టచ్ పోయింది - దిశపాయింట్ చేసావు అనుకుంటున్నారా? ఐతే ఇంకో టచ్!

"ఇచ్చిన కొద్దీ ముచ్చట పుట్టే లక్షణముందే ఈ ముద్దులో" అని మన సిరివెన్నెల ఎప్పుడో చెప్పారు. అలాగే "సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ" అని ముద్దు పెట్టుకోవడాన్ని వేటూరి చెప్పారు. వారి ముందు నేనెంత?

నే విరహమైతే నువు రతివా కోరికవా?

విరహమనేది ఒక తీయని అనుభూతి. కోరుకున్నది దొరకదు, కానీ దొరుకుతుంది అని ఆశ. వెరసి విరిహం. ఈ రెండింటిలో మొదటిది (దొర్కకపోవడం) లేకపోతే అది కలయిక అయిపోతుంది. రెండవది (ఆశ) లేకపోతే అది అది వైరాగ్యం ఐపోతుంది. ఈ రెండూ ఉన్నదే విరహమై మనసులో తీయని బాధ నింపుతుంది. మీకు "బాధ తీయగా ఉండటమేమిటి", అనిపించింది అనుకోండి; నాకు మిమ్మల్ని చూసి బాధపడాలో, జాలి పడాలో అర్థం కాదు.

ఇంతకీ రతికి ఉన్న గుణం - కోరిక కలిగించడం. కోరిక అనేది abstract ఐతే రతి దానికి ప్రతిరూపం.అవి విడదీయలేనివి.

నే పాపనైతే నువు ఒడివా ఊయలవా?

చంటిపాపల్ని వాళ్ళ అమ్మ ఒళ్ళో ఊయలనూపడం చూశారా? పాపలకి మనశ్శాంతిగా నిదుర పడుతుంది. అది "అమ్మ ఒళ్ళో ఉన్నాం", అనే ధీమా; "ఉయ్యాలూగుతున్నాము", అనే సరదా. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఆ చక్కని నిద్ర చేరదు!

నే విందునైతే, నువు రుచివా ఆకలివా?

రుచి చూడాలనే ఆకలి (ఇది వేరే వెర్షన్ :P) పుడుతుంది. ఆకలి ఉంటేనే రుచి తెలుస్తుంది. ఈ రెండింటిలో ఏది తక్కువైనా అక్కడ విషయం నిల్ :)

నే భాషనైతే, నువు స్వరమా అక్షరమా?

కాళిదాసు "వాగర్థావివ సంపృక్తౌ" అని చెప్పినట్టు ఉంది కదా? భాషకి లిపి, మాట చాలా ముఖ్యమైనవి. ఇవి ఙాపకశక్తి, అనుభూతి కి చిహ్నాలు. మనకి ఒక చక్కని విషయం జరిగింది అనుకోండి. అది చాలా రోజులు గుర్తుండిపోవాలి అనుకుంటాము. ఆ అనుభూతి మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాము. అలాగే మాట ఒక నిముషం మాత్రమే ఉంటుంది. కానీ అక్షరం ఎప్పటికీ ఉండిపోతుంది.

నే తోటనైతే, ఆమనివా కోకిలవా?

తోటకి అందం పచ్చని చెట్లు, కోకిల స్వరాలు. మన నగరాల్లో రెండూ కరువే అనుకోండి. (నేను పల్లెటూరిని కనీసం కొన్నాళ్ళు అనుభవించాను కాబట్టి చెప్తున్నాను.) పచ్చని చెట్లు లేనిదే కోకిలకి పాడాలనే మూడ్ రాదు. ఆమని తోటలూ, కోకిల పాటలూ విననిదే మనకు (పోనీ నాలాంటి మినీ-కవులకు) మూడ్ రాదు :)

మొత్తానికి ఈ పాట ఒక చక్కని భావంతో నిండి ఉంది. భువనచంద్ర మీద నాకున్న నమ్మకాన్నీ, అభిమానాన్నీ రెట్టింపు చేసింది. గతంలో "కీరవాణి రాగంలో", "పికాసో చిత్రమా" (స్వయమ్వరం), "సుర్యాకిరీటమే" (ప్రేమించుకుందాం రా) వంటి పాటలతో నన్ను మైమరిపించిన భువనచంద్ర ఇంకా చాలా అద్భుతమైన పాటల్ని రాయాలని కోరుకుంటున్నాను.

మొత్తం పాట లిరిక్:

నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా?
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా?
నీ కనుల వడిలో నే కలనా కాటుకనా?
నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా?
నీ సొగసు పొగడ నే కవినా కల్పననా?

నే బిడియపడితే నువ్వు గిలివా చెక్కిలివా?
నే విరహమైతే నువ్వు రతివా కోరికవా?
నే పాపనైతే నువ్వు వొడివా ఊయలవా?
నే నిదురనైతే నువ్వు కలవా కౌగిలివా?
నే హృదయమైతే ఊపిరివా సవ్వడివా?

నే గగనమైతే వేసవివా వెన్నెలవా?
నే నదిని ఐతే నువ్వు అలవా అలజడివా?
నే విందునైతే నువ్వు రుచివా ఆకలివా?
నే భాషనైతే నువ్వు స్వరమా అక్షరమా?
నే పాటనైతే నువ్వు శృతివా పల్లవివా?

నే తోటనైతే ఆమనివా కొయిలవా?
నే జంటకొస్తే నువ్వు ఋషివా మదనుడివా?
నే ఎదుట పడితే పిలిచేవా వలచేవా?
నిను నే పిలువకుంటే అలగవా అడగవా?
నను ప్రేమించమంటే తప్పా? ఒప్పా?

త్రివిక్రమ్ పిచ్చి...

నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పెద్ద ఫ్యాన్ ని. అతను dialogue సీరియస్ గా వ్రాసిన సరదాగా వ్రాసినా అద్భుతం. ఉదాహరణకి:

ప్రేమ రెండు మనసులకు సంబంధించిన విషయం. పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం" (సంతోషం)

"యోగా కావలిస్తే నా దగ్గరకు రండి. బాగా కావలిస్తే వాడి దగ్గరకు వెళ్ళండి" (జల్సా)

.: "urgent , important ?"
అలీ: "serious". (జల్సా)

వయసైపోయిన సినిమా హీరోలు అందరూ రాజకీయనాయకులు అయిపోయినట్లు, ఫెయిల్ అయినపోయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు. (చిరునవ్వుతో)

తాజ్మహల్, చార్మినార్, నా లాంటి కుర్రాళ్ళు - చూడటానికే, కొనడానికి మీరు సరిపోరు. (నువ్వే నువ్వే)

జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్లు - వినిపించి వినిపించనట్లు, కనిపించి కనిపించనట్లు మాట్లాడుకుంటున్నారు ఎందుకు రా? (అతడు)

నీ కాపురం బాగుండాలని గోపురానికి దణ్ణం పెట్టుకుంటున్నాను. (నువ్వు నాకు నచ్చావ్)

వెంకి: అప్పు ఇచ్చి వడ్డీ ఆసించచ్చు. హెల్ప్ చేసి థాంక్స్ ఆశించకూడదు.
బ్రాహ్మి: ఇన్నాళ్ళ బట్టి పాలస్ లో ఉంటున్నాను సర్. రాజును ఇప్పుడు మొదటిసారి చూస్తున్నాను సర్. (మల్లీశ్వరి)

ఏదో తెలియని అదృశ్యశక్తి మనలని భూమిలోకి తోసేస్తోంది అని నీకు అనిపించిందా? (జల్సా) (పైన ఉన్నా లైన్స్ అన్నీ ఒక ఎత్తు ఐతే - ఈ లైన్ మరొక ఎత్తు. ఇది నిజంగా నా మనసుని తాకిన లైన్. చిన్నప్పటినుండి ఏదో మంచి జరుగుతుంది, ఏదో ఆనందం కలుగుతుంది అనుకునే కొంతమందికి అది చాలా రోజులు దక్కదు. ఎంతో కష్టపడతారు. ఏదో సాధించాలనుకుంటారు. కానీ చివరకు - అది ఏదో అయిపోతుంది. ఎందుకు ఇలాగ జరుగుతోంది? మనకే ఎందుకు ఇలాగ జరుగుతోంది. చుట్టూ అందరూ బాగున్నారు కదా? అనే ప్రశ్న వేధిస్తుంది. ఆ ఫీలింగ్ అంతటినీ - ఒక్క లైన్ లో చెప్పాడు).

ఇలాగ చెప్పుకుంటూ పొతే ఒక పుస్తకం వ్రాయచ్చు. డైలాగ్ ఎంత పెద్దది అన్నది పాయింట్ కాదు. కానీ, అది ఎంత పంచ్ ఇచ్చింది అన్నది ఇమ్పోర్తంట్!

ఇదే పిచ్చి నాకూ పట్టుకుంది :) అంటే, నన్నుinspire చేసింది. అందుకే ఈ మధ్యన క్రిస్ప్ పంచ్ లైన్స్ ఇస్తున్నాను :)

కాబ్ లో వెళ్తున్నాము. ఒక తమిళ్ కొలీగ్, ఒక హిందీ కొలీగ్ కూర్చున్నారు. ఎందుకో "ముర్గా" అనే పదం వచ్చింది. అది విని నేను కొంచం వెరైటీ గా ఫీల్ అయ్యాను. అప్పుడు అన్నాను.
Me: "I suspect there is some miscommunication here. There are two murgaa's - one Thamizh Muruga, another is Hindi murgaa."

North Indian: "What is the difference?"

Me: "Thamizh murugaa is whom people pray. Hindi murgaa is what becomes prey".

తమిలులందరూ ఒక్క సారి నవ్వేసారు. హిందీ వాడికి అర్థం కాలేదు నా పంచ్ డైలాగ్.

అలాగే ఈ మధ్యన కొంచం ప్రాస కూడా పెంచాను. పంచ్ కోసం.

"వాడి సుడి సుమీత్ మిక్సీ లాగా తిరుగుతోంది రా"

"
ఇల్లనే equation లో waste కంటే variable గానూ, constant కంటే coefficient గానూ ఉండటం మంచిది" ( dialogue విన్న audience లో ఒకరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి :P)

"
సామాన్యుడి సరదా చమ్మకాయ అంత ఉంటే దుర్మార్గుడి దూల దోసకాయ అంత ఉంటుంది"

"
రాముడు, కృష్ణుడు, రామకృష్ణుడు, వివేకానందుడు - వీళ్ళు నాకు స్ఫూర్తి. నవల్లలో నాయకులూ, సినిమాలలో హీరోలు వినడానికి, చూడటానికి బాగుంటారు."

"
చాలా మంది అమాయకులు రుచి ఆహారంలో ఉంటుంది అనుకుంటారు. అది ఆకలిలో ఉంటుంది అని తెలియక. అలాగే ఆనందం అనేది అనుభవించడంలో లేదు. ఆరాధించడంలో ఉంది."

"విజయవాడ స్టేషన్ లో ట్రైన్లు, విశాఖపట్నం సముద్రంలో అలలు, మనిషి జీవితంలో కష్టాలు - అలాగా వస్తూనే ఉంటాయి."

Monday, September 1, 2008

నవరససుమమాలికా...

మేఘసందేశం సినిమాకి చాలా నంది అవార్డ్లు, జాతీయ అవార్డు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో సంగీతం, సాహిత్యం చక్కగా ఉన్నాయి. ఈ సినిమాలో వేటూరి వ్రాసిన పాటలలో కాస్త సంస్కృతపదాలు ఎక్కువ పడటంతో, కృష్ణశాస్త్రి గారి పాటల (ఆకులో ఆకునై) పక్కన కొంచం కష్టంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఏదేమైనా రమేష్ నాయుడు గారి సంగీతం, వేటూరి గారి సాహిత్యం కలిసి రసికులకు మహదానందం కలిగిస్తాయి. వీటిలో నాకు నచ్చినది, జీవితాంతం మెచ్చుకునేది ఒక పాట ఉంది. అది "నవరస సుమ మాలికా..." అనే పాట. అందులో ఒక భావకవి ఎలాగ తన ప్రేయసిని వర్నిస్తాడో వేటూరిని చూసి తెలుసుకోవాలి సుమీ అనిపిస్తుంది.

ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే - సంస్కృత పదాల వెల్లువ! భావుకత పెల్లుబిగి ప్రవహించింది! తనకు గురుతుల్యులైన త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్యలను తలుచుకుంటూ మొదలుపెట్టాడు మహానుభావుడు. ఎంతని చెప్పను, ఏమని చెప్పను ఈ పాట గురించి.


నవరససుమమాలికా, నా జీవనాధారనవరాగమాలికా...
త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య తెలుగింటిలోన వెలిగించిన నాదసుధామయరసగీతికా

అందాలు అలలైన మందాకినీ, మందారమకరందరసవాహినీ
ఆమె చరణాలు అరుణకిరణాలు, ఆమె నయనాలు నీలగగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక దిగివచ్చెనేమ ఇల వంక!

అందాలే అలలుగా సాగే గంగాదేవి అనే పోలిక నాకు బాగా నచ్చింది. "మందారమకరంద" అనే సమాసం మరే కవి వాడినా నేను కోప్పడేవాడిని , "ఇది పోతనకే చెల్లుతుంది. దానిని ఎవరూ తిరిగి వాడటానికి అర్హులు కారు", అని. కానీ వేటూరి మొత్తం సంస్కృతంలో వ్రాసి నా నోటికి తాళం వేసేసాడు.

కృష్ణశాస్త్రి కవిత్వానికి ఏ మాత్రం తీసిపోలేదు నేను అన్నట్టుగా - తన కవిత్వంతో ప్రకృతిని ప్రతిష్టిమ్పజేసాడు. నది-అలలు, పువ్వు - తేనె, సూర్యుడు - కిరణాలు, గగనం - నీలం ఇలాగ ప్రకృతి సౌందర్యాన్ని వర్నించుకుంటూ వచ్చాడు. అయ్యింది కదా - జవ్వననికి ప్రాస ఏమి పెడతాడురా అనుకునే సమయానికి - బహుశా, "నీకు అంత అవకాశం ఇవ్వను. నా స్థాయి వేరే ఉంది", అన్నట్టు: "నైరుతి ఋతుపవనాలను", గుర్తు చేసాడు (చల్లని గాలులు). ఇక జాబిల్లిని ఎందుకు వదుల్తాను అంటూ - చిరునవ్వుతోనే విసిరాడు చిరప్రయోగం (ఎప్పటినుండో ఉన్న, ఎప్పటికీ ఉండిపోయే ప్రయోగం).

శృంగారరసరాజకల్లోలినీ, కార్తీకపూర్ణేందు కల్హారినీ
ఆమె అధరాలు ప్రణయమధురాలు, ఆమె చలనాలు శిల్పగమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు మిగిలిన సుందరసుఖతరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక పిలుపైన లేని ప్రియలేఖ!

ఇక్కడ మళ్ళీ సంస్కృతంలో చెడుగుడు. "శృంగారరసం ప్రవహించే మహానది", "కార్తీకపున్నమిలో కలువ", అంటూ తన ప్రియురాలిని ఉబ్బితబ్బిబ్బు చేసేసాడు. ఆమె పెదవులు మొహంతో నిండిన మధురాలు! ఆమె దర్శనం దొరికిన ప్రతిక్షణం అతని జన్మలో గుర్తుపెట్టుకోదగినంత గోప్పదిట! కనుచూపుతోనే ప్రేమలేఖలు వ్రాసేసి రాయబారాలు నడిపెస్తోందిట.

ఇలాటి పాట విన్న అమ్మాయి (తెలుగు పిల్ల ఐతే అనుకోండి) ఎవరైనా అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని నా నమ్మకం. అలాంటి పాటలు వేటూరి ఒకటో రెండో వ్రాయలేదు. అనేకానేకాలు వ్రాసాడు.

హడావుడిలో పడి రమేష్ నాయుడు గారిని మర్చిపోతే సరస్వతీ దేవి నన్ను క్షమించదు. (సరస్వతీ దేవి ప్రస్తావన తీసుకురావడానికి ఒక కారణం ఉంది - అది మళ్ళీ టప లో చెప్తాను). రమేష్ నాయుడు గారి సంగీతం లంగా-వోణీ వేసుకున్నతెలుగింటి పిల్లని గుర్తు చేస్తుంది!

Saturday, August 30, 2008

పొలాల అమావాస్య

శ్రావణ బహుళ అమావాస్య (అంటే దసరా ముందు వచ్చే అమావాస్య అన్నమాట) నాడు పోలాల అమావాస్య అంటారు. పండగపూట కందమొక్కకు పూజ చేస్తారు. పూజలో భాగంగా కథ చెప్తారు. ఈ రోజు కథ విన్నదాన్ని బట్టి నాకు అర్థమైనది ఏమిటి అంటే - ఇది పెళ్ళయిన ఆడవాళ్ళు పిల్లల (శ్రేయస్సు) కోసం చేస్తారు అని. కథ క్లుప్తం గా చెప్పాలి అంటే:

"
ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో, ఏదో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్య రోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని. బాధ భరించలేక ఎదవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి ఉన్చేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అది చూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి - "ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతారు. దానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుంది. దానికి వారు - "మేమే ఆర్చేవారము - తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏట తప్పకుండా పోలాల అమావాస్య జరుపుకుంటుంది."

ఈ కథ విన్న తరువాత చెప్పినవారు: "పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, పియ్యతో అలుకు", అంటారు. వినడానికి కొంచం ఎబ్బెట్టుగా అనిపించచ్చు కానీ - అది పిల్లల మీద ప్రేమకు చిహ్నం. ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు, విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.

మా అమ్మ పుట్టినరోజు పొలాల అమావాస్య నాడే. ఎప్పటినుండో తప్పకుండా చేసుకుంటోంది ఈ పూజ!

Thursday, August 7, 2008

నాకు స్ఫూర్తినిచ్చే పాట!


ఇది వ్రాసింది నేను అని చెప్పే అర్హత నాకు లేదు. అవి నా జీవితంలో అతి పెద్ద దెబ్బ తగిలిన రోజులు. బ్రతుకులో బాధ్యతలు తప్పితే కోరికలు/ఆశయాలు కనబడని రోజులు. మౌంటైన్ వ్యూ లో ఉన్నాను. ఒక ప్రభాతవేళ నాలో ఏదో తెలియని శక్తి ప్రవేశించి వ్రాసింది ఈ పాటని, అని నా నమ్మకం.

ఈ పాటలో వ్యాకరణదోషాలు ఉండచ్చు - అప్పటికే నేను సంసృతంలో మాట్లాడి ఒక ఐదు ఏళ్ళు దాటింది. కానీ ఆ భావం నేను అనుభవించగలుగుతున్నాను...ఒక్క సారిగా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను. కష్టానికి, సుఖానికి తేడా తెలియదు. నాలో ఉన్నా మనిషి చచ్చిపోయి, దైవం మిగుల్తుంది....శివోహం అనిపిస్తుంది. అది అనుభవించాలి!

మానవరూపేశివోహం, వర్ణధారాధృతోహం
అర్ణవమథనాసమయే గరళం పీత్వాపి సజీవోహం ||


మాయామృత్తికాయాముత్పన్న, వాంఛాలతాః దగ్ధ్వా
కాయం నిత్యమాఛ్ఛేదయామి, భస్మితలిప్సాః ధృత్వా
హృదయేజాతభావసందోహం, కఠిన్యేణ హత్వా
మానసరుద్రభూమ్యాం చరామి నిత్యం, మామేవ జీత్వా
నిత్యాహారం కపాలే సత్యం, స్థితప్రఙా మే వృషభవాహనం
సర్వేషామపి బంధువత్ అహం, నాస్తి మే కోపి మిత్రం ||


విధిదత్తం మహోత్తరం కార్యం, మానసకర్ణైః శ్రుత్వా,
నిత్యం తాన్ హి ధారామి కాయే , విషసర్పాః కృత్వా
అనుభవనామజటాం తు మూర్ధ్నే, గాఢతరేణ బధ్ధ్వా
నిరతం సమ్నియమ్య తిష్టామి, గాత్రగంగాం గృహీత్వా
సత్యేందుర్మే నిత్యభూషణం, లజ్జా మహ్యం భవతి అంబరం
అర్థాంగీ తు విధ్యుక్త ధర్మం, ఙానం భవతి త్రినేత్రం ||

మామూలు మాటల్లో చెప్పాలంటే:

మానవుడి రూపంలో ఉన్నా శివుణ్ణి నేను. అక్షరాల ధారను మోస్తున్నాను (శివుని ఢమరుకంలోనుండి శబ్దాలు వెలువడ్డాయి). సముద్రాన్ని మథనం చేసినప్పుడు పుట్టిన విషం తాగినా ఇంకా బ్రతికే ఉన్నాను.

మాయ అనే మట్టిలో (పాంచభౌతిక ప్రపంచం మాయ - అంటా మట్టే) పుట్టిన కోరిక అనే తీగలను నేను తగలబెట్టి ఆ బూడిదతో నన్ను నేను అలంకరించుకుంటాను. మనసులో పుట్టిన భావాల సమూహాన్ని నేను నిర్దాక్షణ్యంగా చంపి, ఆ స్మశానంలో, నన్ను (నా భావాలను) నేను జయించి తిరుగుతూ ఉంటాను. నాకు నిజమే ఆహారం. స్థితప్రఙ నాకున్న వృషభవాహనం (బలానికి, నిబ్బరానికి చిహ్నం). అందరికీ నేను బంధువునే. కానీ నాకు ఎవరూ మిత్రులు కారు. (నేను ఎవరడిగినా సాయం చేద్దామనే చూస్తాను. కానీ, నేను ఎవరి దగ్గరనుండి ఏది ఆశించను).

నాకు విధి ఒక కర్తవ్యాన్ని ఇచ్చింది. అది నా మనసు గ్రహించింది. ఆ కర్తవ్యాన్నే విషసర్పాలుగా ధరిస్తున్నాను. ఎంత కష్టమైనా, ప్రమాదమైనా అవే నాకు అలంకారం. అనుభవం అనే జడలో గంగలాగా ప్రవహిస్తున్న నా అంగాలను బలంగా బంధించి ఆ సంనియమంలోనే నేను సంతృప్తిని పొందుతాను. నాకు సత్యమే చంద్రుడివంటి భూషణం, లజ్జ నిజమైన కట్టుబట్ట, విధి నిర్దేశించిన బాధ్యతే భార్య (భరించవలసినది), ఙానం మూడో కన్ను.

నా జీవితంలో నన్ను అన్నిటికంటే ప్రభావితం చేసిన పుస్తకం మనిషి వ్రాసింది కాదు. మాధవుడు చెప్పింది, మహర్షి వ్రాసింది! అది భగవద్గీత. భగవద్గీతను అందరి కంటే యథాతథంగా అనుసరించేది - విష్ణువుకి అతిశ్రేష్ఠుడైన  భక్తుడు, మిత్రుడు - శివుడు. ఆ శివుడికి నేను చిన్నప్పటినుండి కింకరుణ్ని. నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసినవాల్లల్లో మొదటివాడు కూడా శివుడే. ఆయనకు మనసా, శిరసా అనేకకోటి నమస్కారాలు చేస్తూ నా చేతులమీద ఆయన వ్రాయించుకున్న పాట తిరిగి ఆయనకే అంకితం చేస్తున్నాను.

Wednesday, July 23, 2008

KMJ - kaLLu moosi jella

ee madhyana maa thammuDu naaku ee wonderful concept ni teliyajeppaaDu. idi universal gaa apply ayye concept anipinchindi.

asalu concept emiti ante - okaDunnaaDu. vaaDiki asalu vishayam teliyadu. chuTToo bOLLanta mandi unnaaru. vaaLLandarikee vishayam koncham koncham telusunu - complete gaa teliyadu. aite andaroo kalisi vaaDini effect chestaaru. evari valla aa effect vaaDiki vacchindi anEdi maatram vaaDiki teliyadu.

ee concept asalu enduku discuss chesukovaalisi vacchindi ante: oka saari maa thammuDitO annaanu. ee arranged marriages lo asalu vishayam enta varaku undi raa ani. ante "light raa - adantaa kallu moosi jella", annaaDu. anTE first naaku artham kaaledu. nemmadigaa cheppaaDu. peLLikoDuku/peLLikooturu talliki, tanDriki koncham vishayam telusu. ika vadhoovarulaki emi teliyadu. endulo udyogam, enta chadivaavu etc., tappite maremi aatte teliyadu - mukhyam negatives/positives/mismatches annee kanabaDavu. andaroo talakO maaTa cheppi - ayyindihO anipistaaru. akkaDanunDi start - samsaaram oka chadarangam.

sare - idi baane undi. asalu "kaLLu moosi jella" ane idiom elaaga puTTindi? oka saari maa thammuDu, vaaDi friends carrom board aaDutunnaaru. intalO maa poruginTi kurraaDu okaDu (bhale churukainavaaDu) vacchi - carrom board aaDaneekunDaa disturb chEstunnaaDu. appuDu veeLLaki chiraaku vacchi - carrom board khaalee cheyyinchi - center lo veeDini koorchOpeTTaaru (seenu vytla cinema lo laagaa). oka aaTa aaDukundaam annaaru. sare sare ani egiraaDu. appuDu vaaDi kaLLu muyyaDam evaDo jella koTTaDam - evaru koTTaaru ani aDagaDam. Initial gaa vaaDoo enjoy chESaaDu. nemmadigaa vaaDiki baadha telisindi. adigO - akkaDa modalaindi ee "kaLLu moosi jella".

"kaLLu moosi jella" aaTa aaDani vaaDunDaDu. evaDaite communication sariggaa cheyyaDO vaaDu ee aaTalO bhaagasvaamE. vishayam chepparu - chuTToo EdO jarigipOtundi. manaku artham kaadu - evaroo chepparu. consequence - KMJ!

asalu andarikanTE goppa KMJ aaTagaaDu evarO cheppukOnDi? inkevaru - The Almighty. edurungaa vacchi emi cheppaDu. em chestaaDO teliyadu. enduku chEstaaDO artham kaadu. oka rakamaina feeling vastundi. adE KMJ. ika svayam-KMJ chesukunEvaaLLu unnaaru. vaaLLu vaaLLanE artham chEsukOru - vaaLLanu manam kaapaaDalEmu.

KMJ ekkaDa jaragadu - school lo, college lo, office lo, samsaaram lo - akkaDabaDitE akkaDa - taTTukOlEmu anukO. adi sangati. jai KMJ.