నేను మళ్ళీ విద్యార్ధిని అయ్యాను కదా. కాబట్టి, మళ్ళీ విపరీతమైన ఒత్తిడి, ఉరుకులు, పరుగులు. ఈ సమయంలో నన్ను కొందరు అడిగే ప్రశ్నలకు కొంత చిత్రమైన సమాధానాలు చెప్తున్నాను. అలాంటివి కొన్ని.
స్నే: ఏంటి సందీప్! సెటిల్ అయ్యావా? అన్నీ తెచ్చుకున్నవా?
నే: ఏమోనమ్మా! ఇంకా ఇల్లు దొరకలేదు. బండెడు సామాను. మా అమ్మ ఇచ్చిన సారె తెచ్చుకున్నాను: రెండు వారాల బట్టలు, cooker, గిన్నెలు, గరిటెలు, దేవుడి ప్రతిమలు, స్వీటు, హాటు తెచ్చుకున్నాను. మరి అవన్నీ సరిపోవాలా ఇంట్లో?
స్నే: సందీప్! ఎలాగుంది స్టూడెంట్ లైఫ్?
నే: త్రిపాత్రాభినయం చేస్తున్నట్టుగా ఉంది.
స్నే: అదేమిటి?
నే: పొద్దున్నే లేచి అంట్లు తోముకుని టిఫిన్ వండాల్సింది నేనే, క్యారీయర్ సర్దుకోవలసింది నేనే, స్కూల్ కి వెళ్ళాల్సింది నేనే, డబ్బు సంపాదిన్చాల్సింది నేనే. మొత్తానికి నేనే పెళ్ళాము, నేనే మొగుడు, నేనే పిల్లల్ని. గొప్ప వెరైటీ గా ఉంది. దీన్ని మొబైల్ సంసారం అనచ్చునేమో!
Thursday, August 13, 2009
Wednesday, August 12, 2009
కిట్టు కథలు - మొగుడ్స్ పెళ్లామ్స్
ఈ రోజు ఒక అనుకోని సంఘటనలో నాకు మా చెల్లి కి ఒక టాపిక్ దొరికింది చర్చించుకోవడానికి. అది ఏమిటి అంటే ఒక మగవాడు, ఒక ఆడది ప్రేమించడం లో తేడ ఏమిటి. ఇంకా ఆ మాటకీ వస్తే మొగుడు, పెళ్ళాం ఒకరిని ఒకరు ప్రేమించడం లో తేడ ఏమిటి అన్నది. మా చెల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాళ్ల బుజ్జి పాపాయి కోసం ఉద్యోగం మానేసింది. కొన్నాళ్ళు ఇండియా లో ఉంది, ఇప్పుడు యు.ఎస్ లో ఉంది.
అంటే మరి మా చెల్లి గురించి అంతా చెప్పి నా గురించి చెప్పుకోకపోతే మన ఫాన్స్ ఫీల్ అవుతారు కాబట్టి, ఏవో నాలుగు ముక్కలు. నాకు అమ్మాయిల గురించి అక్షరం ముక్క కూడా తెలియదు అని ఆంధ్రదేశం లో మంచి టాక్ ఉంది. నా జీవితంలో నాకు రాఖీలు కట్టినవాళ్ళ కంటే వీడి మెడకి ఉరేసేద్దాం అనుకున్నా ఆడవాళ్లే ఎక్కువేమో :) అది అన్నమాట, విన్నమాట, ఉన్నమాట.
ఇంతకీ మా చర్చ, ఈ టప లో:
నేను: మీ ఆడవాళ్ళు ప్రేమిస్తారు కానీ ఏది ఒదులుకోవదానికి సిద్ధపడరు. (కంగారు పడకండి, ఏదో వెటకారానికి).
తను: అసలు మీ మగవాళ్ళ ప్రేమ అంటేనే నాకు ఎప్పటికీ విచిత్రం. నాది "unconditional love" అంటారు. కాని నాకు తగినట్టు నడుచుకోవాలి అంటారు. ఏది నమ్మాలో అర్థం కాదు.
నేను: అబ్బా, మరి మీ ఆడవాల్లల్లో అలాగా ఎవరూ లేరా? నువ్వు నా కోసం మారాలి అనేవాళ్ళు.
తను: ఈ విషయంలో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఆడవాళ్ళ మాటకీ పెద్దగా విలువ లేదు. వాళ్ళు పెట్టిన కండిషన్స్ ని వాళ్ళే గుర్తు ఉంచుకోరు, పట్టుబట్టరు. ఉదాహరణకి, నువ్వు ఈ రోజునుండి రాత్రి వంట నువ్వే చేయ్యై అంది అనుకో, మగవాడు "సరే, నీ ఇష్టం", అంటే చాలు, ఒక్క రోజు కూడా వంట చెయ్యక్కరలేదు. "ఆహా, నా మొగుడు కాబట్టి ఒప్పుకున్నాడు", అని మురిసిపోయే వాళ్ళే వంట చేసేస్తారు. అనుకున్నది జరిగిన జరగకపోయినా భర్తా adjust అవుతాడు అనే కాన్ఫిడెన్స్/సెక్యూరిటీ చాలు.
నేను: మరి అబ్బాయిలకో?
తను: అబ్బాయికి మాట ఇస్తే కట్టుబడి తీరాలి, పరిస్తితులు మారినా సరే. ఇప్పుడు చెప్పు. ఎవరిదీ unconditional love? అమ్మాయిలూ కోరుకునేవి చాలా చాల చిన్న చిన్న సిల్లీ విషయాలు: ఒక బైక్ డ్రైవ్ చెయ్యాలనో, ఒక డ్రెస్ కొనుక్కోవలనో. major decisions అన్నీ భర్త తీసుకుంటాడు అనే expect చేస్తారు. చాలా లేట్ గా తెలుసుకునే విషయం ఏమిటి అంటే, ఆ decisions వల్ల రోజు వల్లే adjust అవ్వాల్సివస్తుంది అని. అదే ఆడవాళ్ళూ కోరుకునే adjustments ఏడాదికి ఒక్కసారి వచ్చినా ఆశ్చర్యమే.
నేను: adjustments అంటే?
తను: మా పేరెంట్స్ తో బాగా బెహవె చెయ్యాలి అన్నాను అనుకో. ఎన్ని సార్లు మరి మేము మా పేరెంట్స్ ఇంటికి వెళ్తాము. పుష్కరంలో వేళ్ళ మీద లేక్కపెట్టచ్చు. అదే అబ్బాయి ఐతే? నువ్వు చదువుకోవడానికి వీల్లేదు అంటే అది జీవితాంతం ఉండిపోయే లోటు, నువ్వు ఉద్యోగం చెయ్యడానికి వీల్లేదు అంటే ప్రతిరోజూ తెలిసే లోటు, మా పేరెంట్స్ తో బాగా behave చెయ్యాలి అంటే అది ఒక రోజుతో తీరేదా?
నేను: ఓహో, అలాగంటావా?
తను: ఇప్పుడు చెప్పు. ఎవరిది unconditional love? మగవాళ్లది మాటల్లో. ఆడవాళ్లది చేతల్లో.
నేను: ఇప్పుడు మన కిట్టు గాడు ఉన్నాడు కదా! వాడి గురించి మన చుట్టాల్లో ఆడవాళ్లల్లో మంచి టాక్ ఉంది. ఏమిటంటే, వాడు ఆడవాళ్ళని గౌరవిస్తాడు అని. ఆడవాళ్ళ మాటలకూ విలువ ఇస్తాడు అని.
తను: అవును, నేను కూడా ఒప్పుకుంటాను.
నేను: అదే టైం లో మగవాళ్ళల్లో ఇంకో టాక్ ఉంది. వీడొక వెర్రి వెంగలప్ప, పెళ్ళానికి లొంగిపోతాడు అని. నీ అభిప్రాయం వినగోరుతున్నాను.
తను: ఈ లొంగిపోవడం కాన్సెప్ట్ నాకు చాలా వింతగా ఉంటుంది. అసలు "ఈ అమ్మాయి లొంగిపోయింది మొగుడికి", అని ఎప్పుడైనా విన్నావా?
నేను: లేదు.
తను: మొగుడు పెళ్ళాం మాట వింటే వెన్నుపూస లేనట్టు. ఈ లెక్కన అసలు ఆడవాళ్లకు వెన్నుపూస అంటూ దేవుడు పెట్టలేదు ఏమో? అసలు భార్య మాట వినడం వలన మగవాడికి వచ్చే నష్టం ఏమి లేదు, వాడికంటూ బుర్ర ఉంటే. ఆ బుర్ర కిట్టు అన్నయ్యకి ఉంది.
నేను: (ఓహో, మాకు లేదు అన్నమాట.) ఇంకో సందేహం చెల్లమ్మా. (రేడియో మామయ్య లాగా). ఏ మగడైన తన తల్లిని ఎలాగ గౌరవిస్తాడో తన భార్యను కూడా అలాగే గౌరవిస్తాడు కదా? అంటే, వారిద్దరి మధ్యన విభేదాలు రానంతవరకు.
తను: ఈ imaginary clause ఏమిటి? అది అసంభవం.
నేను: ఏది అసంభవం?
తను: అత్తాకోడళ్ళకి విభేదాలు లేకపోవడం.
నేను: పోనీ, ideal scenario లో.
తను: కొంతవరకు నిజమే. కానీ చాలా తేడాలు కూడా ఉన్నాయి.
నేను: ఏమిటో?
తను: ప్రతి కొడుక్కి తల్లి మీద gratitude ఉంటుంది. అది భార్య మీద ఉండదు.
నేను: పోనీ భార్య భర్తను తల్లిలాగా చూసుకుంటే, అప్పుడు భర్త కూడా gratitude తో ఉంటాడు గా.
తను: మరొక impossible scenario. బాగా చూసుకోవడం వేరు, తల్లి లాగా చూసుకోవడం వేరు. అసలు తల్లికి భార్యకి భయంకరమైన తేడా ఏమిటి అంటే, తల్లి కొడుకు దగ్గరనుండి ఏమి ఆశించదు. కొడుకు reciprocate చేస్తే మురిసిపోతుంది, కానీ ఆశించదు. అదే భార్య భర్త దగ్గరనుండి ఆశిస్తుంది. తల్లి కొడుకులది "give to" relationship. భార్యభార్తలది "give and take relationship".
నేను: ఓహో, నిజమే.
నేను: ఏమిటో చెల్లెమ్మ, నువ్వు చెప్తుంటే అన్నీ కరెక్ట్ గా అనిపిస్తున్నాయి. నువ్వు ఫస్ట్ నుండి ఇంతే. పెళ్ళయ్యాక మరీ బాగాను.
తను: మొత్తం క్రెడిట్ చెందాల్సింది మావారికే.
నేను: (ఎమోషన్ లో ప్రమోషన్ ఆ. ఓ. కే.) ఎందుకో?
తను: మా ఆయనా ఎంత ఎమోషనల్ గా చెప్పినా నమ్మరు. అనవసరమైన ఎమోషన్ అంత పీకి పారేసి అసలు ఇన్పుట్ తీసుకుని ప్రాసెస్ చేసి అప్పుడు deliver చేస్తారు. నేను భావిభారతభర్తలకు ఇచ్చే సందేశం కూడా అదే. Have a good sense of discretion. ఎమోషనల్ గా చెప్పింది అని ఎక్కువ వేల్యూ ఇచ్చేయ్యద్దు.
నేను: ఏమిటో చెల్లెమ్మ నీ పుణ్యమా అని ఈ రోజు చాలా జ్ఞానోదయం అయిపొయింది. బావగారిని అడిగానని చెప్పు. ఉంటా మరి.

వంశవృక్షం - ధర్మం
బాపు తీసిన "వంశవృక్షం" అనే ఒక సినిమా ఈ మధ్యన చూసాను. సినిమా లో బొత్తిగా గ్లామర్ లేదు. సినిమా మొత్తం బ్రాహ్మల democracy కనబడుతుంది.అంటే, "by the brahmins, for the brahmins, of the brahmins" అన్న మాట. ఆ సినిమా మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. నాకు మాత్రం కొంత నచ్చింది. ఎందుకు నచ్చింది? ఏమిటి నచ్చింది?
ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఇందులో characters ని పరిచయం చెయ్యాలి. సోమయాజులు ఒక కృష్ణ భక్తుడు. వాళ్ళ వంశం పేరు "బృందావనం" వారు. వాళ్ల వంశం లో అందరూ కృష్ణ భక్తులు. వాళ్ళకు రోజు అంటే పొద్దున్నే లేచి కృష్ణనామస్మరణ చేస్తూ పడుకునేవరకు కృష్ణుణ్ణి సేవించడమే. సోమయజులుకు ఒక కొడుకు ఉంటాడు. అతడికి పెళ్లి అయ్యి ఒక పిల్లాడు పుడతాడు. కానీ కొడుకు పుట్టగానే సోమయాజులు కొడుకు చనిపోతాడు. అప్పుడు అతని భార్య (జ్యోతి) వైధవ్యం స్వీకరిస్తుంది. తెల్ల బట్టలు వేసుకుంటుంది. సౌందర్యానికి సంబంధించిన ఏ విషయాన్నీ దగ్గరకు రానివ్వదు. యవ్వనం లో ఉండగా కలిగే కోరికలను చంపుకోవడానికి రాత్రుళ్ళు కేవలం మజ్జిగన్నం తింటుంది. కొడుకుని చూసుకుంటూ ఉంటుంది.
కొంత కాలానికి జ్యోతికి MA చెయ్యాలనే కోరిక కలుగుతుంది. చెప్పగానే వాళ్ళ అత్తగారు, "మా ఇంట వంట లేదమ్మా ఇలాగ. వద్దే తల్లి. అనవసరమైన కోరికలు కలుగుతాయి", అంటుంది. కానీ సోమయాజులు ఎంత ఛాందసుడైనా అమ్మాయికి ఇంట్లో ఏమి తోచట్లేదు అని నాలుగు మంచి ముక్కలు చెప్పి చదువుకోవడానికి తన శిష్యుడు (కాంతా రావు, కాలేజీ ప్రిన్సిపాల్) దగ్గరకు పంపిస్తాడు. ప్రతి రోజు లాంచి లో పట్నం వెళ్లి కాంతారావు తమ్ముడు (అనిల్ కపూర్) దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. అనిల్కపూర్ జ్యోతి కి ఆసలు కల్పిస్తాడు, "నాకు నువ్వంటే ఇష్టం. ఈ వైధవ్యం నీకు వద్దు. నన్ను పెళ్లి చేసుకో. మీ నాన్న, మగ పిల్లల కోసం, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నువ్వు భర్త మరణించాక వేరే పెళ్లి చేసుకుంటే వచ్చిన నష్టం ఏమిటి?", అని. జ్యోతి బాగా తటపటాయించి చివరికి ఒకర రోజు కాలేజీ కి వెళ్ళినట్టే వెళ్లి అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది.
కొన్నాళ్ళకు ఆమెకు పుత్రుడి మీద ఉన్న మమకారం వాడిని తనతో తీసుకేల్దాము అనే ఆశ కలిగిస్తుంది. వెళ్లి సోమయజులును అడుగుతుంది. అప్పుడు వారిద్దరి మధ్యన సంభాషణ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.
(సో: సోమయాజులు, జో: జ్యోతి).
సో: రా అమ్మ. ఈవేళ మా అబ్బాయి తద్దినం. మీ అత్తగారు నీకు ప్రసాదం పెడుతుంది, తిను.
జ్యో: మామగారు, నాకు నా బిడ్డను తీసుకెళ్ళాలి అని ఉంది.
సో: దాని గురించి మాట్లాడుకుందాం. ముందు మా వాడికి నమస్కారం చేసుకుని భోజనం చేయి.
(భోజనం తరువాత జ్యోతి తండ్రి వచ్చి తనను బాగా తిడతాడు.).
జ్యో: నాన్న, నన్ను ఏమైనా అనే హక్కు నా మావగారికి ఉందేమో కానీ, నీకు కాదు. అమ్మ బ్రతికి ఉండగానే మగపిల్లల కోసం నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు.
(సోమయాజులు జ్యోతి తండ్రికి నచ్చ జెప్పి పంపిస్తాడు. జ్యోతిని వేరే గదిలోకి తీసుకొచ్చి మాట్లాడతాడు).
సో: అమ్మ, నీకు మళ్ళీ పెళ్లి అయ్యింది. మళ్ళీ పిల్లలు కలుగుతారు. మాకు ఈ వయస్సులో కావలసిన కొడుకు ప్రేమ పోయింది. అనాథలమయ్యిపొయాము. మీ బిడ్డే మా ఊపిరి తల్లి. వాడిలోనే మా బిడ్డను చూసుకుంటున్నాము. దయచేసి వాడిని మాకు వదిలెయ్యి. నీకు కావలసినప్పుడు వచ్చి చూసుకో.
జ్యో: మామగారు. మీరు కర్మ గురించి అన్ని సిద్ధాంతాలు చెప్తారు. మనం గోదావరికి ఎంత పెద్ద బాణ పట్టికేల్తే అంతే నీరు వస్తుంది. ఇదే మీకు ప్రాప్తం. మీ కోసం నేను త్యాగం చెయ్యలేను. నాకు నా సంతోషం ముఖ్యం.
సో: అది ధర్మం కాదు తల్లి.
జ్యో: మామగారు, ధర్మం విషయంలో మీకు నాకు చుక్కెదురు. మనిషి ధర్మం కోసం నడవాలి అని మీరు అంటారు. ధర్మం మనిషి కోసం నడవాలి అని నేను అంటాను.
సో: (నివ్వేరేపోతూ కోపాన్ని శాంతంగా మార్చుకుంటూ విరక్తితో కూడిన చిరునవ్వుతో) సరే, ధర్మం విషయం పక్కన పెడదాము. సాధకబాధకాలే మాట్లాడుకుందాము. వీడు నీకూ, మా అబ్బాయికి పుట్టాడు. నువ్వు వీడిని తీసుకెళ్ళి నీ దగ్గర పెంచిన తరువాత, తన తండ్రి వేరే ఉన్నాడు అని, తన బంధువులు వేరే వున్నారు అని తెలిసి వాడు నిన్ను ద్వేషిస్తే, నన్ను నా బంధువుల దగ్గరనుండి ఎందుకు దూరం చేసావు అని నిలదీస్తే. ఈ ప్రేమ, ఆస్తి అనుభవించే హక్కును నాకు ఎందుకు దూరం చేసావు అని అడిగితే?
ఈ క్షణం లో జ్యోతికి ఏం చెప్పాలో పాలుపోదు. నా కొడుకు అలాగా చెయ్యడు అని ధైర్యం గా చెప్పలేదు. ఎందుకంటే, ప్రేమించే వాళ్లు దూరమయ్యే కొద్దీ వాళ్ల మీద ప్రేమ పెరుగుతుంది. దాని కోసం ఏ బంధాన్నైన, ఇష్టాన్నైనా వదులుకోవాలి అనిపిస్తుంది. అది తనకు కూడా తెలుసును. అలాగని, బిడ్డను వదిలెయ్యలేదు. వచ్చి చూసుకుని వెళ్ళిపోలేదు. భారమైన హృదయంతో వెళ్ళిపోతుంది.
ఒక ఏడాది తరువాత తన బిడ్డను చూసుకున్న కళ్ళల్లో వచ్చే ఆనందబాష్పాలు, బిడ్డ కోసం తల్లడిల్లిపోయే తల్లి వేదన, వాడిని మళ్ళీ తన కళ్ళారా చూసుకోవడం వీలు కాదేమో అనే దుఃఖం, అటు భర్త, ఇటు కొడుకు మధ్యలో నలిగిపోతూ ఉన్న జ్యోతిని చూసి కరుగని మనసు ఉండదేమో. చివరకు వాడి గురించే పరితపిస్తూన్న తనకు ఆఖరు ఘడియల్లో వాడి దర్శనం దొరికినప్పుడు ఆమె ముఖంలో కలిగే భావాలను బాపు తెరకెక్కించిన విధం నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తెప్పించింది.
అసలు ఈ సినిమాలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి:
ఈ సినిమా లో నేను మరిచిపోలేని డైలాగ్ ఒకటి ఉంది. కోడలు రాత్రైనా తిరిగి రాలేదు అని సోమయాజులు, వంట మనిషి (డబ్బింగ్ జానకి) కలిసి లాంతరుతో గోదావరి ఒడ్డుకు వెళ్లి వేచి చూస్తారు. జ్యోతి అప్పటికే అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది. కోడలు ఎంతకీ రాకపోతే, సోమయాజులు వంట మనిషితో, "చీకటి పడింది కదా! దారి తప్పి ఉంటుంది", అంటాడు. చక్కని మాట.
అన్నీ చూసుకోవడానికి కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురుం!
గమనిక: నేను కూడా ఈ సినిమా లో ఎదురయ్యిన ప్రశ్నల గురించి ఆలోచించాను. నాకు ఏమిటి అనిపించింది అంటే, జ్యోతి రోజూ పిల్లాణ్ణి ఇంట్లో వదిలి, చదువుకోవడానికి పట్నం వెళ్ళేదికదా? పెళ్లి అయ్యాక కూడా అలాగే, పొద్దున్నంతా సోమయాజుల ఇంటికి వచ్చి పిల్లాణ్ణి చూసుకుని సాయంత్రం భర్తా దగ్గరకు వెళిపోతే సరిపోయేది కదా? ఎలాగూ అనిల్ కపూర్ పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లి సాయంత్రమే ఇంటికి వస్తాడు కదా? అని.
ఎలాగుంది నా అవుడియా? మరీ చిన్నపిల్లాడి లాగా ఉందా? తప్పంటారా?

- అసలు జ్యోతి మళ్ళీ పెళ్లి చేసుకోవడం రైట్ ఆ?
- వేరే పెళ్లి చేసుకున్న అంతమాత్రాన తను తొమ్మిది నెలలు మోసి, కని, పెంచిన కొడుకు మీద సర్వహక్కులు కోల్పోతుందా?
- ఏదో కొడుకు భవిష్యత్తులో తనను ద్వెషిస్తాడేమో అన్న భయంతో తనను విడిచిపెట్టేయ్యడం వివేకమా? అసలు తను పెంచి, పెద్దచేసిన కొడుకు తనను ఎందుకు ద్వేషిస్తాడు?
- కొడుకు పోయి, కోడలు చెప్పా,పెట్టకుండా ఎవర్నో పెళ్లి చేసుకుని, తన మొదటి భర్త తద్దినం రోజే తన బిడ్డను అడగటానికి వస్తే కుమిలిపోతున్న తల్లిదండ్రులను "మీ కర్మ ఇంతే, నా బిడ్డను ఇచ్చెయ్యండి", అనడం సబబా?
ఈ సినిమా లో నేను మరిచిపోలేని డైలాగ్ ఒకటి ఉంది. కోడలు రాత్రైనా తిరిగి రాలేదు అని సోమయాజులు, వంట మనిషి (డబ్బింగ్ జానకి) కలిసి లాంతరుతో గోదావరి ఒడ్డుకు వెళ్లి వేచి చూస్తారు. జ్యోతి అప్పటికే అనిల్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది. కోడలు ఎంతకీ రాకపోతే, సోమయాజులు వంట మనిషితో, "చీకటి పడింది కదా! దారి తప్పి ఉంటుంది", అంటాడు. చక్కని మాట.
అన్నీ చూసుకోవడానికి కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. కృష్ణం వందే జగద్గురుం!
గమనిక: నేను కూడా ఈ సినిమా లో ఎదురయ్యిన ప్రశ్నల గురించి ఆలోచించాను. నాకు ఏమిటి అనిపించింది అంటే, జ్యోతి రోజూ పిల్లాణ్ణి ఇంట్లో వదిలి, చదువుకోవడానికి పట్నం వెళ్ళేదికదా? పెళ్లి అయ్యాక కూడా అలాగే, పొద్దున్నంతా సోమయాజుల ఇంటికి వచ్చి పిల్లాణ్ణి చూసుకుని సాయంత్రం భర్తా దగ్గరకు వెళిపోతే సరిపోయేది కదా? ఎలాగూ అనిల్ కపూర్ పొద్దున్నే ఉద్యోగానికి వెళ్లి సాయంత్రమే ఇంటికి వస్తాడు కదా? అని.
ఎలాగుంది నా అవుడియా? మరీ చిన్నపిల్లాడి లాగా ఉందా? తప్పంటారా?
Monday, August 10, 2009
మరొక్క సారి మాస్టర్
శివ, రత్నం, సుబ్బు, సుద్దు అని నలుగురు మిత్రులు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అందరూ కెరీర్లో మొదటిమెట్టు పైన ఉండటంతో అందరివీ చిన్న జీతాలే. ఇంట్లో వంట, సర్దుడు, చిమ్మడం వంటివి వంతులవారిగా చేస్తూ ఉండేవారు. ఎప్పుడూ సుద్దుగాడు అన్ని పనులూ తప్పించుకునే వాడు. ఒక రోజు అందరూ కలిసి ఎలాగైనా సుద్దుతో టాయిలెట్ కడిగించాలి అని నిర్ణయించుకున్నారు. సుద్దు రాగానే అందరూ లుంగీలు మోకాళ్ళ దాక చుట్టి, సిద్ధంగా ఉన్నారు. అప్పుడు సంభాషణ.
సుద్దు: ఏంటీ? అందరూ ఖాళీగా ఉన్నట్టున్నారు.
శివ: తమరు వేంచేస్తున్నారు అని మేము వెయిట్ చేస్తున్నాము.
సుద్దు: ఎందుకు? ఏదైనా విషయంలో నా సలహా కావాలా?
రత్నం: సహాయం కావాలి.
సుద్దు: ఏంటో! మీకు నా మీద ఈ నమ్మకం. సరే, చెప్పండి. ఏం చెయ్యాలి?
సుబ్బు: ఏమి లేదు. చాలా రోజుల బట్టి నీ చేత శ్రమదానం చేయించమని మన సెంద్ర బాబు తెగ మొహమాట పెట్టేస్తున్నాడు.
రత్నం: ఆ మధ్య నీ చేత అన్నం వండిద్దాము అనుకుంటే cookerనే పేల్చేసావు.
సుద్దు: ఏంటి మామ? ఇంకా ఆ చేదుగతం మరిచిపోలేదా?
శివ: అందుకేగా, నీ చేత మళ్ళీ శ్రమదానం చేయ్యిస్తున్నాము.
సుద్దు: నో నో నో.
రత్నం: ప్లీజ్ మాస్టర్.
సుద్దు: ఓ కే. ఇంతకీ ఏమిటి ప్లాన్?
శివ: టాయిలెట్ క్లీనింగ్.
సుద్దు: తప్పదంటారా?
సుబ్బు: పగిలిపోతుంది.
సుద్దు: ఏమిటి?
రత్నం: ముక్కు. అదే! క్లీన్ చెయ్యకపోతే ఆ వాసనకి ముక్కు పగిలిపోతుంది.
( టెన్షన్ తట్టుకోలేక మొత్తానికి సుద్దు కడగటం మొదలుపెట్టాడు).
శివ: మాస్టర్, మొదటిసారి అయినా మీరు అదరగొట్టేసారు మాస్టర్.
సుద్దు: నాకూ పెద్ద అలవాటు లేదయ్యా, ఏదో మీ ఉత్సాహం చూసి సరదాగా హంగు చేద్దామనిపించింది, అంతే!
శివ: ఈ శ్రమకి కొంచెం acid కలిసిందంటే దుమ్ము దులిపేస్తుంది.
సుద్దు: acid ఆ నా వల్ల, నో నో.
రత్నం: ప్లీజ్.
సుద్దు: ఓ కే.
(అయిపొయింది).
సుబ్బు: మాష్టారు, మాస్టారు క్లీనింగ్ లో మెగాస్టారు!
రత్నం: మాష్టర్, మనకు ఇంకో టాయిలెట్ ఉంది. మీరు తలుచుకుంటే అది కూడా అయిపోతుంది.
సుద్దు: నేనా, మరో టాయిలెటా? నో ఛాన్స్!
శివ: హే,ప్లీజ్ మాస్టరు. మీ టాయిలెట్ టాలెంట్ ఏమిటో మీకు తెలియదు. రిహార్సల్ లేకుండానే ఫస్ట్ టేక్ లో పూర్తి చేసారు. definite గా తరువాతిగది కూడా సూపర్ హిట్ ఏ.
సుద్దు: తప్పదంటారా?
శివ: తప్పదు!
సుద్దు: మీరు నా ప్రజలు,మీ కోసమే నేను జీవిస్తున్నాను. మీ కోసం ఏదైనా ఓ కే.

Saturday, August 8, 2009
కలగూరగంప
సాల్ట్ లేక్ సిటీకి వచ్చేసాను. ఇక్కడ కి వచ్చాక భారతదేశంలో enjoy చేసినంత ఎంజాయ్ చేస్తానో లేదో తెలియదు కానీ, ఆ తెలుగుదనాన్ని ఆ భారతీయతని కచ్చితంగా మిస్ అవుతాను. ఏవో గతంలోవే గుర్తు చేసుకుని ఈ టపావళి (బ్లాగు) ని నడిపించాలి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా కూర్చి టపలు వ్రాయడం అంటే చాలా కష్టం. అందుకే గుర్తు వచ్చింది వచ్చినట్టు వ్రాసేయ్యాలి అని నిర్ణయించుకున్నాను.
% మన తరం అమ్మాయిలు అందరికీ అభిమానకథానాయకుడు అంటే నాగార్జున. ఒక సారి ఒకమ్మాయి నాగార్జున గురించి పొగడటం మొదలెట్టి, "అసలు మణిరత్నం అంతటి డైరెక్టర్ తమిళ్ హీరోస్ అందరినీ వదిలేసి మరీ తెలుగులో నాగార్జున ని పెట్టి గీతాంజలి సినిమా తీసాడు అంటే, నాగార్జున గొప్పదనం తెలుసుకోవచ్చు", అంది. వెంటనే పక్కన ఉన్న ఫ్రెండ్, "అది కాదు సంగతి. మొత్తం ఇండియా అంతా వెతికినా కాన్సర్ పేషెంట్ లాగా ఉండే హీరో ఎక్కడా కనబడి ఉండడు. అందుకే వాడినే హీరోగా ఎంచుకుని ఉంటాడు. అలాంటి మొహాన్ని కూడా చూసి పరవశించే ప్రజలు ఆంధ్ర లో తప్ప ఎక్కడా ఉండరు అని ఫిక్స్ అయ్యే తెలుగులో సినిమా తీసి ఉంటాడు", అన్నాడు.
% శ్రీ రామదాసు సినిమా విడుదల అయిన కొత్తల్లో మా అన్నయ్య, "శ్రీ రామదాసు క్యారెక్టర్ కి నాగార్జున కరెక్ట్ రా", అన్నాడు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే, నాగార్జున action సంగతి ఎలాగ ఉన్న, dialogue delivery చూస్తె చెవుల్లో yorker delivery పడినంత నొప్పి కలుగుతుంది. నా మొహం చూసి తను మళ్ళీ, "రామదాసు పాటలు కూడా వీడికి తగ్గట్టు - ఎక్కడా ఒత్తులు ఉండవు, 'పలుకే బంగారమాయెనా, కోదండపాణి', చూడు, ఒక్క ఒత్తు లేదు. ఫ, భ, ఘ లాంటి ఘనమైన అక్షరాలు కూడా లేవు", అన్నాడు. నిజమే అనిపించింది. నాగార్జున భక్తులను బక్తుల గానూ, భగవంతుణ్ణి బగవంతుడి గానూ, శాస్త్రాలను షాస్త్రాలు గానూ మార్చేస్తుంటే విని మూర్చబోయిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను.
% మా బంధువు పెళ్ళిచూపులకి వెళ్తే అక్కడ పెళ్లి కూతురు "స్వప్న వేణువేదో", అనే సినిమా పాట పాడింది. శంకర శాస్త్రి కి sub-junior లాగా ఉండే మా బంధువు నవ్వుకుని వచ్చేసాడు. మొత్తానికి పెళ్లి అయ్యింది. ఆ తరువాత నేను కలిసినప్పుడు ఆవిణ్ణి అడిగాను, "మరీ ఆ పాట పాడమని ఎవరు సలహా ఇచ్చారు?", అని. దానికి ఆమె, "అదేంటి సందీపు అలాగంటావు? నేను ఐతే 'దాయి దాయి దామ్మ' పాట పాడదాము అనుకున్నాను, తెలుసునా? ఆ పాట పాడుంటే ఏమయ్యేది అంటావు?", అంది. వెంటనే నేను, "ఆ ఏముంది, ఈ పాటికి నేను నీ బదులు ఇంకో అమ్మాయి తో మాట్లాడుతూ ఉండేవాడిని", అన్నాను.
% ఆవిడే ఇంకో సారి నా స్నేహితురాళ్ళని చూసి, "సందీపు, నేను కూడా జీన్సుపాంటు వేసుకుంటే ఎలాగుంటుంది అంటావు?", అంది. వెంటనే నేను, "మీ నాన్నగారు ఒప్పుకుంటారో లేదో", అన్నాను. "అదేంటి, మా వారు ఒప్పుకోవాలి కానీ,మా నాన్న ఎందుకు ఒప్పుకోవాలి", అంది. నేను, "మీ వారు ఎలాగూ ఒప్పుకోరు. నిన్ను తీసుకెళ్ళి పుట్టింట్లో అప్పగిస్తాడు. అప్పుడు మీ నాన్నగారే కదా ఒప్పుకోవాలి", అన్నాను.

Thursday, July 9, 2009
బాలాయణం - 3
బాలాయణం అంటే బాల్యంలో చేసిన సరదా పనులు, పలికిన మాటలు, చేష్టలు అని గతంలో ఒక టపలో నేను చెప్పాను. ఇప్పుడు దాన్నే అనుసరించి!
ఇందులో మొదటి ముఖ్యాంశం ఏమిటి అంటే పిల్లలకు డబ్బు విలువ ఎలాగ తెలుస్తుంది అని. చిన్నప్పుడు మనకు ఎంతో ఇష్టమైన ఒక వస్తువు వెల తెలుసుకుని అన్నిటినీ దానితో పోల్చుకుని విలువ తెలుసుకుంటాము. అలాంటి సరదా ఉదాహరణలు.
% మా ఫ్రెండ్ ఒకడు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాడు. అప్పట్లో మాబోటి మధ్యతరగతి వాళ్ళకి సైకిల్ నేర్చుకోవాలి అంటే సైకిల్ అద్దెకి (బాడిగకి) తీసుకోవాలి. అలాగ సైకిల్ తొక్కుకుంటూ ఉంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. రెండే రెండు చేక్రాల మీద handle ఒదులుగా పట్టుకుని అలాగా పల్లంలో వెళ్తూ ఉంటే నాసామిరంగ! భలే ఉంటుంది. ఇంక, నా మిత్రుడు వాళ్ల ఇంట్లో ఏది కొన్నా "అమ్మో, ఐదు రూపాయలా - అంటే సైకిల్ పది గంటలు బాడుక్కి తోక్కుకోవచ్చ్చు", అంటూ ఉండేవాడు.
% ఇంకో మిత్రుడికి reynolds పెన్ పిచ్చి. ఇంట్లో "సినిమాకి వెళ్దాము రారా", అంటే, "వద్దు ఆ డబ్బులతో నాకు black ink reynolds pen కొనండి", అనేవాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యినట్టు వయసు ముదిరేకొద్దీ ఆ reynolds నెమ్మదిగా, pilot, prasad, fountain pen కూడా అయ్యింది.
ఇక పోతే చిన్నప్పుడు ఉండే అరకొర జ్ఞ్యానం చాలా విచిత్రమైన సందర్భాలకు దారితీస్తుంది. మనకు చిన్నప్పుడు తెలిసీతెలియని పదాలు వాడేస్తూ ఉండటం వలన జరిగే హాస్యం సరదాగా ఉంటుంది. అలాంటి ఉదాహరణలు:
% నా మిత్రుడు ఒకడికి english బాగా మాట్లాడాలి అని కోరిక. వాడికి మూడో తరగతిలో అలాద్దిన్ పాఠంలో father-in-law అనే పదం తెలిసింది. కరెక్ట్ గా వాళ్ల నాన్నగారి మిత్రులు అందరూ ఉన్నప్పుడు ఆయన్ని father-in-law అని పిలిచాడు. వాళ్ల నాన్న కాఫీ తాగుతున్నవాడు ఖంగు తిన్నాడు. "అదేమి కూతరా?", అని అడిగితే, "father అంటే చిన్నగా ఉంది నాన్న. father-in-law అంటే పెద్దగా వినడానికి బాగుంది నాన్న", అన్నాడు.
% నాకు తెలుగు బాగా వచ్చునని మా స్కూల్లో మంచి పేరు ఉండేది. మనకి తొంగుఎ చొంత్రొల్ లో ఉండదేమో, నాకు తెలియకుండానే చాలా హాస్యం పండించాను. నా రెండో తరగతిలో ఒక టీచర్ "ఏకసంతాగ్రాహి అంటే ఏమిటిరా?" అని అడిగారు. వెంటనే నేను, "ఒకళ్ళే సంతానం ఉంటే ఏకసంతాగ్రాహి అంటారు సర్", అన్నారు. సంతాగ్రాహికి సంతానానికి లంకె పెట్టగలిగిన నా తెలివికి ఆయనకీ మతిపోయింది.
% ఇంక ఆరులో అడుగు పెడుతూనే అరిపించేసాను. మా economics టీచర్ మాకు జీవితంలోనే మొదటిసారి economics పరిచయం చేస్తున్నాను అనే ఆనందంలో ఉన్నారే కాని ఆయనకీ భోజనం చేస్తే మనిషి కారు. కళ్లు ఎర్రగా అయ్యిపోయాయి. ఆయన ఆవులిస్తున్నారు. అది చూసి మిగతావాళ్లకు కూడా నిద్ర వచ్చింది. మొదటి వరుసలో కూర్చోవడం వలన నాకు కళ్లు తెరిచి నిద్రపోవడం అలవాటయ్యింది. ఉన్నట్టుండి క్లాసులో గోల ఎక్కువయ్యి ఆయనకు కోపం వచ్చి, అందరికీ economics ఔన్నత్యం గురించి ఒక పెద్ద క్లాసు పీకారు. బుద్ధిగా కనబడ్డ నన్ను ఉత్సాహపరచడానికి, "ఒరేఇ, అర్థశాస్త్రం అంటే ఏమిటిరా?", అన్నారు. వెంటనే నేను, "అర్థశాస్త్రం అంటే సగం వ్రాసి వదిలేసిన శాస్త్రం సర్", అన్నాను. ఆయనకు మత్తు అంతా వదిలేసింది.

Friday, July 3, 2009
జీవితాలను ముడి వేసే ప్రేమ
ఏదో పరాకు గా ఉంటే, స్వచ్ఛమైన ప్రేమ యొక్క ఔన్నత్యం గురించి ఒక చిన్న తవిక వ్రాయాలి అనిపించింది. ప్రేమ అనే పదం మన తరంలో చాలా దుర్వినియోగానికి గురి అవుతోంది అని నా అభిప్రాయం. ప్రేమలో మోహం, అభిమానం, త్యాగం, బాధ్యత మొదలైనవన్నీ ఉండాలి. అయితే మన తరంలో మొహానికి, మోహానికి ఉన్నంత విలువ మిగతా వాటికి లేవు అనిపిస్తుంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే...
కలలు చూపే నేత్రమో, మేమెదురు చూసిన చైత్రమో
కదలకుండే కాలమో, మా కథను పలికే కావ్యమో
ఏమనుకోము ఓ ప్రేమ? నువ్వేవరనుకోము ఓ ప్రేమ?
కలువ కన్నులలోన వెన్నెల విరియజేసే చంద్రమా
చలువగాలులు మదిని నింపే పున్నమింటి సంద్రమా
మహిమ నీది, మరులు మావి
కలము నీది, కవిత మాది
ఇన్ని జంటల పంట పండగ వెంట నిలచిన దైవమా
మోడుగుండెల నాడి తెలిసి జోడు కలిపిన వేదమా
తోడునీడగ మెలగు ఎడదల మ్రోగుచుండే నాదమా
బలము నీది, కలలు మావి
తలపు నీది, గెలుపు మాది
కోటి పూవుల తోటి మా యెదతోట నింపు వసంతమా

Subscribe to:
Posts (Atom)