Tuesday, January 6, 2009

మాటల గారడీ

మాటలతో గారడీ చెయ్యడం నాకు భలే ఇష్టం. అలాగా చేసేవాళ్ళంటే నాకు ముచ్చట. నా జీవితంలోనేను చేసిన చిన్న చిన్న ప్రయోగాలు :)

* మా తాతయ్యతో కలిసి ఒకసారి జ్యోతిష్యం గురించి చర్చిస్తున్నాను. అప్పుడు ఆయన మీనలగ్నం మనుషుల గురించి చెప్తూ అన్నారు: "వీళ్ళు స్వర్థపరులే కానీ ,తన బంధువులంటే మహాప్రీతి". అప్పుడు నేను అన్నాను: "అంటే, కాఫీ నీళ్లు ఇవ్వడు కానీ, కాపీనం ఉంటుంది , అంతేనా?", అన్నాను.

* మా బందువోకాయన నా జ్యోతిష్య విద్యను చూసి "బాగా నేర్చుకున్తున్నావురా. జాతకచక్రవర్తి", అన్నారు. అప్పుడు నేను అన్నాను, "అందరూ జాతకచక్రవర్తులే", అని. దానికి ఆయన అర్థం కాలేదన్నట్లు మొహం పెట్టారు. అప్పుడు చెప్పాను. "జాతకచక్రవర్తుల" అంటే "జాతకచక్రాన్ని అనుసరించి నడుచుకునేవాళ్ళు", అని. అందరూ వారి వారి జాతకచక్రాలను బట్టి ప్రవర్తిస్తారు. బుద్ధి కర్మానుసారిణి. జాతకచక్రం కర్మకు దర్పణం. (వర్తి = అనుసరించేడివాడు).

* ఒక పెళ్ళిలో నేను మా తాతయ్యతో కలిసి కూర్చున్నాను. అందరూ భోజనానికి వెళ్ళారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పంతులుగారు మాత్రం అక్కడ ఉన్నారు. మా తాతయ్యకు నాలిక లాగి, "ఒరేయ్, చుట్ట కాల్చుకోవాలని ఉంది", అన్నారు. అప్పుడు నేను "కాల్చుకోండి తాతయ్య", అన్నాను. "ఇక్కడ నేను ఒక్కన్నే చుట్ట కాలిస్తే పొగరుబోతు అనుకుంటారు.", అన్నారు తాతయ్య. అప్పుడు, "తాతయ్య, మీరు ఆ గదిలో కూర్చుని కాల్చుకోండి", అన్నాను. "పద, వెళ్దాం", అన్నారు. అప్పుడు "ఒరేయ్, అగ్గి పెట్టి లేదు. ఇప్పుడు కొని తేవలిస్తే చాలా దూరం వెళ్ళాలి", అన్నారు. అప్పుడు నేను "తాతయ్య, హోమానికి వాడిందే, దూమానికీ వాదేద్దాం!", అన్నాను. అక్కడ నా ప్రాసకు మా తాతయ్యకు బాగా నవ్వు వచ్చింది.

* మా కజిన్ తో కలిసి తన అత్తవారి ఇంటికి వెళ్లాను. వల్ల అత్తవారు కొన్నాళ్ళు తమిళనాడు లో ఉండబట్టి వారికి బాగా తమిళం అలవాటయింది. నాకూ తమిళం లో ప్రవేశం ఉంది. ఏదో మాటల్లో ఆవిడ, "ఇవర్కు కొంజెం సంబర్పోడి కుడితిరుక్కుం", అన్నారు. మా బావ "అంటే ఏమిటిరా", అన్నాడు. నేను, "నీకు సామ్బార్పొడి బదులు
కుడితే ఇస్తే బాగుండేది అంటున్నారు బావా", అన్నాను. మా బావ అవాక్కయ్యాడు. ఇంతలొ శాంతపరిచి అసలు విషయం చెప్పాను.

No comments: